ఇంటిగ్రేటెడ్ మాస్టర్‍ప్లాన్ ఒక్కటే పరిష్కారం
ప్రకృతి విపత్తులన్నీ మనకు తెలిసేవస్తున్నాయి. వర్తమాన విపత్తులన్నిటికీ మానవ తప్పిదాలే కారణం. మానవాళి ప్రారంభం నుండీ అనేక ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొంటూనే, తనకు తెలిసినంతలో పరిష్కరించుకుంటూనే తన మనుగడ సాగిస్తున్నది. గత నెల వర్షాలు, వరదలు హైద్రాబాద్ నగర జీవితాన్ని అతలాకుతలం చేసాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. ప్రాణనష్టమూ జరిగింది. హైద్రాబాద్‍కి వరదలు కొత్తకాదు. 1908లో భయంకరమైన వరదలొచ్చాయి. వేలకొద్ది యిళ్లు కొట్టుకుపోయాయి. 20వేల మంది ప్రజలు వరదనీటిలో కొట్టుకుపోయారు. 1914లో ఏడవ నిజాం ఉస్మాన్ ఆలీపాషా హైదరాబాద్ పట్టణానికి రూపకల్పన చేసారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, …