Day: October 1, 2022

ఆహారం వృథాను అరికడుదాం.. అక్టోబర్‍ 16న ప్రపంచ ఆహార దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిరుపేదలు ఆకలి కడుపుతో రోజులు గడుపుతున్నారు. ఆహారం వృధాను అరికట్టి అందరి కడుపులు నింపడం మనందరి సామాజిక బాధ్యత. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్త అయినా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో అక్టోబర్‍ 16న మనం జరుపు కుంటున్న ప్రపంచ ఆహారదినోత్సవం (వరల్డ్ …

ఆహారం వృథాను అరికడుదాం.. అక్టోబర్‍ 16న ప్రపంచ ఆహార దినోత్సవం Read More »

తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు!

‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం ప్రతి నెల నిర్వహిస్తున్న వెబినార్‍లో భాగంగాసెప్టెంబర్‍ మాసంలో ముఖ్య వక్తగా ప్రసంగించిన డా।। ఈమని శివనాగిరెడ్డి-స్థపతి వ్యాసం కొత్త తెలంగాణా చరిత్ర బృందం కన్వీనర్‍ రామోజు హరగోపాల్‍ గారు ఈ నెల నన్ను మాట్లాడమని కోరి, చరిత్ర చదవాల్సిన అవసరం, బోధనా పద్దతుల్లో రావల్సిన మార్పులు, ఉద్యోగావకాశాలు, చరిత్ర చదవటం వల్ల వ్యక్తిగతంగా ఒనగూడే ప్రయోజనాలు అన్న అంశాలను స్పృశించమన్నారు. ఆయా సందర్భాల్లో గమనించిన కొత్త విషయాలను పాతరాతియుగం నుంచి క్రీ.శ.1000వ …

తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు! Read More »

కాకతీయుల శాసనాలు సమగ్ర పరిశీలనం

(గత సంచిక తరువాయి) సాంఘిక స్థితిగతులుకాకతీయుల కాలంలో సాంఘిక వ్యవస్థ ప్రాచీన భారతీయ రాజనీతి విధానాన్నే అనుసరించినారు. రాజ్యవిస్తరణలో భాగంగా వివాహాది సంబంధాలకు కుల ప్రాతిపదికను రాజులు స్వీకరించలేదనే చెప్పవచ్చు. సంఘంలో అన్ని కులాలవారు వారి వారి కులసంబంధ వృత్తులను చేసుకునేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది. రాజ్య వ్యవస్థలో బాహత్తర నియోగాధిపతులు ఉండేవారు అందులో అన్ని కులాల వారికి భాగస్వామ్యం ఉండేది. కరణం, పెద్ద కాపు, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వండ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, …

కాకతీయుల శాసనాలు సమగ్ర పరిశీలనం Read More »

తెలంగాణ మలి ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక!

అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక.. అని ప్రజాకవి, పద్మవిభూషణ్‍ కాళోజీ నారాయణరావు గారు అర్ధ శతాబ్దం కిందటే అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమానికి నెగడై నిలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తొలి తరానికి చెందిన పెద్దలు కాళోజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‍, డా. మర్రి చెన్నారెడ్డి తదితరులు పునాదులై నిలిచారు. ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణా మలి ఉద్యమం ద్వారా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైనాక, కొన సాగుతున్న ఎనిమిదేళ్ళ …

తెలంగాణ మలి ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక! Read More »

తెలంగాణకు దశ వసంతాలు దిశ చూపిన దక్కన్‍ ల్యాండ్‍

ఏపత్రికైనా ప్రజల అభిప్రాయాలకు కొంతైనా ప్రాతినిధ్యం వహిస్తుంది. రోజూ వార్తలు వింటాము, దిన పత్రికలు చదువుతాము. ఐనా కొన్ని విషయాలు, అంశాలు ప్రత్యేకంగా చర్చిస్తే తప్ప ప్రజల మనసుల్లో నిలిచిపోవు. అటువంటి అంశాలను ప్రజలచేత చర్చింప జేసే దక్కన్‍ల్యాండ్‍ మాస పత్రిక లక్ష్యం నెరవేరినట్లే.దృశ్య మాధ్యమం అధికమైన ఈరోజులలో ఏ పత్రిక నడపడమైనా సులభంగా లేదు. దినపత్రికలు కూడా తమ సిబ్బందికి సరైన జీతాలు, సౌకర్యాలు ఇవ్వలేకపోతున్నయని తెలుస్తున్నది. ఇటువంటి గడ్డురోజులలో ఒక దశాబ్దకాలం అడ్డంకులన్నీ అధిగమించి …

తెలంగాణకు దశ వసంతాలు దిశ చూపిన దక్కన్‍ ల్యాండ్‍ Read More »

యూరప్‍ ఖండంలో తీవ్రమైన కరువు దేనికి సంకేతం?

‘‘ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రకృతి’’ శీర్షికన అక్టోబర్‍ 2021 సంచికలో వ్యాసం రాసి ఉన్నాను. దానికి కొనసాగింపుగానే ఈ ఏడు యూరప్‍ ఖడాన్ని అతలాకుతలం చేస్తున్న కరువును విశ్లేషించు కుందాము. యూరప్‍లో ఈ యేడు సంభవించిన కరువు పరిస్థితులు ఏర్పడిన దానికి ముందే భారత్‍ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో సంభవించిన ప్రకృతి విపత్తులను ఒకసారి మననం చేసుకుందాము. 2013లో జరిగిన కేదార్‍నాథ్‍ దుర్ఘటన, 2021 ఫిబ్రవరి 8న జరిగిన రిషిగంగా నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలు, …

యూరప్‍ ఖండంలో తీవ్రమైన కరువు దేనికి సంకేతం? Read More »

తోకలేని పిట్ట అక్టోబర్‍ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరం నేడు పెద్దగా కనిపించడం లేదు. ఎన్నో వార్తలను మోసుకువచ్చే పోస్టు మాన్‍ సైకిల్‍ బెల్లు నేడు మూగబోతోంది. టెక్నాలజీ కారణంగా నేడు క్షణాల్లోనే సమాచారం చేరే పరిస్థితి ఉండడంతో పోస్టు లెటర్‍ అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఎన్ని రకాల సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా.. పోస్టల్‍ సర్వీసులను ఆదరించేవారు, వాటితో అనుబంధం కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచ పోస్టాఫీస్‍ దినోత్సవం …

తోకలేని పిట్ట అక్టోబర్‍ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ Read More »

పర్యావరణ పరిరక్షణ

భూమి, ఆకాశం, గాలి, నీరు,అగ్ని ఈ ఐదు పంచభూతాలు. పంచభూతాల సమ్మిళితమే ప్రకృతి లేదా పర్యావరణము. పంచభూతాల మయమైన ప్రకృతి వలనే ప్రాణికోటి ఆవిర్భవించింది. భవిష్యత్తులో కూడా ప్రాణికోటి మనుగడ కొనసాగవలెనన్న పంచభూతాలను అనగా పర్యావరణమును పరిరక్షించుకోవడం ఎంతైనా అవసరము.ఈ పంచభూతాలు ఏవిధముగా కలుషిత మౌతున్నవి, వాటిని ఏవిధముగా పరిరక్షించుకోవాలి అన్న విషయం మీద ఆలోచన చేద్దాము1) గాలి: గాలి లేనిదే మనం మరియు ప్రాణి కోటి ఒక నిమిషమైన బ్రతుకలేదు. అందుచేత గాలిని కలుషితం కాకుండ …

పర్యావరణ పరిరక్షణ Read More »

వావికొల్లులో ఉదయనచోడుని కొత్తశాసనం

నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని వావికొల్లు గ్రామం పొలిమేరలో కందూరుచోడులనాటి కొత్తశాసనం లభించింది. ఇది తెలంగాణ చరిత్రలో కొత్తపేజీ. కందూరుచోడుల పాలనాకాలానికి చేర్చిన కొత్త విశేషణం. నల్లగొండ జిల్లాకేంద్రానికి పొరుగునవున్న పానుగల్లు రాజధానిగా కందూరు-1100ల నాడును కందూరిచోడులు తొలుత కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా, తర్వాత కాకతీయ సామంతులుగా 250యేండ్లు పాలించారు. ఈ శాసనంలో పేర్కొనబడిన ఉదయనచోడుడు నల్లగొండ జిల్లా శాసనసంపుటి, వా.2లో సం.25వ, క్రీ.శ. 1149నాటి సిరికొండ శాసనంలో ప్రస్తావించబడ్డాడు. ప్రస్తుత వావికొల్లు శాసనం ఉదయనచోడుని శాసనాలలో …

వావికొల్లులో ఉదయనచోడుని కొత్తశాసనం Read More »

జానపద కళారూపాల్లో దక్కనీ కళాసంస్కృతి

ప్రపంచ జానపద కళ ఉత్సవాలను ప్రతీ సంవత్సరం ఆగస్టు 22నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లిఖిత సంప్రదాయానికి ముందే దేశదేశాల్లో జానపద కళారూపం మౌఖిక సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది. అపు రూపమైన విజ్ఞానాన్ని అందించిన ఈ జానపదకళ జాతుల వారసత్వసంపదగా మిగిలి పోతోంది. అంతేగాదు అది జాతుల సాంస్కృతిక చిహ్నంగా కూడా నిలిచి పోతోంది. వాస్తవంగా జానపద అస్తిత్వమంతా జానపద కళా వైభవాల్లోనే నిక్షిప్తమై ఉంది. ఒక్క కళలే గాదు మానవ మనుగడకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించింది …

జానపద కళారూపాల్లో దక్కనీ కళాసంస్కృతి Read More »