June

ప్రకృతి మనల్ని ఈ సృష్టినుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందా?

ప్రకృతి ప్రయోగించిన ఆయుధమే కరోనా వైరస్‍? ప్రకృతి ఓ గొప్ప ప్రయోగకర్త. అది ఎలా ప్రయోగాలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కముక్కలో చెప్పా లంటే సృష్టికి అండగా నిలువని జీవజాతులను అది వేరు చేస్తుంది. లక్షలాది ఏళ్లుగా అది అలా ప్రయోగాలు చేస్తూనే ఉంది. డైనోసార్లను అది పక్కకు తప్పించింది. సాబెర్‍ టూత్‍ పులిని కూడా అలానే చేసింది. మనిషికి పూర్వీకులుగా భావించే రామాపితెకస్‍ అనే జీవుల్ని కూడా ఉనికిలో నుంచి తొలగించింది. అదే విధంగా పురాతన …

ప్రకృతి మనల్ని ఈ సృష్టినుంచి తొలగించే ప్రయత్నం చేస్తోందా? Read More »

ఆవరణ వ్యవస్థల పునరుద్ధరణ – అవగాహనా చైతన్యం

రాచెల్‍ కార్సన్‍ తన ‘సైలెంట్‍ స్పింగ్‍’ అనే గ్రంథంలో మూడవ అధ్యాయం పేరు ‘Elixirs of Death’. ప్రపంచ చరిత్రలో ప్రతి మనిషీ రసాయనిక పదార్థాల సంబంధంలోకి వచ్చాడని, గర్భస్థ శిశువు మొదలుకొని మరణం వరకు ఈ రసాయనాల ప్రభావానికి గురికాకుండా వుండటం దాదాపు సాధ్యం కాదంటుంది. రసాయనిక పదార్థాలు క్రిమి, కీటక నాశినులుగా మనకు ఇంచుమించు రెండవ ప్రపంచ యుద్ధకాలం నుండి వినియోగంలోకి వచ్చాయి. కృత్రిమ రసాయనాలు సజీవ, నిర్జీవ ప్రపంచం అంతటా పంచబడి ఉన్నాయని …

ఆవరణ వ్యవస్థల పునరుద్ధరణ – అవగాహనా చైతన్యం Read More »

చిన్నారులను కాటేస్తున్న కరోనా

కరోనా వైరస్‍ చిన్నారులను ఏం చేయనుందనే విషయంలో మనం అంత అప్రమత్తంగా ఉండడం లేదు. వైరస్‍ మార్పు చెందుతూ మరింత తీవ్ర పరిణామాలు కల్పించేదిగా మారుతున్న కొద్దీ రేపటి నాడు పిల్లలపైనే దాని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. సింగపూర్‍లో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి విద్యాసంస్థలన్నిటినీ మే 19 నుంచి తాత్కాలికంగా మూసివేశారు. భారత్‍ లో మొదటిసారిగా కనిపించిన వైరస్‍ రకం సింగపూర్‍లో కూడా బయటపడి పెద్దల కంటే ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తోందని ప్రకటించిన …

చిన్నారులను కాటేస్తున్న కరోనా Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-10

విరియాల కామవసాని గూడూరుకన్నడ-తెలుగు శాసనం (క్రీ.శ.1124) నిజానికి ఈ శాసనం విరియాల కామవసానిది కాదు. ఆమె విడుదల చేయలేదు. అయితే ఈ శాసనంలో ఆమె చేపట్టిన ఒక ఘనకార్యం కాకతీయుల చరిత్రను ఒక మలుపు తిప్పింది. కాకతీయులు కేవలం సామంతులుగానే మిగిలిపోకుండా, వారు స్వతంత్ర రాజులుగ నిలిదొక్కుకొని, తరువాతి కాలంలో ఒక విశాల సామ్రాజ్యాన్ని పాలించటానికి దోహదపడిన సంఘటనకు నాంది పలికింది. మరి ఇంతకీ ఈ శాసనం ఎవరిది? జయన్తీపురం నుంచి పాలిస్తున్న కళ్యాణ చాళుక్య ప్రభువు, …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-10 Read More »

నిర్మల్‍లో ఫిరంగీల తయారి కేంద్రాలు

ప్రాచీన కాలం నుండి తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇనుము ఉక్కు తయారీ విరివిగా జరిగింది. అనేక గ్రామాలల్లో, మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఇనుము ఉక్కు తయారీకి సంబంధించిన పరిశ్రమల ఆనవాళ్లు ఇప్పటికీ లభిస్తున్నాయి. అందునా నిర్మల్‍ జిల్లాలోని దిలావార్‍పూర్‍, కుబీర్‍, కడెం, మామడ, ఖానాపూర్‍, పెంబి తదితర మండలాల్లో విరివిగా ఇనుము, ఉక్కును మరియు వీటి ద్వారా వివిధ వ్యవసాయ పనిముట్లు యుద్ధాల కోసం ఉపయోగించే కత్తులు, బరిసెలు, బల్లెములు తదితర సామాగ్రి విరివిగా …

నిర్మల్‍లో ఫిరంగీల తయారి కేంద్రాలు Read More »

పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యం

జూన్‍ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేయాలనుకుంటున్న పనులు, సాధించాలనుకున్న ప్రగతి కొన్ని రోజుల లాక్‍ డౌన్‍ వల్ల సమకూరింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం …

పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యం Read More »

ముత్యాలకు కేరాఫ్‍ హైదరాబాద్

హైదరాబాద్‍ ముత్యాల నగరం. అన్ని పరిమాణాలు, రంగులు, రూపాల యొక్క అరుదైన, ప్రకాశించే, మృదువైన, కన్నీటి చుక్క ముత్యాలకు కేరాఫ్‍ అడ్రస్‍ హైదరాబాద్‍.ముత్యం ప్రకృతి అద్భుతాలలో ఒకటి. సముద్ర ఆభరణంగా పరిగణించబడుతుంది. 5000 సంవత్సరాలకు పైగా అలంకరించడం కోసం ఉపయోగించిన ఐదు విలువైన ఆభరణాలలో ఇది ఒకటి. ముత్యాల మెరుపు స్పష్టత, స్వచ్ఛతకు చిహ్నం. అందువల్ల ఇది ఎక్కువమంది ఇష్టపడే ఆభరణాలలో ఒకటిగా గుర్తింపబడింది. డెక్కన్‍ పీఠభూమి యొక్క గుండె, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍ చాలా …

ముత్యాలకు కేరాఫ్‍ హైదరాబాద్ Read More »

కులవృత్తుల నైపుణ్యం ప్రగతికి సోపానం

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‍ యాదవ్‍ ‘రాష్ట్ర ఏర్పాటుతో విశ్రమిస్తే సరిపోదు. ఎన్నో సహజ వనరులున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల వెనుకబాటుతనాన్ని పోగొట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సార్థకత చేకూరుతుందని’ కేసీఆర్‍ తరచూ చెప్తుంటారు. అందులో భాగంగానే ఆయన కలలుగన్న ‘బంగారు తెలం గాణ’ సాధన దిశగా గత ఏడేండ్లుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్‍ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. …

కులవృత్తుల నైపుణ్యం ప్రగతికి సోపానం Read More »

ప్రఖ్యాత వైరాలజిస్టు పీటర్‍ పయట్‍ కోవిడ్‍-19 అనుభవాలు

గత ఏడాది మార్చిలో వైరాలజిస్టు పీటర్‍ పయట్‍కు కరోనా సోకింది. లండన్‍ స్కూల్‍ ఆఫ్‍ హైజీన్‍ల ట్రాఫికల్‍ మెటాసిన్‍ స్కూల్‍ డైరెక్టర్‍గా ఉన్నారు. ఒక వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. పయట్‍ బెల్జియంలో పెరిగారు. ఎబోలా వైరస్‍ ఆవిష్కర్తల్లో ఆయనొకరు. 1976 జైరే ప్రాంతంలోని విష జ్వరాల మీద పరిశోధించి ఎబోలా వైరస్‍ అనే కొత్తరకం వైరస్సే జ్వరాలకు కారణమని తేల్చారు. ఆయన జీవితం మొత్తం అంటువ్యాధులకు వ్యతిరేకంగా పరిశోధన, పోరాటలలోనే గడిచింది. 1995-2000కి …

ప్రఖ్యాత వైరాలజిస్టు పీటర్‍ పయట్‍ కోవిడ్‍-19 అనుభవాలు Read More »

దేవునిగుట్టమీద దేవుడెవరు? తెగని దేవులాట

2017సం. పర్యాటకదినోత్సవంరోజు మా చరిత్రబృందం సందర్శించింది. దేవునిగుట్ట జయశంకర్‍ భూపాలపల్లి, ములుగు మండలంలోని కొత్తూరు గ్రామం బయట వుంది. మేమందరం కలిసి వెళ్ళక ముందు ఈ గుడిని టీవి99 వారు, మిత్రుడు తోపుడుబండి ఫేం సాదిక్‍ అలీ బృందం, మరికొందరు చూసారు. దేవునిగుట్టమీద కొత్తూరు ప్రజల జాతరను చిత్రించిన టీవీ99 వారి వీడియో చూడడంతో మొదటిసారి వ్యక్తిగతంగా నాకు దేవునిగుట్ట గురించి తెలిసింది. వీడియోలో గుడిని చూసిన వెంటనే ఇది ఆంగ్‍ కర్‍ వాట్‍(బౌద్ధ ఆరామం)ను పోలివున్నదని, …

దేవునిగుట్టమీద దేవుడెవరు? తెగని దేవులాట Read More »