ది బిల్ ఈస్ పాస్డ్
2024 ఫిబ్రవరికి తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొంది ఒక దశాబ్ద కాలం గడచింది. ఉభయ సభల ఆమోదం అనంతరం బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది. మార్చ్ 1న రాష్ట్రపతి ఆమోదం తర్వాత 2014 మార్చి 4న భారత ప్రభుత్వం రాజపత్రం జారీ చేసింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆ రాజపత్రంలో ప్రకటించింది. 2014 ఫిబ్రవరిలో భారత పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన పరిణామాలను ఒకసారి …