deccanland

అభివృద్ధి : సుస్థిరత – అస్థిరత్వం – బాధ్యతలు

మనిషి ప్రకృతికి నిలువెత్తు ఆశ. దుర్భలశత్రువు అని అంటారు. ప్రకృతిని పరిరక్షించగలడు. పాడు చేయగలడు. ఒక విధ్వంసమే సృష్టించగలడు. ఇప్పటికీ అది జరిగిపోయింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని నిలువరించటం ఎంతయినా అవసరం. నిలుపుదల దగ్గరే ఆగిపోకుండా వీలయినంతగా మేలు కలిగించే చర్యలు చేపట్టాలి. సమాజాలు అభివృద్ధి చెందటానికి పరిశ్రమలు అవసరం. పరిశ్రమల వెంట వచ్చే కాలుష్యం తప్పనిసరి. నిజానికి పరిశ్రమలు, కాలుష్యం రెండూ కవల పిల్లల్లాంటివి. ఇవి రెండూ కలిసి పెరుగుతాయి. పరిశ్రమలను దుష్టమైనవి అని లనలేం. …

అభివృద్ధి : సుస్థిరత – అస్థిరత్వం – బాధ్యతలు Read More »

వాతావరణ మార్పులతో అల్లకల్లోలం

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రక•తి సహజ ఆవసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తుచేసుకుంటారు.వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు 1950, మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది. ఆ సంస్థ ఏర్పడిన …

వాతావరణ మార్పులతో అల్లకల్లోలం Read More »

మృత్యువుతో ముఖాముఖం

‘చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటేగేలి చేస్తూ పగలబడి నవ్వేవారెవరు?కబళించిన చావును తిరిగి, విసిరిగోడకు దిగ్గొట్టిన వారెవరు? -సముద్రుడు (అజ్ఞాత విప్లవ కవి) ఈసారి సరదాగా మనం కొన్ని చావు కబుర్లు చల్లగా చెప్పుకుందామా?మృత్యువు వ•ందు వ•ఖావ•ఖంగా నిలబడి దాని కళ్లల్లోకి సూటిగా చూస్తూ కాసేపు పరిహాసాలాడుకుందామా?నేనూ, నా సతీమణి – మా ఇద్దరికీ ఏమీ పని పాటా లేనపుడు ఏమీ పొద్దుపోనపుడు మృత్యువును మజాక్‍ చేస్తూ కాలక్షేపం కోసం దానిమీద కొన్ని జోకులేసుకుంటూ ఉంటాం. మచ్చుకు …

మృత్యువుతో ముఖాముఖం Read More »

సీతమ్మలొద్దిలో సిత్రాలకోన

పెద్దపల్లి జిల్లా గట్టుసింగారం గ్రామం అడివిలో సీతమ్మలొద్దిలో అబ్బురపరిచే రాతిచిత్రాలకోన ఆవిష్కారమైంది. ఈ రాతిచిత్రాల నెలవులో వందలాది రాతిచిత్రాలున్నాయి. ఈ చిత్రాలతావును కనిపెట్టింది ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు శ్రీ దుగ్గెంపూడి రవీందర్‍ రెడ్డి(రవి స్టుడియోస్‍, సోమాజిగూడ, హైద్రాబాద్‍). పెద్దపల్లి గ్రామస్తుడైన రవీందర్‍ రెడ్డి గారి భూములు గుట్టల మీద ఎద్దుగుట్ట, సీతమ్మ లొద్దిల దగ్గరున్నాయి. గతంలో పురావస్తుశాఖవారితో పనిచేసిన అనుభవంవల్ల కుతూహలంతో ఆ ప్రదేశాల పరిశీలనలో ఈ కొత్త రాతిచిత్రాల తావును కనుగొన్నారు రవీందర్‍ రెడ్డిగారు. తనకు …

సీతమ్మలొద్దిలో సిత్రాలకోన Read More »

నాటకం సర్వజనీయం

ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‍ థియేటర్‍ ఇనిస్టిట్యూట్‍ వారిచే ప్రారంభించబడింది. నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక పక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్క•తిని …

నాటకం సర్వజనీయం Read More »

మనిషి మెదడులో చిప్‍… ఏ న్యూరాలింక్‍ టెక్నాలజీ!!!

చందమామ కథలో చదివా… రెక్కల గుర్రాలుంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో…!! బాల మిత్ర కథలో చదివా… పగడపు దీపులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో..!! అంటూ ఓ సినీ గేయ రచయిత, ఓ తెలుగు సినిమాలో, ప్రేమికులైన నాయక, నాయికలను కాసేపు ఊహలలోకంలో విహరింపజేస్తారు. మనం కూడా రాత్రి నిద్రపోయే టపుడు ఎన్నో మధురమైన కలలు కంటూ ఊహల్లో తే•లుతూ ఉంటాం. కళ్ళు తెరిస్తే అవేవి మనకు కనిపించవు. కానీ కంప్యూటర్‍ డేటా తరహాలో అలాంటి మధురమైన …

మనిషి మెదడులో చిప్‍… ఏ న్యూరాలింక్‍ టెక్నాలజీ!!! Read More »

ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి గారి పదవీ ఉద్యోగ విరమణ-ఆత్మీయ అభినందన సభ

ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి గారి పదవీ ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ జనవరి 31 కనీ వినీ ఎరుగని రీతిలో డాక్టర్‍ బిఆర్‍. అంబేద్కర్‍ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. 1994లో డా. బి.ఆర్‍. అంబేద్కర్‍ ఓపెన్‍ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సహాయ ఆచార్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టర్‍ అయ్యారు. 1997 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగ మయ్యారు. వారు సీనియర్‍ ప్రొఫెసర్‍ హోదాలో పదవీ విరమణ పొందారు. …

ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి గారి పదవీ ఉద్యోగ విరమణ-ఆత్మీయ అభినందన సభ Read More »

మానవ శ్రేయస్సుకు నీటి అవసరం!

ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. 1992 బ్రెజిల్‍ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివ•ద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNESCO) ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది. సామాజిక ఆర్థిక వ•ద్ధి ఎక్కువగా నీటిపైనే …

మానవ శ్రేయస్సుకు నీటి అవసరం! Read More »

ఆధునికతకు అత్యుత్తమ తోడ్పాటు లీ కొర్‍భూసియర్‍ ఆర్కిటెక్చరల్‍ వర్క్

ఉనికి: చండీగఢ్‍, భారతదేశం(సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍)ప్రకటన తేదీ: 2016వర్గం: సాంస్క•తికం (సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍) (Serial Transmational Site – Cultural) అత్యుత్తమ సార్వత్రిక విలువలీ కొరిభూసియర్‍ డిజైన్‍ చేసిన నిర్మాణాల నుంచి ఎంపిక చేయబడిన, ఈ ట్రాన్స్ నేషనల్‍ సీరియల్‍ ప్రాపర్టీ మొత్తం పదిహేడు సైట్‍లతో కూడుకున్నది. గతకాలంలో ఓ సంచలనాన్ని స•ష్టించిన కొత్త నిర్మాణ భాష యొక్క వినూత్నతకు నిదర్శనం. చండీగఢ్‍ లోని క్యాపిటల్‍ కాంప్లెక్స్ అనేది లా కార్బియుసియర్‍ ఇతర …

ఆధునికతకు అత్యుత్తమ తోడ్పాటు లీ కొర్‍భూసియర్‍ ఆర్కిటెక్చరల్‍ వర్క్ Read More »

బొంతల చెట్లు – నా యాది మనాది

చెట్లు మనుషుల లాంటివే. మనకు ఉన్నట్టే వాటికి కూడా పేర్లు ఉంటాయి. మనకన్నా ముందు నుంచి ఉంటాయి. మన తర్వాత కూడా ఉంటాయి. వాటికీ మనలాగే జనన మరణాలు ఉంటాయి. కొన్ని మన కండ్ల ముందే కనుమరుగు అవుతాయి. అవి బతికినన్ని రోజులు మనకు అందించే సేవలు వెలకట్టలేనివి. అవి మనలను అలరిస్తాయి. సేద దీరుస్తాయి. మన ఆటలకు, మన ముచ్చట్లకు వేదికలవుతాయి. మనకు ఎన్నెన్నో అనుభూతులను మిగులుస్తాయి. మన కుటుంబ ఆస్తిత్వాలలో లేదా మన ఊరి …

బొంతల చెట్లు – నా యాది మనాది Read More »