జి. అరవిందన్ – ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు
1955లో సత్యజిత్ రే నవ్య సినిమా ఉద్యమానికి శ్రీకారం చుట్టి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన తరువాత, దేశంలోని పలు చిక్కుల్లో ఉన్న మేధావులు, సినీ అభిమానులలో చాలా మంది ప్రభావితులై, క్రమంగా నవ్య సినిమా పురోగమించింది. అలా ప్రభావితులైన వారిలో దక్షిణ భారతం నుండి ప్రముఖంగా స్వర్గీయ జి.అరవిందన్‍ను చెప్పుకోవచ్చు. అరవిందన్ ఏక్సిడెంటల్‍గా చిత్రసీమలోకి ప్రవేశించాడు. ఆయన ఏ ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్‍లోనూ శిక్షణ పొందకపోయినా, భారతదేశం గర్వపడేలా సినిమాలు తీసిన ప్రతిభాశాలి. 1936 జనవరి 23న …