2020

చేనుకు చేవ – రైతుకు రొక్కం పచ్చిరొట్ట ఎరువులు

ఆధునిక వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతున్న, పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా దిగుబడులు సాధించలేక పోతున్నారు మన రైతన్నలు. దీనికి ప్రధాన కారణం ఎరువుల యాజమాన్యం రసాయన ఎరువుల వాడకం వలన భూమి నిస్సార మౌవుతున్నాయి. పంటలో రసాయన అవశేషాలు మిగులుతున్నాయి. తద్వారా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలి అంటే ఎరువులను సమగ్రంగా అందించాలి. రసాయన సేంద్రియ ఎరువులను మేళవించి ఉపయోగించుకోవాలి. 60 నుంచి 70 శాతం పోషకాలు సేంద్రియ ఎరువులు నుంచి వచ్చేటట్టు జాగ్రత్త పడాలి. …

చేనుకు చేవ – రైతుకు రొక్కం పచ్చిరొట్ట ఎరువులు Read More »

నీ కోసం ఎదురు చూడని నయనం లేదు

కొన్ని దశాబ్దాల క్రితం ఒక కాలముండేది. గతించిన సంవత్సరాల అందమైన కాలం అది. బంధాల కాలమది. సంబంధాల కాలమది. సంబంధాలన్నిటిని మూట కట్టి, భుజాన వేసుకొని, పాత సైకిల్‍ ఒకటి ఎక్కి, ఓ బక్క పలచని మనిషి వీధి వీధి తిరిగేవాడు. అతని కోసం ఊరు ఊరంతా ఎదురు చూసేది. అతను ప్రతీ గడప ఎక్కేవాడు. ప్రతీ తలుపు అతని రాక కోసం ఎదురు చూసేది. అతను తలుపు తట్టని ఇల్లు అతని కోసం రోజంతా ఎదురు …

నీ కోసం ఎదురు చూడని నయనం లేదు Read More »

ఆనందాంబ

పూర్వ కవుల చరిత్ర తెలుసుకోవాలంటే వారు రాసిన గ్రంథావతారికలు గానీ, వారి గురించి ఇతరులు తెలిపిన విషయాలే ప్రమాణాలు. విద్యయే మృగ్యమై ఉన్న నైజాం రాష్ట్రంలో తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఆణిముత్యం ఆనందాంబ. బాలకవయిత్రి, అష్టావధాని పన్నెండేళ్ల కాలంలో  1934వ  సంవత్సరంలో 28 పుటాల పద్యకావ్యం ‘సతీలలామ’ పేరుతో ఆనందాంబ రచించారు. అంతకుముందే వెలమవీర, మాదవ పంచాసత్‍ కావ్యాలు రాసినట్టు గోల్కొండ కవుల సంచికలో పేర్కొనబడింది.ఉపోద్ఘాతంలో ఈమెను గురించి విద్వాన్‍ వెంకట నృసింహాచార్య శాస్త్రిగారు స్వయాన ఆమె గురువు సిరి శెనహల్‍ …

ఆనందాంబ Read More »

బ్రిటీష్‍ సైన్యాన్ని ఓడించిన ప్రిన్స్ ముబారిజుద్దౌలా!

తెలంగాణ… హైదరాబాద్‍ నగరం.. రాజ్యం… తవ్విన కొద్దీ కొత్త మణులు, చారిత్రక వైఢూర్యాలు, సాంస్కృతిక రత్నాలను, సాహిత్య కెంపులను అందించే విలువైన నిక్షేపాలున్న నిధి. ఒకప్పుడు ఇది ‘కోహినూరు’కు ప్రసిద్ధి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతకన్నా గొప్పదైనా చారిత్రక వారసత్వానికి వారధి. హైదరాబాద్‍ నగరం గురించి పర్షియన్‍, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో.. శిలా శాసనాల్లో, రాగి రేకుల్లో, తాళపత్రాల్లో ఎంతో చరిత్ర నిక్షిప్తమై ఉన్నది .  కుతుబ్‍షాహీల కాలం నుంచి ఫ్రెంచ్‍, డచ్‍, బ్రిటీష్‍, పర్షియా, అరబ్బు, మద్రాసు ప్రాంతాల నుంచి గోలకొండ, …

బ్రిటీష్‍ సైన్యాన్ని ఓడించిన ప్రిన్స్ ముబారిజుద్దౌలా! Read More »

భారత్‍ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం హైపర్‍ సోనిక్‍ టెక్నాలజీ..!!

శత్రువుల వెన్నులో చలిపుట్టే విధంగా, మెరుపు వేగంతో విరుచుకుపడే క్షిపణులు, వైమానిక వ్యవస్థల రూపకల్పన దిశగా మనదేశం కీలక ముందడుగువేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైపర్‍ సోనిక్‍ టెక్నాలజీ డెమాన్‍స్ట్రేషన్‍ వెహికల్‍ (హెచ్‍ఎస్‍టీడీవీ)ను సెప్టెంబర్‍ 7వ తేదీన విజయవంతంగా పరీక్షించింది. తద్వారా హైపర్‍సోనిక్‍ క్రూయిజ్‍ క్షిపణులను అభివృద్ధి చేసే సత్తా కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‍ చేరింది. హెచ్‍ఎస్‍టీడీవీ, హైపర్‍ సోనిక్‍ ఎయిర్‍ బ్రీతింగ్‍ స్క్రామ్‍జెట్‍ సాంకేతికతతో తయారైంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‍డీఓ) దీనిని …

భారత్‍ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం హైపర్‍ సోనిక్‍ టెక్నాలజీ..!! Read More »

ఈ చరిత్ర మనదేనని చెప్తున్న శాసనాలు

పైఠాన్‍ తవ్వకాల్లో (Exlavations at paithan – 1996-97 by ASI, SSAS) దొరికిన ముద్రమీద ‘బ్రాహ్మీలిపి’లో ‘రాజామచ మహాసేనదవుస’ అని వుంది (Godbole, 2002-03 P.11, 111)కోటిలింగాల, కొండాపూర్‍లలో శాతవాహనుల నాణేలతో పాటు శాతవాహన పూర్వరాజుల నాణేలు, మహారథి, మహాసేన, మహా తలవరుల నాణేలు కూడా దొరికాయి. మహాసేనులు శాతవాహనుల సమకాలికులని, వాళ్ళు శాతవాహనుల వివిధ హోదాలలో పనిచేశారని తెలుస్తున్నది. అందువల్ల పైఠాన్‍లో దొరికిన రాజామాత్య మహాసేనదత్తుని ముద్రకు సంబంధం ఉందని చెప్పవచ్చు. కోటిలింగాలకు సమీపంలో ఉన్న ‘మొక్కట్రావుపేట’లో దశాబ్దాల …

ఈ చరిత్ర మనదేనని చెప్తున్న శాసనాలు Read More »

అరబ్బీ గుర్రాలపై ఆఫ్రికన్‍ రౌతులు ‘ఎ.సి.గార్డస్’

పది ఆర్ల సంవత్సరాల క్రింద హైద్రాబాద్‍ పాతనగరంలో నివసించే ముసలివారు ‘‘కట్టెపూల్‍’’ అనేవారు తప్ప ముసల్మానుల లాగా ‘‘లక్డికాపూల్‍’’ అనేవారు కాదు. అయినా ఏం లాభం? కట్టె ఒకటే తెలుగు పదం. మళ్లీ పూల్‍ మాత్రం ఉర్దూ పదమే కద. కల్తీలేని తెలుగులో చెప్పాలంటే కట్టెతో కట్టబడిన వంతెన. అబ్బో అంత లంబాచౌడా పేరు పలికేబదులు హాయిగా అందరి నోళ్లల్లో నానిన ‘‘లక్డికాపూల్‍’’ పేరే బాగుంది కదా! అయినా ఇపుడు లక్డీ ఎక్కడుంది అంతా సిమెంటే కదా ‘‘సిమెంట్‍కాపూల్‍’’ అందామని మీరు …

అరబ్బీ గుర్రాలపై ఆఫ్రికన్‍ రౌతులు ‘ఎ.సి.గార్డస్’ Read More »

మూఢనమ్మకాలపై పోరాడిన డా. వై.నాయుడమ్మ

పద్మశ్రీ డాక్టర్‍ యలవర్తి నాయుడమ్మ గురించి ఒక మాటలో పరిచయం చెయ్యాలంటే పుట్టుకతో రైతుబిడ్డ-వృత్తిరీత్యా అస్పృశ్యుడు. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు చెప్పుకునేవాడు. 1943లో కేవలం 17 రూపాయల నెలజీతంతో మదరాసులో గల తోలు పరిశోధనాసంస్థలో రసాయనశాస్త్ర విభాగంలో డిమాన్‍ స్ట్రేటర్‍ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ ఉద్యోగం లభించటంలో ఆ సంస్థలో కీలక పదవిలో వున్న ప్రొఫెసర్‍ కాట్రగడ్డ శేషాచలపతి సహకారం మరువలేదు. జీతం తక్కువైనా తను చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగమే లభించిందని నాయుడమ్మ భావించారు. అయితే దీనికి భిన్నంగా నాయుడమ్మ తండ్రి అంజయ్యగారు ఎదుగూ పొదుగూ …

మూఢనమ్మకాలపై పోరాడిన డా. వై.నాయుడమ్మ Read More »

5G స్థాయి కార్పొరేట్‍ యువ నైపుణ్యాలు

విశ్వమే కుగ్రామం అయ్యంది. అరచేతిలో వైకుంఠం చూపే చరవాణి లీలలు. శాస్త్రసాంకేతిక విప్లవం నిత్యనూతన అంతర్జాల క్రీడ అయ్యింది. 4G తరం సాంకేతికతను దాటుతూ 5G తరానికి వడివడిగా అడుగులు వేస్తోంది ఆధునిక శాస్త్రపరిజ్ఞానం. నేటి వినూత్న ఆవిష్కరణలే రేపటికి పాతవంటున్న ఘడియలు. పోటీ ప్రపంచంలో అవకాశాలు అనేకమైనప్పటికి, నిరుద్యోగం పెరుగుతున్న వైనాలు. చదువుల్లో అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు, గ్రేడ్‍లు సాధించిననూ ఉద్యోగ ఎంపిక కఠినమైన అనుభవంగా మిగిలింది. చదువుల్లో రాణిస్తూనే కార్పొరేట్‍ కౌశలాలు అలవర్చుకోవాలనే హితపలుకులు …

5G స్థాయి కార్పొరేట్‍ యువ నైపుణ్యాలు Read More »

ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన్న

మధ్యయుగాల చరిత్రలో ఎందరో చారిత్రక పురుషులు, ప్రసిద్ధులున్నా, రాజులలో అతికొద్దిమంది మంత్రి, ధండనాథులు స్వల్పంగా చరిత్రలో మిగిలినారు. అలాంటి వాళ్లలో తెలంగాణ యోధుడొకడు చరిత్రలో అక్షర బద్ధం ఐనాడు. అతని పేరు ఎనుములపల్లి పెద్దన. పెద్దనామాత్యుడు తనకాశ్రితుడైన మహాకవి చరిగొండ ధర్మన్న చేత ‘చిత్రభారతం’ కృతి రాయించుకొని అంకితం పుచ్చుకొన్నాడు. ఈ కావ్య అవతారికలో ఇతని జీవితంలోని పలు కోణాలు బయట పడ్డాయి. ఎనుములపల్లి పెద్దనామాత్యుడు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి గ్రామస్థుడు ఐన బ్రాహ్మణుడు. బాల్యం నుండే కత్తిపట్టి యుద్ధాల్లో అనేక విజయాలకు …

ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన్న Read More »