ఆకుపచ్చ నగరం… హరిత హైదరాబాద్
ప్రకృతి సమవాది. తను ఇవ్వదగిన ప్రతిదీ సృష్టిలోని ప్రతి జీవరాశికీ అవసరాలకి అనుగుణంగా అందించగల వర ప్రసాదిని. జీవరాశులన్నిటిలో తెలివైనవాడుగా పరిగణించ బడుతున్న మనిషి ‘ప్రకృతి తన ఒక్కడిదే’ అన్న భావనతో అవసరానికి మించి వినియోగించటంతో జీవ వైవిధ్యం దెబ్బ తినడమే కాక, ప్రకృతిలో సమతుల్యతకి విఘాతం ఏర్పడుతుంది. దీని వల్ల ప్రకృతి విపత్తులు వేగంగా వెంట వెంటనే తోసుకొస్తున్నాయి. మానవాళి అవసరాలకి అనుగుణంగా ప్రకృతిని క్రమబద్ధంగా వినియోగించుకోగల విజ్ఞత నేటి తక్షణ అవసరం. హైదరాబాద్ నగరం …