November

ఉమ్మడి హైదరాబాద్‍, రంగారెడ్డి జిల్లాల శిలా మరియు ఖనిజసంపద

ఈ జిల్లాలోని ప్రాంతం 7,760 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. హైదరాబాద్‍ తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు దేశంలోని మహానగరాల్లో ఒకటి కావడం విశేషం. ఈ జిల్లాలకు ఉత్తరాన మెదక్‍, దక్షిణాన మహబూబ్‍నగర్‍, తూర్పులో నల్లగొండ, పశ్చిమ దిశలో కర్ణాటక రాష్ట్రం కలదు. రంగారెడ్డి జిల్లాలోని తూర్పు ప్రాంతం మరియు హైదరాబాద్‍ జిల్లా రగ్గడ్‍ టెరేన్‍ కావడం వాటిలో గ్రానైట్‍ శిలలు గుట్టలు, కొండలుగా వుండడం విశేషం. ఈ గుట్టలు 613 మీటర్ల ఎత్తు వరకు కలవు. …

ఉమ్మడి హైదరాబాద్‍, రంగారెడ్డి జిల్లాల శిలా మరియు ఖనిజసంపద Read More »

నానో టెక్నాలజీ రంగంలో సంచలనం…!! @ క్వాంటం డాట్స్

(క్వాంటం డాట్స్పై పరిశోధనకు గానూ రసాయన శాస్త్రంలో2023వ సంవత్సరానికి నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా) సాధారణంగా రసాయనశాస్త్రంలో ప్రతిమూలక•ం కూడా దాని అణువులలోని ఎలక్ట్రాన్లు, ఆ మూలకం కేంద్రకం చుట్టూ ఈ ఎలక్ట్రాన్ల పంపిణీ ఆధారంగా కొన్ని నిర్దిష్ట లక్షణాలను ప్రదర్శిస్తుంది. స్వచ్ఛమైన మూలకాన్ని కొన్ని భాగాలుగా విభజించినట్లయితే ప్రతిభాగం కూడా దాని పరిమాణంతో సంబంధం లేకుండా సరిగ్గా అదే లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఉదా।।కు ఒక స్వచ్ఛమైన బంగారం ముక్కను తీసుకొని దానిని వెండి ముక్కతో గానీ …

నానో టెక్నాలజీ రంగంలో సంచలనం…!! @ క్వాంటం డాట్స్ Read More »

జానే కాహా గయే ఓదిన్

(గత సంచిక తరువాయి)ఆ దినాలల్ల అన్ని టాకీసులలో మార్నింగు షోలకు తక్కువ ధర ఉండేది. కారణం అవి పాత సీన్మాలు. మిగతా మూడు ఆటలకు ధర ఎక్కువ. ఎందుకంటే అవి కొత్త సీన్మాలు. పైగా రంగుల సీన్మాలు. మా ‘ఆషా’ల మార్నింగులన్నీ పాత తెలుగు సీన్మాలు. మిగతా మూడు ఆటలు కొత్త హిందీ సీన్మాలు. మా అమ్మ వెంబడి తోక లాగ తెలుగు సీన్మాలకు పోయేవాళ్లం. దేవదాసు సీన్మా చూసి మా అమ్మ వారం దినాలపాటు ఒకటే …

జానే కాహా గయే ఓదిన్ Read More »

అశేష తెలంగాణ ప్రజల అస్థిత్వ దర్పణం దక్కన్‍ ల్యాండ్‍ మాసపత్రిక

మిత్రుడు మణికొండ వేదకుమార్‍గారు, తాను సంపాదకత్వం వహిస్తున్న ‘‘దక్కన్‍ల్యాండ్‍’’ సామాజిక రాజకీయ పత్రిక గురించి ఒక వ్యాసం రాయమని అడిగినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఈ పత్రిక గురించి రాయడమంటే నా తెలంగాణ రాష్ట్రం మద్యలో నా అస్థిత్వాన్ని వీక్షించుకోవడంగా నేను భావించాను. తొలిదశ ఉద్యమంలో వరంగల్‍లో జరిగిన ఆందోళన, నా కళ్ళముందే వరంగల్‍ పాలిటెక్నిక్‍ దగ్గర, వరంగల్‍ లక్ష్మీటాకీసు సమీపంలో పోలీసు కాల్పులు, అందులో మరణాలు, జైళ్ళు నిండిపోవటంతో మమ్మల్ని పోలీసులు లారీలల్లో ఎక్కించి, మామునూరు దగ్గర, …

అశేష తెలంగాణ ప్రజల అస్థిత్వ దర్పణం దక్కన్‍ ల్యాండ్‍ మాసపత్రిక Read More »

భూమికి అధిపతులం కాదు.. అతిధులం మాత్రమే…!

మానవులందరికీ మరింత మేలు చేసే ప్రయత్నంలో సామర్థ్యం, సంపద, అధికారం ఘోరంగా వైఫల్యం చెందాయని ఈ పరిణామం ప్రపంచం అంతటా కనిపిస్తున్నదని నిర్ధారణ చేశాడు బ్యారీ కామనర్‍. ఇందుకు ఉదాహరణగా పర్యావరణ సంక్షోభాన్ని చూపుతాడు. సంక్షోభం నివారించదగిన అవకాశం ఉన్నప్పటికీ ఆ పనిని చేయలేకపోయామని అంటాడు. పర్యావరణాన్ని ఉపయోగపెట్టుకోవటానికి మనం ఎంచుకున్న సాధానాలతోనే పర్యావరణ విధ్వంసానికి పూనుకున్నామని అంటాడు. ఏ సంపద సృష్టి కోసమైతే మనం ప్రయత్నించామో ఆ క్రమమే పర్యావరణ విధ్వంసకారకమని భావిస్తాడు. ప్రస్తుత ఉత్పత్తి …

భూమికి అధిపతులం కాదు.. అతిధులం మాత్రమే…! Read More »

అది ఎఱుకవరం శిథిల శివాలయం దాన్ని బాధిస్తూనే ఉంది నాగలికర్రు గాయం

కాకతీయ సామంతులైన రేచర్ల రెడ్లు, వారి అధికారులు, కాకతీయుల తీరుగానే అనేక ఆలయాలు నిర్మించారు. క్రీ.శ. 12వ శతాబ్దిలో కాకతీయ రుద్రదేవుని సామంతుడైన రేచర్ల బేతిరెడ్డి, ముందు ఆమనగల్లు, తరువాత పిల్లలమర్రిని రాజధానిగా పాలించాడు. బేతిరెడ్డి క్రీ.శ. 1190లో పిల్లలమర్రి, సోమవరంలోనూ ఆయన భార్య ఎఱుకసానమ్మ క్రీ.శ.1208లో పిల్లలమర్రి ఎఱకేశ్వరాలయాన్ని మమ్మూర్తులా కాకతీయ ఆలయ వాస్తు శైలిలోనే నిర్మించారు. అవి అలనాటి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నేటికీ నిలిచి ఉన్నాయి. కొన్ని శిథిలాలు కాగా, మరికొన్ని కనుమరుగైనాయి.వీరి …

అది ఎఱుకవరం శిథిల శివాలయం దాన్ని బాధిస్తూనే ఉంది నాగలికర్రు గాయం Read More »

తెలంగాణ రాష్ట్రం ద్వారా విడుదల చేయబడుతున్న మార్పు కోసం సంగీతం (మ్యూజిక్‍ ఫర్‍ ఛేంజ్‍)

తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని ఇతర 16 రాష్ట్రాల కోరస్‍ తో, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ వాటిని రికార్డ్ చేస్తుంది.సామాజిక కారణం కోసం సంగీతాన్ని ఉపయోగించే అతిపెద్ద ప్రచారం అయిన ‘మార్పు కోసం సంగీతం (మ్యూజిక్‍ ఫర్‍ ఛేంజ్‍)’ కార్యక్రమంలో భాగంగా దేశంలో మిగతా రాష్ట్రాలతో గొంతు కలుపుతూ, తెలంగాణలోని పెద్ద సంఖ్యలో ఎన్‍జివోలు, ప్రజలు దేశంలోని బాల్య వివాహాలకు ముగింపు పలకాలని పిలుపునిస్తూ పాటలు పాడారు. ఇప్పటివరకు, దేశంలోని 17 రాష్ట్రాల నుండి మహిళా …

తెలంగాణ రాష్ట్రం ద్వారా విడుదల చేయబడుతున్న మార్పు కోసం సంగీతం (మ్యూజిక్‍ ఫర్‍ ఛేంజ్‍) Read More »

‘‘భౌగోళిక వైవిధ్యాన్ని సంరక్షించండి భూమిని కాపాడండి’’

దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్, సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍, జేబీఆర్‍ ఆర్కిటెక్చర్‍ కాలేజ్‍ సహకారంతో అక్టోబర్‍ 6న సాయంత్రం 4.30 గంటలకు మౌలాలి సికింద్రాబాద్‍ మౌలా అలీ పహాడ్లో అంతర్జాతీయ జియో డైవర్సిటీ డే 2023 సందర్భంగా ‘‘జియో డైవర్సిటీ ప్రతి ఒక్కరి కోసం’’ అనే థీమ్‍ పై ‘జియో హెరిటేజ్‍ వాక్‍’ను మరియు ‘‘జియొ హెరిటేజ్‍ పై టాక్‍’’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ చైర్మన్‍ ప్రొఫెసర్‍ వేదకుమార్‍ మణికొండ అధ్యక్షత …

‘‘భౌగోళిక వైవిధ్యాన్ని సంరక్షించండి భూమిని కాపాడండి’’ Read More »

హోయసల హోయలకు యునెస్కో గుర్తింపు

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్‍ లోని మరో చారిత్రక కట్టడం కూడా చేరింది. కర్ణాటకలోని బేలూర్‍, హళేబీడ్‍, సోమనాథ్‍పురాలోని ‘హోయసల’ దేవాలయాలను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా లోకి చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. సౌదీ అరేబియాలో లోని రియాద్‍లో జరిగిన 45వ వరల్డ్ హెరిటేజ్‍ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికంటే ముందుగానే పశ్చిమబెంగాల్‍లోని ‘శాంతి నికేతన్‍’ని వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దీంతో భారత్‍ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల …

హోయసల హోయలకు యునెస్కో గుర్తింపు Read More »

దేశం గర్వించదగిన ఇంజనీర్‍ ఎత్తిపోతల సలహాదారు శ్రీ కె పెంటారెడ్డి

2022లో 500 సంవత్సరాలకు ఒకసారి సంభవించే (500 Year Frequency Flood)) అతి భారీ వర్షం కురిసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన కన్నేపల్లి పంప్‍ హౌజ్‍ నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో.. 2009 వరదల్లో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‍ కేంద్రం, కల్వకుర్తి పంప్‍హౌజ్‍ మునిగిపోయినప్పుడు వాటి పునరుద్దరణలో పాలు పంచుకున్న అనుభవంతో కాళేశ్వరం పంప్‍ హౌజ్‍లను కూడా పునరుద్దరించగలమని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రకృతి విపత్తుల సందర్భంగా దేశంలో అనేక ప్రాజెక్టులలో ఇటువంటి …

దేశం గర్వించదగిన ఇంజనీర్‍ ఎత్తిపోతల సలహాదారు శ్రీ కె పెంటారెడ్డి Read More »