పంప మహాకవి గాథ
తెలుగుభాషకు ప్రాచీనహోదానిచ్చింది కుర్క్యాలలోని బొమ్మలగుట్ట త్రిభాషాశాసనం. ఈ శాసనం క్రీ.శ.945 ప్రాంతందై వుంటుందని కుర్క్యాలశాసనాన్ని పరిశోధించి, పరిష్కరించి వెలుగులోనికి తెచ్చిన నేలటూరి వేంకట- రమణయ్య అభిప్రాయం. ఈ శాసనంలో పేర్కొనబడ్డ రెండు ప్రదేశాలలో ఒకటి సిద్ధశిల. దీనిమీదనే శాసనం, బొమ్మలమ్మ (చక్రేశ్వరి), ఆద్యంత తీర్థంకరులు, ఇతర జైనమునుల శిల్పాలు చెక్కబడ్డాయి. రెండవది వృషభాద్రి. బొమ్మలమ్మగుట్టనే వృషభాద్రి అంటారు కాని, నేలటూరి అభిప్రాయం ప్రకారం ఈ గుట్ట ఎక్కడుందో గుర్తించబడలేదు. అంతేకాదు కుర్క్యాల శాసనకర్త జినవల్లభుని సోదరుడు మహాకవి …