‘‘గోదావరి వరదలు ప్రకృతి విపత్తే’’ కాళేశ్వరం పంప్ హౌజ్ మునకపై TJAC లేవనెత్తిన అంశాలకు వివరణలు
జులై 12, 13, 14 తేదీల్లో రాష్ట్రంలో కురిసిన అతి భారీ వర్షాలకు గోదావరి నదిలో వచ్చిన వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నేపల్లి పంప్‍హౌజ్‍లను పూర్తిగా ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ మునకకు ప్రకృతి విపత్తే కారణం అని కళ్ళకు కనబడుతూనే ఉన్నది. ఈ విషయంలో ఏమీ ఆందోళన చెందే అవసరంలేదు. ఇటువంటి సంఘటనలు గతంలో ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలో ఇతర ప్రాంతాలలో కూడా సంభవించాయని సాగునీటి శాఖ ఎత్తిపోతల …