బృహత్సంహితలో భూగర్భజలాల ఉనికి
ఒక ప్రాంతంలో సహజ పరిస్థితులలో పెరిగే వృక్షజాతులు మరియు నివసించే జంతు సమూహాలు ఆ ప్రాంతంలో దొరికే భూగర్భజలాల ఉనికిని సూచిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఔను అని చెప్పవచ్చు.ఈ విషయంలో వరాహమిహిరుడు (క్రీ.శ. 505-587) రచించిన బృహత్సంహితలో వివరించటం జరిగింది. వృక్ష సమూహాల లక్షణాలు 15అడుగుల నుంచి 562 అడుగుల వరకు ఉండే భూగర్భజలాల ఉనికిని తెలియజేస్తాయని చెప్పబడింది. ఈ పరిశీలనలు సెమి ఎరిడ్, ఏరిడ్ వాతావరణంకు సంబంధించినవి. వరాహమిహిరుడు ఉజ్జయిని ప్రాంతంలో జీవించాడు. వరాహమిహిరుడి …