మానవ-సమాన AI వచ్చేస్తోంది!
మనిషి పుట్టుక పుట్టకపోయినా.. మనలాగే అన్ని పనులు చేయగలిగితే.. మానవుడి వలె ఆలోచించగలిగితే… అదే ‘ మానవ-సమాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అవుతుంది. శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా విశేష కృషి ఫలితంగా ఈ అధునాతన టెక్నాలజీని ప్రపంచం త్వరలోనే అందిపుచ్చుకోబోతోంది. ఇందుకు సంబంధించి గ్లోబల్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇటివల కీలకమైన ప్రకటన చేసింది. అత్యంత సంక్లిష్టమైన సవాళ్లతో కూడిన ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ)’ రూపకల్పన పోటీలో తాము గమ్యానికి చేరువయ్యామని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ సొంతం చేసుకున్న …