September

ఓజోన్‍ పొరను రక్షించుకుందాం సెప్టెంబర్‍ 16న ఓజోన్‍ పొర పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం

ఓజోన్‍ పొర, వాయువు యొక్క పెళుసుగా ఉండే కవచం. సూర్యుని కిరణాల హానికరమైన భాగం నుండి భూమిని రక్షిస్తుంది. తద్వారా గ్రహం మీద జీవితాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది.ఓజోన్‍ క్షీణత పదార్ధాల నియంత్రిత ఉపయోగాల యొక్క దశలవారీ, సంబంధిత తగ్గింపులు ఓజోన్‍ పొరను దీని కోసం భవిష్యత్‍ తరాలకు రక్షించడంలో సహాయపడటమే కాకుండా, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ప్రపంచ ప్రయత్నాలకు గణనీయంగా దోహద పడ్డాయి. అంతేకాకుండా, ఇది హానికరమైన అతినీలలోహిత వికిరణాన్ని భూమికి చేరకుండా పరిమితం చేయడం ద్వారా …

ఓజోన్‍ పొరను రక్షించుకుందాం సెప్టెంబర్‍ 16న ఓజోన్‍ పొర పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం Read More »

తెలంగాణాలో కొత్త గధేగల్లు (చరికొండ) శాసనం

చరికొండ గ్రామము పాత మహబూబ్‍నగర్‍ జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్‍ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయముంది. ఇంకా ఈగ్రామంలో గ్రామదేవతలు దుర్గమ్మ, పోచమ్మ, కోటమైసమ్మలకు గుడులు వున్నాయి. పాతకాలంనాటి మసీదు వుంది. గ్రామానికి ఉత్తరదిశలో ఖిల్లాగుట్ట వుంది. గుట్టమీద కోట ఆనవాళ్ళున్నాయి. గుమ్మటాలని ప్రజలు పిలుచుకునే కట్టడాలు 4 మిగిలి వున్నాయి. ఈ కోటను రేచెర్ల పద్మనాయకులు కట్టించారని చరిత్ర. చరిగొండ …

తెలంగాణాలో కొత్త గధేగల్లు (చరికొండ) శాసనం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! పెను ప్రమాదంలో భూగోళం! – ‘ఐరాస’ (Code Red for Globe – UN)

(గత సంచిక తరువాయి)అది నవంబర్‍ 6, 2021. స్కాట్‍లాండ్‍లోని గ్లాస్గో నగరం. డ్రమ్ములతో, ట్రంపెట్లతో, వివిధరకాల వాయిధ్యాలతో, ప్రమాదాల నేపథ్య రాగాలతో, ‘మానవాళికి పెనుప్రమాదం / కాలుష్యకారక పెద్దలారా! నా(మా)కు కోపంగా వుంది / మీ కంటితుడుపు పర్యావరణ సదస్సుల్ని మేం చూస్తున్నాం – ఆపండిక!’ లాంటి నినాదాలతో ప్లకార్డుల్ని పట్టుకున్న వేలాదిమంది పర్యావరణ అబిమానులు, ఆలోచనాపరులు, యువతులు, యువకులు, చివరికి పిల్లలు COP-26 సమావేశం సందర్భంగా, గ్లాస్గోనగర వీధుల్లో నిరసనల్ని చేపట్టారు.మనదేశంలో తప్ప, యూరప్‍లోని మహానగరాలైన…

మునగ తిన్నవారికి ఆరోగ్యం -పండించిన వారికి లాభం!

పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ.. రైతుల పాలిట కల్పవ•క్షంగా విరాజిల్లుతున్నది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తున్నది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది.మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్‍లో భారీ డిమాండ్‍ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. …

మునగ తిన్నవారికి ఆరోగ్యం -పండించిన వారికి లాభం! Read More »

ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ

డా।। పత్తిపాక మోహన్‍ రాసిన ‘‘బాలల తాతా బాపూజీ’’ అనే బాల గేయాల పుస్తకం 2020లో వచ్చింది. కవర్‍ పేజీమీద సకిలం ముకిలం వేసుకుని కూర్చున్న గాంధీతాతను వెనకనుంచి ప్రేమతో పెనవేసుకున్న ఓ చిన్న పాప, పక్కన నిలబడి ఓ ఆనంద గీతం చదువుతున్న బాబూ, వాళ్ళందరి ముఖాల్లో పున్నమి వెన్నెలల్లాంటి నవ్వులూ అందరినీ ఆ పుస్తకంలోకి రమ్మని ఆహ్వానిస్తాయి. బాపూజీ గేయాల్లో గొప్ప గుణాలు, ఆయన చేసిన మంచి పనులు, సమాజోద్ధరణ కార్యక్రమాలు, ఆయన జీవన …

ఈనాటి పిల్లలకు గాంధీతాత పరిచయం -బాలల తాతా బాపూజీ Read More »

దయా హృదయం

సోమయ్య, రంగయ్య కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. వారు ఆ గ్రామంలోని దేవాలయానికి వచ్చిన యాత్రికులకు పోటీపడి కొబ్బరికాయలను అమ్మేవారు. సోమయ్య అంటే రంగయ్యకు ఎక్కువ అసూయ, ద్వేషం ఏర్పడింది. సోమయ్య తన కన్నా ఎక్కువ కొబ్బరికాయలు అమ్ముతున్నాడని రంగయ్య సోమయ్య పై ద్వేషం పెంచుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఏదో పనిమీద సోమయ్య లింగాపురానికి వెళ్ళాడు. అక్కడ దారిలో ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి ఉన్నాడు. అతడు ఎవరో కాదు తమ గ్రామానికి చెందిన రంగయ్యనే. వెంటనే …

దయా హృదయం Read More »

అభినందనలు

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘మహబూబ్‍నగర్‍ జిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త డా।। ఎం. రాములు గారి విశ్లేషణ.కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ బాలచెలిమి వారి …

అభినందనలు Read More »

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఏ దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థకైనా ఆయా దేశాల్లోని ప్రభుత్వరంగ సంస్థలు దోహదం చేస్తాయి. డిమాండ్‍కు తగ్గ ఉత్పత్తి, తక్కువ ధరలకు ప్రజలందరికీ అందుబాటులో ఉండటం, వచ్చే ఆదాయం ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం, మిగులు ఆదాయాన్ని మళ్లీ అదే సంస్థలకు పెట్టుబడిగా మార్చడం వల్ల ఒకే సమయంలో ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భరోసా ఏర్పడుతుంది. విదేశీ సంస్థలకు, స్వదేశీ ప్రైవేట్‍ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రజలు పరాధీనత చెందకుండా నివారిస్తాయి. అటువంటి ప్రభుత్వరంగ సంస్థల …

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం Read More »

బొమ్మ హేమాదేవి

తెలంగాణ మలితరం రచయిత్రులలో బొమ్మ హేమాదేవి ఒకరు. మొట్ట మొదటి బహుజన రచయిత్రి. 1960-1980 మధ్యకాలంలో మహిళల నుండి సాహిత్యం వెల్లువయింది. చదువుకునే వారి సంఖ్య పెరగడంతోపాటే రాసేవారి సంఖ్యా పెరిగింది. జీవితానుభవాలు, సంఘటనల నుండి కథలు, నవలలుగా మలిచారు మహిళలు. అందులో ఒకరు బొమ్మ హేమాదేవి. ఆమె అసలు పేరు రుక్ష్మిణీదేవితోపాటు యమున అనే పేరు కూడా ఉంది. రాయడం ఆరంభం చేసినప్పుడు ‘దేవీరమ’ అని ఇంకో పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతో 20 నవలలు, …

బొమ్మ హేమాదేవి Read More »

ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్‍ నుమా ప్యాలెస్‍’

రాజుల సొమ్ము రాళ్ల పాలు’’ అయితే కావొచ్చు గాక నష్టమేముంది? ఒక తాజ్‍మహల్‍, ఒక కోణార్క, ఒక హంపీ, ఒక రామప్ప మనకు దక్కింది కదా!ఆ వరుసలోనే హైద్రాబాదీలకు దక్కింది ఫలక్‍నుమా ప్యాలెస్‍. చార్మినార్‍ నుండి చాంద్రాయణగుట్టకు సీదాగా ప్రయాణిస్తుంటే ఒక మలుపులో కుడి వైపు గుట్టమీద వెలసిన పాలరాతి వెన్నెల భవనమే ఫలక్‍నుమా. ఉర్దూలో ఫలక్‍ అంటే ఆకాశం, నుమా అంటే ప్రతిబింబం. ఆ అందమైన భవనం గురించి అందంగా చెప్పాలంటే ‘‘ఆకాశ హర్శ్యం’’ అన్నమాట.అందమైన, …

ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్‍ నుమా ప్యాలెస్‍’ Read More »