deccanland

కరీంనగర్‍ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత

(గత సంచిక తరువాయి)ఈ నాణేలను కనుగొన్న ఘనత పక్కనే ఉన్న పట్టణంలో పోస్ట్ మాస్టర్‍గా ఉన్న నరహరికి చెందుతుంది. ఈ విషయంపై పరబ్రహ్మ శాస్త్రి, నేను, నా సహోద్యోగి సూర్యనారాయణరెడ్డి వ్యాసాలు, పుస్తకాలు రాశాం. ఈ నాణేల మొదటి నివేదిక సామాన్య శకం 1978లో ఉంది. తదుపరి తవ్వకాలు సామాన్య శకం 1979-1983లో నిర్వహించబడ్డాయి, అయితే నివేదిక మాత్రం 2006లో ప్రచురించబడింది.ఇది గొప్ప ఆవిష్కరణ. కోటలింగాల వద్ద సామగోప పాలన తరువాత శాతవాహనుల పాలన వచ్చినట్లుగా నిరూపించబడింది. …

కరీంనగర్‍ జిల్లాలో కనుగొన్న పురాతన నాణేల చారిత్రక ప్రాముఖ్యత Read More »

కనకాయి జలపాత సమూహం

ఆదిలాబాద్‍ జిల్లాలో రెండు కొండల వరుసలు పశ్చిమం నుంచి తూర్పుకు సమాంతరంగా సాగుతాయి. పై కొండల వరుస (ఉత్తరపుది) పేరు సత్మల కొండలు కాగా కింది కొండల వరుస (దక్షిణపుది) పేరు నిర్మల కొండలు. రెండు వరుసల మధ్య లోయ(వ్యాలీ)లో గోదావరికి ఉపనది అయిన కడెం నది పారుతుంది. సత్మల కొండల్లో సుమారు పదివాగులు పుట్టి కడెం నదిలో కలుస్తాయి. అయితే పారేటప్పుడు కొండల మీద నుంచి దుంకుతూ వస్తాయి కాబట్టి అవన్నీ… అంటే ప్రతి ఒక్క …

కనకాయి జలపాత సమూహం Read More »

ప్రకృతే సౌందర్యం! 26 ప్రకృతే ఆనందం!! వృక్షజాతి పునరుత్పత్తికి అసలైన వారసులం!

నిర్దిష్ట ప్రామాణికతతో ఏర్పడిన భూమిపై పురుడు పోసుకున్న జీవజాతుల మనుగడకు ప్రకృతి ఓవైవిధ్యభరితమైన విధానాల్ని ఏర్పర్చుకుంది. వృక్షాలుగా, జంతువులుగా ఏర్పడిన జీవుల మధ్యన జీవసంబంధ అవినాభావ బంధం జీవుల మనుగడకు, పునరుత్పత్తికి తోడ్పడం ప్రకృతి ఏర్పర్చుకున్న నిబద్దతకు తార్కాణం! మొక్కలు స్వయంపోషకాలే అయినా, వాటిని భవిష్యత్‍ తరాలకు అందించే బృహత్తర బాధ్యతను నిర్వహించేది కొంతమేర పక్షులుకాగా, అత్యధికంగా దోహదపడేది మాత్రం కీటకాలు కావడం గమనార్హం! తాము బతుకుతూ, యావత్‍ ప్రపంచానికి తిండిపెట్టేది వ్యవసాయదారుడే అయినా, సాగుకు, రక్షణకు, …

ప్రకృతే సౌందర్యం! 26 ప్రకృతే ఆనందం!! వృక్షజాతి పునరుత్పత్తికి అసలైన వారసులం! Read More »

ప్రకృతి సౌందర్యాల కాణాచి డల్హౌసీ!

ఉద్యోగరీత్యా, ఇతరత్రా రాజధాని నగరం ఢిల్లీలో స్థిరపడిన మాకు ఇక్కడ ఎండలు భరించడం అలవాటయిపోయింది. కానీ ఏప్రిల్‍ మాసం నుండే ఎండలు తమ తీవ్ర రూపాన్ని ప్రదర్శించగా, జూన్‍లో ఏదైనా హిల్‍ స్టేషన్‍లో గడపాలన్న కోరిక నాకు, మా వారికి కలిగింది. అదివరకు ఎన్నోసార్లు చూసిన షిమ్లా, ముస్సోరి, నైనిటాల్‍కి కాకుండా ఇంతవరకు చూడని క్రొత్త ప్రదేశానికి వెడదామన్న ఆలోచన కూడా వచ్చింది. కొంత పరిశోధన తర్వాత హిమాచల్‍ ప్రదేశ్‍ రాష్ట్రంలో, చంబా జిల్లాలో ఉన్న డల్హౌసీ …

ప్రకృతి సౌందర్యాల కాణాచి డల్హౌసీ! Read More »

ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు

ఆ రోజుల్లో తిండి వేరు.. ఇప్పుడంతా ఎరువుల తిండి.. తింటే రోగం.. తినకపోతే నీరసం.. ఇదీ పరిస్థితి.. అందుకే ప్రజల ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఆ‘పాత’ మధురం అంటున్నారు.. బామ్మలు, తాతయ్యలు ఒకప్పుడు తిన్న తిండినే ఇప్పుడూ మనమూ ఇష్టపడుతున్నాం.. చోడి జావ, జొన్న రొట్టె, సామలు, అరికెలు అంటూ వెంటపడుతున్నాం.. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు.. దీంతో జిల్లాలో ప్రతి ఒక్కరూ చిరు ధాన్యాలు తింటూ …

ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు Read More »

మా భూమి

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

మా భూమి Read More »

తెలంగాణ చరిత్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్ర

తెలంగాణ చరిత్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్ర. తెలంగాణకు మరోపేరు పోరాటాల పురిటి గడ్డ. ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న ఉద్యమాలకు పాఠాలు చెప్పిన ప్రజా ఉద్యమాల చరిత్ర తెలంగాణా రాష్ట్ర సాధన చరిత్ర. నాగరికత అంటే ప్రకృతి వనరులను వినియోగించుకోగలిగిన సామర్థ్యం. సంస్క•తి అంటే ప్రజల జీవన విధానం. ప్రతి ప్రాంతానికీ తమదంటూ నాగరికత, సంస్క•తి వుంటాయి. ప్రకృతి వనరులను ఎంతబాగా వినియోగించుకోగలిగితే అంతగా నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఆ నాగరికత ప్రజల జీవన విధానంలో పలు …

తెలంగాణ చరిత్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్ర Read More »

భాగ్యరెడ్డి వర్మ

అంబేద్కర్‍ 125వ జయంత్సుత్యవాలు దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకొంటున్నాం. ఆయన రచనలన్నీ ఇప్పుడు వివిధ భాషల్లో ఉచితంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగు యూనివర్సిటీ ప్రచురించిన తెలుగు సంపుటాలు కూడా ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్‍ని భిన్న పార్శ్వాల్లో దర్శించడానికి ఆయన రచనలు దారి చూపిస్తున్నాయి. అయితే అంబేద్కర్‍ కన్నా ముందే దేశవ్యాప్తంగా ‘ఆదిహిందువు’ల, నిమ్నజాతుల (హరిజన అనే పదాన్ని భాగ్యరెడ్డి వర్మ నిర్ద్వందంగా వ్యతిరేకించిండు) వారి నాయకుడిగా గుర్తింపు పొందినవాడు భాగ్యరెడ్డి వర్మ. కాశీనాథుని నాగేశ్వరరావు …

భాగ్యరెడ్డి వర్మ Read More »

నీలమొక్కటి చాలు

‘నిక్కమయిన మంచి నీలమొక్కటి చాలు,తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలచదువ పద్యమరయ జాలదా యొక్కటివిశ్వదాభిరామ వినురవేమ’ఈ వేమన పద్యం తెలియని తెలుగు వారు ఉండరేమో. ఇక్కడ ప్రస్తావించిన నీలము ఒక మహారత్నంగా అందరికి పరిచయం. నవరత్నాలలో దీన్ని విశేషంగా పేర్కొన్నారు. శనితో అనుసంధానించబడటం వల్ల ఈ రత్నం కొంత భయాన్ని, అప్రతిష్ట కూడా మూటకట్టుకుంది. నీలమణి చరిత్రప్రారంభం నుండి మానవ నాగరికతకు సుపరిచితం. గరుడపురాణం ప్రకారం సంహరించబడిన బలి చక్రవర్తి శరీరభాగాలు భూమిపై పడి రత్నాలుగా మారాయి. అందులో …

నీలమొక్కటి చాలు Read More »

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు నిట్ట నిలువుగా చీలింది!

ఇందుర్తి. ఆ ఊరిపేరుతో చాలా ఊర్లున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకునే గ్రామం మాత్రం మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లాలో ఉంది. అటు మునుగోడు నుంచి ఇటు మాల్‍ నుంచి వెళ్లొచ్చు. ఆచార్య అండమ్మగారి ఆహ్వానంపై వాళ్లూరు కొరిటికల్‍ గ్రామంలోని లక్ష్మీనరసింహాలయాన్ని చూచి, ఆమె కారులోనే ఇందుర్తి వెళ్లాం. అక్కడున్న కొందరు మిత్రులు గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లకు తీసుకెళ్లారు. కొంత కారు, కొంత మోటారు సైకిల్‍, మరికొంత కాలినడక. పల్లెటూరి పొలంగట్లు, చెరువుకట్ల వెంట తిరుగుతుంటే, చెట్లూ, గట్టుల …

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు నిట్ట నిలువుగా చీలింది! Read More »