పెదకొండూరులో కాకతీయ శాసనం
కాకతీయుల కాలంలో గ్రామపాలనలో ప్రజల భాగస్వామ్యం గురించి చరిత్రకారులు ఎక్కువసార్లు వెంకిర్యాల శాసనాన్ని ఉదాహరణగా చూపుతుంటారు. రాజులు, మంత్రులు, అధికారులు ఏ దాన,ధర్మాలు చేసినా గ్రామంలోని అష్టాదశప్రజలు, మహాజనులందరి ఆమోదంతో జరుగాలన్న నియమం ఆ శాసనంలో వివరించబడ్డది. నిరంకుశ, ఏకచ్ఛత్ర రాజరికపాలనలో ఈ ప్రజాస్వామిక నియమాలు చట్టబద్ధత సంతరించుకోవడం చాల గొప్పవిషయం. అయితే సాతవాహనుల కాలంలో శ్రేణుల వంటి వ్యాపారసంస్థల నుంచి కళ్యాణీచాళుక్యుల కాలందాక గ్రామ గావుండాలు, అష్టాదశప్రజలు, మహాజనులు చేసాయని, ప్రజలు తమ సమయాలు, సంస్థల …