Day: September 1, 2022

కాలం… ఒక నిర్ధారిత చరిత్ర

కాలం కేవలం సమయసూచిక కాదు. అది ఒక నిర్ధారిత చరిత్ర. దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక ఈ సంచికతో 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ పది సంవత్సరాల సమయంలో ప్రధాన మీడియాకు భిన్నంగా, ప్రత్యమ్నాయ పత్రికగా సమాజం పట్ల జర్నలిజం నిర్వర్తించవలసిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించింది. సామాజిక సంక్షోభాలూ, సంక్లిష్టతలూ ముసురులా కమ్మి అన్ని రంగాలనూ కుదిపేస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్య పరిచి, ఆచరణ వైపు నడిపించవలసిన ప్రధాన మీడియా తన కర్తవ్యానికి దూరమవుతున్నప్పుడు ఆలోటును భర్తీ …

కాలం… ఒక నిర్ధారిత చరిత్ర Read More »

పేర్వారం జగన్నాథం

అభ్యుదయ కవితోద్యమ తరువాత తెలుగు సాహితిలో ఆకర్షించినవారు చేతనా వర్తకవులు. మనిషి ఆత్మానుభూతి నుంచి సమాజ చైతన్యంలోకి ప్రయాణిస్తున్నాడనే స్పృహతో వీరు కవిత్వం రాశారు. దీనిని చేతనా వర్తమానిగా పిలిచారు. తెలంగాణకు చెంది, ఓరుగల్లు నేలకు చెందినవారు సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, సంపత్కుమార, వేనరెడ్డి. చేతనావర్తకవిగా సుప్రసిద్ధులైన పేర్వారం జగన్నాథం గారు ప్రధానంగా అధిక్షేప కవి. పఠాభి ‘ఫిడేలు రాగాలు డజన్‍, కవితా సంపుటిని రచించి అధిక్షే కవిగా ప్రసిద్ధులయ్యారు. పఠాభి తరువాత వెంటనే గుర్తుకు వచ్చే …

పేర్వారం జగన్నాథం Read More »

గొప్ప విజయము

సరిగ్గా పదిసంవత్సరాలు. తెలంగాణ ఉద్యమం చివరి దశ 2009 డిసెంబర్‍కి తెలంగాణ ప్రకటన వచ్చి, వెనుకంజ వేసిన సంక్షోభకాలం. తెలంగాణ మళ్లీ క్రాస్‍రోడ్స్లో నిలబడింది. ఉద్యమం ఉవ్వెత్తున జరగవలసిన సందర్భంలో ఉన్నది. అలాంటి సంక్షుఛిత సందర్భంలో మాసపత్రికగా ‘దక్కన్‍ల్యాండ్‍’ ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాఫ్రంట్‍ నాయకుడు మణికొండ వేదకుమార్‍ ఈ పత్రికను స్థాపించి, సంపాదకుడిగా ఉన్నారు. అప్పుడు సందిగ్ధ సందర్భంలో ప్రారంభమయిన ఆ ‘దక్కన్‍ ల్యాండ్‍’’ నిర్విఘ్నంగా, నిర్విరామంగా, పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప …

గొప్ప విజయము Read More »

మాణిక్య మహాప్రభువు ‘మహబూబ్‍ అలీ పాషా’

నయాపూల్‍ దాటాక ఎడమవైపున్న నాయబ్‍ హోటల్‍ పక్క సందులోకి మళ్లితే చత్తాబజార్‍ వస్తుంది. అక్కడి సిటి సివిల్‍ కోర్టు వెనక భాగాన ఉన్నదే పురానీ హవేలీ. ఐదవ కులీ కుతుబ్‍ షాకు (1580-1612) ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్‍ మోమిన్‍ అస్త్రాబాదీ నివాసమే ఈ హవేలీ. ఇది అవతలి వారికి కనబడకుండా ఉండటం కోసం దీని చుట్టూ ఒక మైలు దూరం వర్తులాకారంలో ఎత్తైన ప్రహారీ గోడను నిర్మించారు. రెండవ నిజాం మీర్‍ అలీ ఖాన్‍ తన కుమారుడు, …

మాణిక్య మహాప్రభువు ‘మహబూబ్‍ అలీ పాషా’ Read More »

నలభై అడుగుల ఆలయపునర్నిర్మాణానికి నాలుగు దశాబ్దాలా? (జాకారం శివాలయం ఆవేదన)

మనదేశంలోనే ఎత్తైన, సువిశాలమైన తంజావూరులోని రాజరాజేశ్వరాలయ నిర్మాణానికి కేవలం 15 ఏళ్లు పట్టింది. కోణార్క్లోని ప్రపంచస్థాయి సూర్యాలయ నిర్మాణానికి కూడా 15 ఏళ్లే పట్టింది. ఇవి రెండూ ఎప్పుడో వెయ్యేళ్ల నాడు, 800 ఏళ్ల నాడు, ఆధునిక పరికరాలు ఏమీ లేనపుడు, నిర్మాణ స్థల ఎంపిక, రాతి గనుల ఎంపిక, శిల్పుల ఎంపిక, పథక రచన, ఆలయ విడిభాగాలు, వాటిపై రమణీయ శిల్పాలు, ద్వారాలు, స్థంభాలు, గోడలు, దూలాలు, కప్పు, పైన శిఖరం, ముందు మహామండపాలు, ఇలా …

నలభై అడుగుల ఆలయపునర్నిర్మాణానికి నాలుగు దశాబ్దాలా? (జాకారం శివాలయం ఆవేదన) Read More »

తెలంగాణ బ్రాండ్‍ మన దక్కన్‍ ల్యాండ్

‘‘ఉత్తములు ఎప్పుడు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు’’ – గౌతమబుద్ధుడు మనిషి విషపూరిత ఆలోచనలతో సంచరిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రాచీన జానపద కళలను గురించి పట్టించుకునే వాళ్ళెవరు. వాటిని గురించి మాట్లాడే వాళ్ళెవరు, రాసేవాళ్ళెవరు? పురాతన కట్టడాల ప్రాముఖ్యతను గురించి చెప్పే వాళ్ళెవరు. వాటి సంరక్షణ కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళెవరు? ప్రకృతిని గురించి, పర్యావరణ సంరక్షణ గురించి నేటి సమాజానికి కనీస అవగాహన కలిగించేవాళ్ళెవరు? ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే దక్కన్‍ ల్యాండ్‍ మాస పత్రిక. తెలంగాణ …

తెలంగాణ బ్రాండ్‍ మన దక్కన్‍ ల్యాండ్ Read More »

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍కు సద్గురు జగ్గీ వాసుదేవ్‍ లేఖ

దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్టు సద్గురు జగ్జీవాసుదేవ్‍ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే.. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై ‘‘గ్రీన్‍ ఇండియా ఛాలెంజ్‍’’ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍ కి రాసిన లేఖలో ‘‘సేవ్‍ సాయిల్‍ మూమెంట్‍’’ సాధించిన ప్రగతిని సద్గురు వివరించారు.ఈ జఠిలమైన నేలనిస్సార సంక్షోభ సమస్యకు పరిష్కారం చూపించేందుకు తాను …

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍కు సద్గురు జగ్గీ వాసుదేవ్‍ లేఖ Read More »

మానవాళి ముంగిట మరో కొత్త ప్రపంచం @ మెటావర్స్

ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం ఎవరినైనా కలవాలంటే వాయిస్‍ కాల్‍, ఛాటింగ్‍ లేదా వీడియో కాల్‍ ద్వారా కలవడం జరుగుతుంది. అలా కాకుండా టెక్నాలజీ సహకారంతో మనం వారి ఎదురుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఆలోచించండి! మన పని ఒత్తిళ్ళ కారణంగా కాసేపు మానసికఉత్సాహం కొరకు మొబైల్‍ తీసి సామాజిక మాధ్యమాలలోకి ప్రవేశించిన విధంగానే, ఒక వర్చువల్‍ హెడ్‍ సెట్‍ను మన కళ్ళకు ఎదురుగా అమర్చుకొని మనం కోరుకున్న ప్రదేశంలోకి వెళ్ళి కాసేపు వర్చువల్‍గా విహారానికి …

మానవాళి ముంగిట మరో కొత్త ప్రపంచం @ మెటావర్స్ Read More »

సెప్టెంబర్‍ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం

‘‘ప్రపంచవ్యాప్తంగా అన్ని అభివృద్ధి స్థాయిలలోని దేశాలలో, అనేక మిలియన్ల ఉద్యోగాలు, వ్యాపారాలు బలమైన, అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్నాయి. సహజ, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడంలో, భవిష్యత్‍ తరాలు ఆనందించడానికి వాటిని సంరక్షించడంలో పర్యాటకం కూడా ఒక చోదక శక్తిగా ఉంది’’ – మిస్టర్‍ జురబ్‍ పోలోలికాష్విలి పర్యాటక అంతర్జాతీయ ఆచార దినోత్సవం ప్రజలను కీలక చర్చలకు కేంద్రంగా ఉంచుతుంది. టూరిజం ఎక్కడికి వెళుతోంది? మేము ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాము? మరి మనం అక్కడికి ఎలా చేరుకోవాలి?‘‘రిథింకింగ్‍ …

సెప్టెంబర్‍ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం Read More »

సోయి లేని రాతలు, విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్‍ హౌజ్‍లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ సాగునీటి కార్యక్రమాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవీరు గతంలో మిషన్‍ కాకతీయపై కూడా ‘‘కమీషన్‍ కాకతీయ’’ అంటూ విషం గక్కిన అంశాన్ని తెలంగాణ ప్రజలు మరచిపోలేదు. ఇవ్వాళ్ళ మిషన్‍ కాకతీయ ఫలితాలు ఏ విధంగాఉన్నాయో తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు …

సోయి లేని రాతలు, విమర్శలు Read More »