శ్రీ ఉత్పత్తి పిడుగు’ శాసించేదేమిటి?
తెలుగునాట కనిపించే శాసనాలలో నామక శాసనాలది ప్రత్యేకస్థానం. కేవలం పేర్లు మాత్రమేకదా ఇవి శాసనాలా అని పెదవి విరిచే శాసనవేత్తలకు కూడా సవాలు విసురుతాయి కొన్ని లేబుల్ లేఖనాలు. రాజుల ఆజ్ఞలు, దానాలు, యుద్ధాలు, ప్రశస్తులు మాత్రమే కాదు శాసనాలు. చిన్నదైనా, పెద్దదైనా, పదమైనా, పదంలో ఒక ముక్కైనా, ఐదు, పది నుంచి వందల పంక్తుల శాసనాలైనా వాటిలోని విషయం, కాలాలకే ప్రాధాన్యత. రాజుల వివరాలు తెలిపే శాసనాలు చరిత్ర కాలక్రమణికకు ఎట్ల పనికొస్తాయో, ఒకప్పటి సామాజిక …