ఫెడరల్ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం
కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ అధ్యక్షతన నియమించిన కమిటీ యిచ్చిన నివేదిక ఆధారంగా విద్యా మంత్రిత్వశాఖ ఒక విధాన పత్రాన్ని 67 పేజీలతో తయారు చేసింది. జాతీయ విద్యావిధానం – 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం 2020 జులై 29న ఆమోదించింది. ఈ విధానపత్రం మనదేశాన్ని నాలెడ్జి సెంటర్‍గా మారుస్తుందని, మనదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శి అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత ఉపఖండం వివిధ భాషలు, ప్రజలు, మతాలు, కులాలు, చరిత్ర, సంస్కృతులు వంటి విభిన్నతకు నిలయమని, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన …