వారసత్వ సంపద పరిరక్షణ వర్తమాన సమాజపు బాధ్యత
ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అనేక సముదాయాల సమాహారమే వారసత్వ సంపద. ఆ సముదాయాల సమాహారం అనేక రూపాల్లో ఉండవచ్చు. భావజాలరూపంలో ఉండొచ్చు. నాగరికత, సంస్కృతి, అలవాట్ల వంటి జీవనవిధాన రూపంలో ఉండొచ్చు. భౌతిక రూపాలైన మానవ నిర్మిత కట్టడాలు, దేవాలయాలు, ఆనకట్టలు, నగర నిర్మాణ పద్ధతులు, ఉద్యానవనాలతో పాటు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కళాత్మక నిర్మాణాల రూపంలో ఉండొచ్చు. వీటిని కాపాడుకుంటూ ముందు తరాలకు అందివ్వడమనేది వర్తమాన సమాజపు బాధ్యత. ఆ …