Day: February 1, 2022

భారతదేశపు మొట్టమొదటి యునెస్కో వారసత్వ నగరం అహ్మదాబాద్‍ (గుజరాత్‍)

ఏకైక బహుళ సాంస్కృతిక వారసత్వం జూలై 8, 2017న గుర్తింపు భారతదేశంలోని సబర్మతీ నది తూర్పు ఒడ్డున 15వ శతాబ్దంలో సుల్తాన్‍ అహ్మద్‍ షా స్థాపించిన గోడల నగరం అహ్మదాబాద్‍. ఈ నగరం సుల్తాన్‍ కాలం నాటి గొప్ప నిర్మాణ వారసత్వాన్ని అందిస్తుంది. ముఖ్యంగా భద్ర కోట, కోట నగరం యొక్క గోడలు, ద్వారాలు తదితర నిర్మాణాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మసీదులు, సమాధులు అలాగే తరువాతి కాలంలో ముఖ్యమైన హిందూ, జైన దేవాలయాలు, దిగుడు బావులు, …

భారతదేశపు మొట్టమొదటి యునెస్కో వారసత్వ నగరం అహ్మదాబాద్‍ (గుజరాత్‍) Read More »

మహిళల మదిని దోచే మట్టి గాజులు

గాజులు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. బీరువాలో ఎన్ని డిజైన్లలో గాజులు ఉన్నా.. మళ్లీ ఇంకో డజన్‍ గాజులు తీసుకుందాం అనిపిస్తుంది వారికి. ప్రతి చీరకు కూడా మ్యాచింగ్‍ గాజులు తీసుకోవాలని వారికి ఉంటుంది. బంగారు గాజులను వేసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ, వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి కొందరు బంగారు గాజులు చేయించుకుంటే, మరికొందరు వజ్రాల గాజులు కూడా చేయించుకుంటారు. అయితే, మట్టి గాజులు అందరికీ అందుబాటులో ఉంటాయి. డబ్బులతో సంబంధం లేకుండా …

మహిళల మదిని దోచే మట్టి గాజులు Read More »

యక్షగాన సాహిత్యంలో కల్పిత కథలు

సామాన్య జనజీవనంలో నుండి ఆవిర్భవించి వర్ధిల్లినవి జానపద కళలు. ఇవి స్వయంభువులు. సామాన్య ప్రజల ఆశలకూ, ఆశయాలకూ, ఆలోచనలకూ, ఆవేదనలకు ప్రతిబింబాలు కావడం వల్ల ఇప్పటికీ సజీవంగానే నిలిచి ఉన్నాయి. జానపద కళలు మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు కాబట్టి ఎంతకాలం మన ఆలోచనల మీద ప్రభావాన్ని చూపుతాయో అంతకాలము అవి నిలిచి వుంటాయి. జానపద కళలలో యక్షగాన వాఙ్మయము అతి ప్రాచీనమైనది. దీనిని ప్రజాసాహిత్యమని చెప్పవచ్చు. ఇతివృత్తం పౌరాణికాలు గానీ, సాంఘికాలుగానీ, ఏదైనప్పటికీ ఆబాల గోపాలాన్ని …

యక్షగాన సాహిత్యంలో కల్పిత కథలు Read More »

అమ్మదేవతల కొలువు

అడివిలో నివసించే మనుషులకు, వ్యవసాయం చేస్తున్న వారికి భూమి అమ్మ. పిల్లలకు జన్మనిస్తున్న స్త్రీలను, పంటలనిస్తున్న భూమిని పోల్చుకున్నారు. ఇద్దరికి వున్న సంతానశక్తిని చూసి అచ్చెరువు పొందిన పురామానవులు భూమిని స్త్రీగా, అమ్మగా, స్త్రీని అమ్మదేవతగా చేసుకున్నారు. జంతువులలో, చెట్లలో, మనుష్యులలో పునరుత్పత్తి శక్తులను గమనించిన మానవులు వాటి ప్రజనన(ఫెర్టిలిటి) శక్తికి అబ్బురపడిపోయారు. సంతానం కోరి, పంటల్ని కోరి, ఉత్పత్తి కేంద్రాలైన స్త్రీలను, భూమిని, జంతువులను, చెట్లను ఆరాధించారు. అడివిని కోరిన తిండి యివ్వమని, రక్షణ కల్పించమని, …

అమ్మదేవతల కొలువు Read More »

ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తుంది?

విశ్రాంత ఆచార్యులు డా. ఈదా ఉదయ భాస్కర్‍ రెడ్డి, పర్యావరణ శాస్త్ర విభాగం,ఆంధ్రా విశ్వవిద్యాలయం అంతర్జాలంలో అందించిన వ్యాసం. భూగోళంలో 71 శాతం మేర నీరు ఆవరించి వుంది. అందుకే భూమిని ‘నీటి గోళం’ అని అంటుంటాం. జీవరాశుల ఉనికికి నీరే ప్రధాన కారణం. సుమారు 65 నుంచి 75 శాతం మేర జీవుల దేహాల్లో నీరే వున్నది. మన దేహంలో ఒక శాతం మేర నీరు తగ్గినట్లైతే దాహార్తిని కలిగిస్తుంది. అదే 10 శాతం మేర …

ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తుంది? Read More »

ఆకాశవాణి హైదరాబాద్‍ కేంద్రం

సంగీత సేవలో దక్కన్‍ రేడియో ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం క్రికెట్‍ మ్యాచ్‍, భద్రాచలం రాములోరి కల్యాణం మనం ఒకప్పుడు ఎలా వినే వాళ్లం.. గుర్తుందా.. ఇంటర్నెట్‍, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంది. రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటంలో, గోవా సంగ్రామంలో, పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది. రోజూ నాలుగు పూటలా పలు …

ఆకాశవాణి హైదరాబాద్‍ కేంద్రం Read More »

ఇరు ధృవాలు – భూగోళపు రిఫ్రిజిరేటర్లు

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!! (గత సంచిక తరువాయి)గత ఆరు దశాబ్దాలుగా అంటార్కిటికాకు సంబంధించిన అనేక వాస్తవాలు, విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఈ శ్వేత ఖండంపై అనేక పరిశోధనలు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. భూతాపం సముద్రాలపైననే కాకుండా, సహజసిద్ధమైన ఈ మంచు ఖండంపై ఎలా ప్రభావం చూపుతుందో, భవిష్యత్తులో యావత్‍ భూగోళం ఎంతటి విపత్తును ఎదుర్కోబో తుందో తెలుసుకుంటే కాళ్ళకింద భూమే కాదు మొత్తం భూగోళమే అతాలాకుతలం అవుతుంది.కరోనా కష్టకాలంలో యావత్‍ ప్రపంచం తనకుతానే (మనిషిని) …

ఇరు ధృవాలు – భూగోళపు రిఫ్రిజిరేటర్లు Read More »

సిరిధాన్యాలతో మెట్ట రైతుకు మేలు..

రబీలో బోర్ల కింద రైతులు వరికి బదులు చిరుధాన్యాల సాగును చేపట్టేలా తగిన ధర కల్పించడం, మిల్లెట్‍ బోర్డును సత్వరం ఏర్పాటు చేయడం, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించడం కోసం తెలుగు రాష్ట్రాలు ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామాలను మీరెలా చూస్తున్నారు?నాలుగు వర్షాలొస్తే మెట్ట భూముల్లో పండే సిరిధాన్యాల (అవి చిరుధాన్యాలు కావు.. సిరిధాన్యాలు)ను ప్రోత్సహిస్తూ తెలుగు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం చాలా సంతోషదాయకం. నీటి పారుదల సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రైతులపై ప్రభుత్వాలు దృష్టికేంద్రీకరిస్తూ …

సిరిధాన్యాలతో మెట్ట రైతుకు మేలు.. Read More »

విజయీ భవ

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలూ ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు ’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘మెదక్‍ బడిపిల్లల కథలు’ కథా రచయిత ఐతా చంద్రయ్య విశ్లేషణ.కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి ఆహ్వానం …

విజయీ భవ Read More »

బాలారణ్యంలో ఒక రోజు

బాలారణ్యను చూడడం అంటే అదెంతో ఆనందం కలిగించేదే. బాగా దప్పిక గొన్న వేళ ఎడారిలో ఒయాసిస్‍ ను చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి భావన కలుగుతుంది.బాలారణ్య అనేది ఒక స్థలం మాత్రమే కాదు. ఎన్నో సవాళ్ళ మధ్య…. జీవితాన్ని అనుభూతి చెందేందుకు ఒక నూతన విధానం కూడా. నైట్‍ అడ్వెంచర్‍ క్యాంప్‍ ఆక్స్ ఫర్డ్ విద్యార్థులందరి ముఖాల్లో చిరునవ్వులు విరబూసేలా చేసింది. బడికి వెళ్ళడం, ట్యూషన్లు, ఆటలకు కోచింగ్‍ ఇలాంటి రోజువారీ హడావిడి మధ్య బాలారణ్య …

బాలారణ్యంలో ఒక రోజు Read More »