జీవ వైవిధ్యానికి విఘాతం – విశ్వమహమ్మారికి ఊతమే
భూమిపై నివసిస్తున్న 8.7 మిలియన్ జంతువృక్ష జాతులు ప్రదర్శించే వైవిధ్యాలను, సహజ విభిన్నతలను జీవ వైవిధ్యంగా అభివర్ణించవచ్చు. బిలియన్ల సంవత్సరాల పరిణామక్రమం, సహజ పక్రియలు మరియు మానవ ప్రభావ ఫలితంగా ధరణిపై అద్భుత జీవ వైవిధ్యం వెలసింది. జీవజాతుల మధ్య నెలకొన్న విభిన్నతల వలలో మనిషి కూడా ఒక భాగం మాత్రమే. భూమి తనకు మాత్రమే స్వంతం అనుకున్న మనిషి, తన స్వార్థం కోసం జీవ వైవిధ్యానికి నష్టం కలిగించుట అనాదిగా జరుగుతుంది. ఇలాంటి అవాంఛనీయ మానవ తప్పిదాల మూలంగానే …