2021

బాలల్లో వికసిస్తున్న భావపరిమళం

‘బాల చెలిమి’కారులు మణికొండ వేదకుమార్‍ చైర్మన్‍గా దాదాపు మూడు దశాబ్ధాలుగా బాల వికాసం కోసం పనిచేస్తూ ‘బాల చెలిమి’పత్రిక, ‘బాల చెలిమి గ్రంథాలయం’, ‘చెలిమి క్లబ్‍’లు నిర్వహిస్తూ అదే కోవలో చేసిన మరో గొప్పపని తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వారిగా ‘తెలంగాణ బడిపిల్లల కథలు’ తెచ్చారు. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి ఆహ్వానం మేరకు ఆదిలాబాద్‍ జిల్లా ‘బడిపిల్లల కథలు’ ఎంపిక కోసం 38 కథలు రాగా కథల కార్యశాలలో పాల్గొన్న నిష్ణాతులైన …

బాలల్లో వికసిస్తున్న భావపరిమళం Read More »

ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పచ్చదనం కూడా ఒక కీలకమైన అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతున్న హరితహారం పథకం గొప్ప విజయాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ పథకం నిర్దిష్టమైన అవగాహనతోనూ, నిబద్ధతతోనూ సరైన ప్రణాళికతోనూ కృషి చేయడం వల్లనే యిది సాధ్యమైంది. అంతర్జాతీయ లెక్కల ప్రకారం కెనడాలో ఒక్కో మనిషికి తలసరి 10,163 చెట్లు ఉండగా భారత్‍లో కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కలు తెలంగాణకు వర్తించవు. ఐక్యరాజ్యసమితి లెక్కల …

ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం Read More »

సిద్ధప్ప వరకవి

ఆయన చదివింది ఏడవతరగతి. ఆరు భాషలపై ఆయనకు పట్టుంది. చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి , సమాజ సేవ ఆయన ప్రవృత్తి. స్వరాజ్య ఉద్యమంలో రూమి టోపీకి బదులుగా , గాంధీ టోపి ధరించి విధులకు వెళ్ళి నందుకు ఉపాధ్యాయ ఉద్యోగం నుండి నిజాం ప్రభుత్వం ఆయనను తొలగించింది. అప్పటి నుండి తన ప్రవృత్తి కనుగుణంగా వాస్తు , వైద్య , ఆయుర్వేద శాస్త్రాల్లో ప్రాముఖ్యం సంపాదించి ప్రజలకు సేవ చేసారు. ఆయనే సిద్దప్ప వరకవి. కోహెడ మండలం …

సిద్ధప్ప వరకవి Read More »

ఆవరణ వ్యవస్థలు – మానవ వ్యవస్థలు – పరస్పర సంబంధాలు

“We need an earth – wisdom revolution, not an infromation revolution” పర్యావరణం గురించి మూడు దశాబ్ధాలుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త చెప్పిన మాట ఇది. సమాచార విప్లవం కాదు కావలసింది, భూవిజ్ఞాన విప్లవం అని అనటంలోనే శాస్త్రవేత్త సూచించదలచిన అర్థం, ప్రాధ్యానం ఏమిటో తెలుస్తుంది. పర్యావరణ పరంగా తలెత్తిన సమస్యలు, సంక్షోభాల గురించి ఐదారు దశాబ్ధాలుగా వివిధ అను శాసనాలలో అధ్యయనాలు సమస్యను వివరించి, విశ్లేషించటమే కాకుండా పరిమితులకు లోబడి పరిష్కారాలను సూచిస్తున్నాయి. …

ఆవరణ వ్యవస్థలు – మానవ వ్యవస్థలు – పరస్పర సంబంధాలు Read More »

విందులు, విలాసాల ‘జల్సాఘర్‍’ ఇరాం మంజిల్‍

కాల ప్రవాహంలో కరిగిపోయిన కమ్మని కథలు మళ్లీ ఇపుడెందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఒకే ఒక చిన్న మాట సెలవిస్తాను ‘‘గుజ్రే జమానా – కరే దివానా’’.‘‘దీపాలు వెలిగె, పరదాలు తొలిగె’’ అన్నట్లు నవాబ్‍ ఫక్రుల్‍ ఉల్‍ ముల్క్ ‘‘దౌలత్‍ఖానా’’ (నివాసం) ఇరాం మంజిల్‍లో తరచుగా పెద్ద ఎత్తున దావత్‍లు (విందులు) జరిగేవి. ఆ డిన్నర్‍ పార్టీల ఏర్పాట్లు చూడముచ్చటగా బహు పసందుగా ఉండేవి. పున్నమి వెన్నెల రాత్రులు రగిలి వెలిగి రాగ రంజితంగా రసరమ్యంగా అతిథుల …

విందులు, విలాసాల ‘జల్సాఘర్‍’ ఇరాం మంజిల్‍ Read More »

కన్దూరి తొండయచోడుని (తండ్రి అస్తినిమజ్జన) పానగల్లు శాసనం (క్రీ.శ.1091)

హిందూ షోడశ సంస్కారాల్లో అంత్యక్రియలకు ప్రాముఖ్యత నిచ్చారు. వ్యక్తి మరణానంతరం, స్థాయిని బట్టి, ఆ వ్యక్తి అస్తికలు, చితాభస్మాలను పుణ్యతీర్థాల్లోనో, స్థానిక జలవనరుల్లోనో కలపటం మధ్యయుగంలో ఆచరించిన శాసనాధారాలున్నాయి. రాజ, సామంత, మాండలిక వంశీకులకు చెందిన వారు మరణిస్తే కర్మకాండల నిర్వహణ కోసం, పండితులైన బ్రాహ్మణులను ఎంచుకొని, వారిని కాశీ, గయకు పంపి, అందుకయ్యే ఖర్చుల కోసం నగదు, వచ్చిన తరువాత జీవితకాలం సరిపడే పంట భూముల్నిగానీ, గ్రామాలను గానీ దానం చేశారు. మహబూబ్‍నగర్‍ జిల్లా కోడూరు …

కన్దూరి తొండయచోడుని (తండ్రి అస్తినిమజ్జన) పానగల్లు శాసనం (క్రీ.శ.1091) Read More »

నదీజలాల పరిరక్షణ అందరి బాధ్యత

‘ప్రపంచ నదుల దినోత్సవం’ సందర్భంగా ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు యం. వేదకుమార్‍ పాల్గొని మాట్లాడారు.ఐక్యరాజ్యసమితి (UN) 2005లో వాటర్‍ ఫర్‍ లైఫ్‍ దశాబ్దాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి వనరులను బాగా చూసుకోవాల్సిన ఆవశ్యకతపై మరింత అవగాహన కల్పించడమే దీని లక్ష్యమన్నారు. ఈ చొరవ తరువాత, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నదీ న్యాయవాది మార్క్ ఏంజెలో ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ప్రపంచ నదుల …

నదీజలాల పరిరక్షణ అందరి బాధ్యత Read More »

రాతిచిత్రాలు – తెలంగాణ

కొత్తతెలంగాణ చరిత్రబృందం 6వ నెల వెబినార్‍లో డా. బండి మురళీధర్‍ రెడ్డి గారి ప్రసంగపాఠం రాతిచిత్రాలు అంటే రాతిమీద వేసిన చిత్రాలు అని అందరికి తెలిసినదే. కాని, చాలామందికి తెలియని విషయం రాతిచిత్రాలు, వాటి ప్రాముఖ్యత. ఇది పురాతనకళ, మన వారసత్వ సంపద. దీనిని మనం రిపేర్‍ చేయలేం, మరల తిరిగి వేయలేం. ఇది Fragile. పురాతన కాలం నుంచి ఈ రాతిచిత్రాలువేసే సంప్రదాయం పరిణామం చెందుతూ వచ్చింది. ఈ కళ అమూల్యమైంది. గోల్కొండ డైమండుకు విలువకట్టవచ్చునేమో …

రాతిచిత్రాలు – తెలంగాణ Read More »

అర్బన్‍ ప్లానింగ్‍తో సమ్మిళితమయ్యే పరిసర వ్యవస్థ

(డాక్టర్‍ సంఘమిత్ర బసు, రిటైర్డ్ ప్రొఫెసర్‍, ఐఐటీ ఖరగ్‍ పూర్‍, మెంబర్‍, అడ్వయిజరీ కమిటీ, ఆర్కిటెక్చరల్‍ హెరిటేజ్‍ డివిజన్‍, ఇంటాక్‍, న్యూదిల్లీ. ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ నిర్వహించిన వెబినార్‍ లో ఆమె ప్రసంగపాఠం సారాంశం) 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍కు ముందుగా నా అభినందనలు. నేను నేచర్‍ కల్చర్‍ జర్నీ దిశలో ఎకోసిస్టమ్‍, హెరిటేజ్‍, సెటిల్మెంట్‍ ప్లానింగ్‍ గురించి చర్చిస్తాను. రెండు కేస్‍ల స్టడీస్‍ గురించి …

అర్బన్‍ ప్లానింగ్‍తో సమ్మిళితమయ్యే పరిసర వ్యవస్థ Read More »

ప్రాచీన విశ్వవిద్యాలయం నలందా మహావిహార

జూలై 15, 2016న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు నలంద విశ్వవిద్యాలయం భారత దేశంలోని బీహారు రాష్ట్రంలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలందా అనే సంస్కృత పదం నలం (అనగా కమలము అనిఅర్ధం, కమలం జ్ఞానానికి చిహ్నం) మరియూ ద (అంటే ఇవ్వడం) అనే రెండు పదాల కలయిక ద్వారా పుట్టింది. చైనా తీర్థయాత్రీకుడైన హ్యూయన్‍ త్సాంగ్‍ నలందా పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక …

ప్రాచీన విశ్వవిద్యాలయం నలందా మహావిహార Read More »