పిల్లల సాహిత్య సృజన – పాఠ్యపుస్తకాలు
(ఆరు నుంచి పదవతరగతి వరకు) ఒకటవతరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు సరదాగా, ఆటల్లాగా ఉండేలా సాహిత్య పక్రియల్లో ముఖ్యమైన వాటిని పరిచయం చేశారు. అలాగే సాహిత్య సృజనకు అవసరమైన పరిశీలన, ఆలోచన, ఊహ, కల్పన మొదలైన వాటిని మెల్లగా పెంచే ప్రయత్నం జరిగింది. పేర్లు పెట్టడం, శీర్షికలు నిర్ణయించడం, పొడిగించడం, వాటిలో మంచిచెడుల గురించి ఆలోచించడం వంటి ప్రయత్నాలనూ పిల్లలు కొనసాగించడానికి పునాదులు వేశారు. అయితే ఇవన్నీ పిల్లల ప్రాథమిక …