ప్రకృతి సౌందర్యాల కాణాచి డల్హౌసీ!
ఉద్యోగరీత్యా, ఇతరత్రా రాజధాని నగరం ఢిల్లీలో స్థిరపడిన మాకు ఇక్కడ ఎండలు భరించడం అలవాటయిపోయింది. కానీ ఏప్రిల్ మాసం నుండే ఎండలు తమ తీవ్ర రూపాన్ని ప్రదర్శించగా, జూన్‍లో ఏదైనా హిల్ స్టేషన్‍లో గడపాలన్న కోరిక నాకు, మా వారికి కలిగింది. అదివరకు ఎన్నోసార్లు చూసిన షిమ్లా, ముస్సోరి, నైనిటాల్‍కి కాకుండా ఇంతవరకు చూడని క్రొత్త ప్రదేశానికి వెడదామన్న ఆలోచన కూడా వచ్చింది. కొంత పరిశోధన తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, చంబా జిల్లాలో ఉన్న డల్హౌసీ …