ఆ పాదాలు ఇప్పుడక్కడ లేవు!!!
అవును అవి పాదాలే. అక్కడ రెండు జతల పాదాలున్నాయి. అవి నిజంగా నిలువెత్తు పాదాలు. ఇంతవరకూ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో మరెక్కడా ఇంతెత్తున్న ఇలాంటి పాదాలు, ఇలా అరికాళ్లుపైకి కనిపించేలా ఉన్న దాఖలాలు లేవు. శ్రీరామోజు హరగోపాల్‍గారు కొలనుపాకలో ఇంతకంటే చిన్నపాదం గురించి ఇటీవలే తెలియజేశారు. ఇంతకీ ఈ పాదాలు ఎవరివై ఉంటాయి? ఈ పాదాలు జైనతీర్థంకరునివేమో. స్థానికంగా మాత్రం ఇవి దేవుని పాదాలని, ఆ పాదాలను నిలబెట్టి ఉంచిన ప్రదేశాన్ని పాదాలగడ్డ అని అంటారు. …