పిచ్చయ్య గారి బస్సు
దాదాపు అర్థ శతాబ్దం కింద ఒకే ఒక్క ఎర్ర ప్రైవేటు బస్సు సర్వీసు సూర్యాపేటలో పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ నుండి మా ఊరు మీదుగా హుజూర్‍నగర్‍కు తిరిగి అదే బస్సు సూర్యాపేటకు నడిచేది. దానిని ‘‘పిచ్చయ్య బస్సు’’ అని ప్రసిద్ధి. అది సూర్యాపేటలో స్టేజీ మీదకు రావటం ఆలస్యం ప్రయాణీకులు ఒకరినొకరు తోసుకుంటూ మూటా ముల్లెతో ఎక్కేవారు. కొందరు కిటికీల నుండి చేతి రుమాలు లేదా నెత్తికి కట్టుకునే రుమాలు వేసి సీటు ఆపుకునే వారు. మరి …