ముందుముల నరసింగరావు
పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మకథా కర్తగా, రాజకీయ మేధావిగా, చరిత్రలో నరసింగరావు స్థానం సుస్థిరం. మహబూబ్‍నగర్ జిల్లాలో ముందుమల వారి కుటుంబానికి ఎంతో పేరున్నది. పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన ముందుముల నరసింగరావు మార్చి 17, 1896లో ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. స్వగ్రామమైన తలకొండపల్లిలో ప్రాథమిక విద్య పూర్తి చేసి 1912లో …