కలివి కోడి.. కలివి కోడి.. కనిపించవూ!!!
‘‘భూమి ఉన్నది మానవుడి ఆశలు తీర్చడానికే గాని అత్యాశలు తీర్చడానికి కాదు’’ అన్న మహాత్మా గాంధీ మాటలు నేటి ఆధునిక మానవుడు చెవికెక్కించుకోలేదు. అందుకే కాబోలు, భూమిపై మానవాళి మాత్రమే కాకుండా జంతువులు, పక్షులు, క్రిమి కీటకాదులు, మొక్కలు తదితర జీవజాలం ఉందన్న సంగతినే మరిచి తన స్వార్థం కోసం భూమి పై ఉన్న సమస్త వనరుల్ని కబలించడం మొదలుపెట్టాడు. దీంతో అనేక జంతువులు పక్షులకు, భూమిపైన నిలువ నీడ లేకుండా పోయింది. మానవుడి అత్యాశకు అనేక …