2020

వన్యప్రాణి రక్షణే జీవ వైవిధ్య పోషణ

(కేరళలో గర్భం దాల్చిన ఏనుగు హత్యకు స్పందనగా) కేరళలోని నీలంబూర్‍ అటవీ ప్రాంతంలో గర్భం దాల్చిన 15 సంవత్సరాల వయస్సు గల ఏనుగును క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్‍ భారతదేశ ప్రజలను, జంతు ప్రేమికులను విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనకు స్పందించిన వారిలో రతన్‍ టాటా, విరాట్‍ కొహ్లీ, ఇతర ప్రముఖులతో పాటు అసంఖ్యాక సామాన్య జనం తమ గళాన్ని వినిపించడం ఆహ్వానించదగిన పరిణామం. కరోనా లాక్‍డౌన్‍ కారణంగా వన్యప్రాణులు కొంత స్వేచ్ఛను తీసుకోవడం, మానవ నివాసాలకు దగ్గరగా రావడం కూడా ఏనుగు హత్యకు దారి …

వన్యప్రాణి రక్షణే జీవ వైవిధ్య పోషణ Read More »

జీవవైవిధ్య రక్షణే ప్రాణికోటి సంరక్షణ

ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ప్రాణవాయువును, జీవక్రియల నిర్వహణకు నీటిని, ఆరోగ్య సిద్ధికి పోషకాహారాన్ని మరియు ప్రాణకోటి మనుగడకు అనువైన పరిసరాలను ప్రకృ తి మాత ప్రసాదించింది. గాలి, నేల, నీరు, నింగిల సమ్మిళితమే పర్యావరణంగా పేర్కొనబడింది. ఎన్విరాన్‍మెంట్‍లోని ‘ఎన్విరోనియా’ అనగా పరిసరాలని, వీటిలోకి జీవ మరియు నిర్జీవ పదార్థాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. పర్యావరణంలో నేల, నీరు, గాలి, జీవులు మరియు సౌరశక్తి ప్రధాన భాగాలున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే జీవకోటి ఉనికి ప్రకటితమవుతుంది. భూగోళాన్ని నివాసయోగ్య ఆలయంగా మార్చుటకు …

జీవవైవిధ్య రక్షణే ప్రాణికోటి సంరక్షణ Read More »

జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి…పెంబర్తి మెమెంటోలు

జ్ఞాపిక అనగానే గుర్తుకొచ్చేవి పెంబర్తి హస్తకళారూపాలు అంటే అతిశయోక్తి కాదు. వరంగల్‍ జిల్లా జనగాం మండలానికి చెందిన గ్రామం పెంబర్తి హస్త కళాఖండాలకు దేశవ్యాప్తంగా గొప్ప పేరున్నది. ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు ప్రసిద్ది కాకతీయుల కాలం నుండి పేరొందాయి.పెంబర్తి హస్తకళాకారుల లోహపు రేకుల కళను పెంబర్తి లోహ హస్తకళలుగా వ్యవహరిస్తారు. పెంబర్తి లోహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహాల మీదఉంటాయి. కాకతీయుల కాలం నుండి పెంబర్తి గ్రామం హస్త కళలకు నిలయంగా మారింది. కాకతీయ శైలిని అనుసరించడం వీరి కళ ప్రత్యేకత.పూర్వకాలం నుంచి పెంబర్తి గ్రామం హస్త కళలకు …

జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి…పెంబర్తి మెమెంటోలు Read More »

విచారణే ఓ పెద్ద శిక్ష..!?

తెలుగు కవి ఓ కవితలో ఇలా అంటాడు‘‘ఎన్నో సంవత్సరాలవిచారణ అనే శిక్షని ఎదుర్కొన్న తరువాతరాబోయే శిక్ష ఏ పాటిదిఈ దేశంలోట్రయలే ఓ పెద్ద పనిష్మెంట్‍’’నిజమే. మనదేశంలో ట్రయలే ఓ పెద్దపనిష్మెంట్‍. విచారణ ఖైదీలుగా ఎంతో మంది జైళ్లల్లో బతుకులీడుస్తున్నారు. ఇంకా ఎంతో మంది బెయిల్‍ మీద వుండి విచారణని ఎదుర్కొంటున్నారు. విచారణ తుది దశకి ఎప్పుడు చేరుతుందో తెలియదు. ఎన్ని సంవత్సరాలు వేచి వుండాలో తెలియదు. అప్పీల్లు వగైరాలు ముగించుకొని ఆ ఊబి నుంచి ఎప్పుడు బయట …

విచారణే ఓ పెద్ద శిక్ష..!? Read More »

నల్లమలలో చల్లని పర్యటనలు

‘‘నీ కడుపు చల్లగుండ’’.పెద్ద మనుషులు మనల్ని దీవించేటప్పుడు మనకు వినిపించే ప్రధాన వాక్యం ఇది. కారణం మనది వేడి ప్రదేశం… కాబట్టి మనకు చల్లదనం కావాలి. వేసవి కాలపు సెలవుల్లో చల్లదనం కోసం కూర్గ్, ఊటీ, కొడైకెనాల్‍, కుల్లు-మనాలి వంటి ప్రదేశాలకు ప్లాన్‍ చేసుకుంటుంటాం. డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి మన తెలంగాణలోనే ఏవైనా చల్లని ప్రదేశాలున్నాయేమో ఆలోచించండి. ఏవీ తట్టలేదా? అయితే ఈ వ్యాసం చదవండి… తెలంగాణలోనూ ఉన్న చల్లని పర్యాటక స్థలాలేవో మీకే తెలుస్తుంది.చల్లగా …

నల్లమలలో చల్లని పర్యటనలు Read More »

బాలచెలిమి గ్రంథాలయంతో సెలవుల సద్వినియోగం

నందిమేడారం గ్రామం, ధర్మారం మండలం, పెద్దపల్లి జిల్లా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ హైదరాబాద్‍ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల చెలిమి గ్రంథాలయం గత మార్చి నెలలో పెద్దపెల్లి జిల్లా, ధర్మారం మండలం,  నందిమేడారం గ్రామంలో ఏర్పాటు చేయడమైంది. జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన ఈ గ్రంథాలయం సెలవుల్లో తమ విరామ కాల సద్వినియోగానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అభిప్రాయాలు.. చారిత్రక ప్రాధాన్యం కలిగిన మా ఊరు (నంది మేడారం)లో బాల చెలిమి గ్రంథాలయం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా …

బాలచెలిమి గ్రంథాలయంతో సెలవుల సద్వినియోగం Read More »

వలస బతుకులు

‘‘ఏమే’’ అంటూ బార్య తులసమ్మ వైపు చూస్తూ పలకరిం చాడు ఆమె పెనిమిటి చంద్రయ్య. అతనలా పిలువగానే ‘‘ఏందయ్యా’’ అంటూ అతనివైపు చూస్తూ మారడిగింది. ‘‘పొయ్యి కాడ ఎంతసేపు కూలవడ్తవ్‍, వంట జల్ది కానియ్యరాదే సుతారం జెయ్యక, ‘‘అంటూ గొనిగాడు తలపై చేతితో రుద్దుకుంటూఅతను చూడనికె దుక్కలా కరుకుదేలి చామన చాయతో వుంటాడు కోలమొఖంతో నెత్తికి సమరు లేక ఎర్ర బారింది‘‘ఏందయ్య అట్ట ఆత్రిస్తవ్‍, నాకేమన్న నాల్గు చేతులున్నయా, ఇదేమన్న మిషినా, మనదేమన్న గ్యాసుపొయ్యా’’ అంటూ అతనివైపు …

వలస బతుకులు Read More »

వరహాల భీమయ్య

పుణ్యదంపుతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్యగారు. 1911, అక్టోబర్‍లో ఆయన జన్మించారు. మంథనిలో 7వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 8వ తరగతి కరీంనగర్‍లో, 9,10 తరగతులు హన్మకొండలో పూర్తి చేసారు. హైద్రాబాదులోని సిటీ కళాశాల నుండి ఇంటర్‍ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.ఉస్మానియా యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ తర్వాత రసాయనశాస్త్రంలో ఎం.ఎస్సీ, పట్టా సంపాదించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఫస్టుర్యాంకు సంపాదించి గోల్డ్మెడల్‍ స్వంతం చేసుకొన్నారు. వీరు కరీంనగర్‍ హైస్కూల్లో టీచరుగా …

వరహాల భీమయ్య Read More »

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍

ప్రపంచ వైద్యచరిత్రలో హైదరాబాద్‍కు ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతకన్నా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడి రాజులు వందల ఏండ్ల క్రితమే శ్రద్ధ వహించారు. కుతుబ్‍షాహీ వంశానికి చెందిన సుల్తాన్‍ మొహ్మద్‍ కులీకుతుబ్‍షా 1595లో హైదరాబాద్‍లోని చార్మినార్‍ పక్కనే ‘దారుషిఫా’ అనే వైద్యాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ యునాని వైద్యంలో శిక్షణ నిప్పించడమే గాకుండా, రోగులకు చికిత్స చేసేవారు. రెండంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 40 గదులుండేవి. ఒక్కో గదిలో కనీసం నాలుగు బెడ్ల …

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍ Read More »

ప్రజా వాగ్గేయ సాహిత్యం – ప్రజా వాగ్గేయ కారులు – నేపథ్యం

తెలుగు సాహిత్యంలో ప్రజా కవులు, ప్రజా కళలు, ప్రజా సాహిత్యం లాంటి మాటలు విరివిగానే వాడుకలో ఉన్నాయి. అయితే ప్రజా వాగ్గేయ సాహిత్యం అనే పదం గత రెండు మూడు దశాబ్దాలుగానే ప్రయోగంలో ఉంటూ వస్తున్నది. ఒక అర్థంలో ప్రజావాగ్గేయ సాహిత్యం అనే మాట కొత్తది. సాహిత్యంలో వాగ్గేయ సాహిత్యానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదొక ప్రత్యేక శాఖ. అసలు ప్రజా వాగ్గేయ సాహిత్యం అంటే ఏమిటనే సందేహం వస్తుంది. వాగ్గేయ సాహిత్యం, వాగ్గేయ కవిత్వం, వాగ్గేయ …

ప్రజా వాగ్గేయ సాహిత్యం – ప్రజా వాగ్గేయ కారులు – నేపథ్యం Read More »