Day: March 1, 2024

మానవ శ్రేయస్సుకు నీటి అవసరం!

ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. 1992 బ్రెజిల్‍ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివ•ద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNESCO) ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది. సామాజిక ఆర్థిక వ•ద్ధి ఎక్కువగా నీటిపైనే …

మానవ శ్రేయస్సుకు నీటి అవసరం! Read More »

ఆధునికతకు అత్యుత్తమ తోడ్పాటు లీ కొర్‍భూసియర్‍ ఆర్కిటెక్చరల్‍ వర్క్

ఉనికి: చండీగఢ్‍, భారతదేశం(సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍)ప్రకటన తేదీ: 2016వర్గం: సాంస్క•తికం (సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍) (Serial Transmational Site – Cultural) అత్యుత్తమ సార్వత్రిక విలువలీ కొరిభూసియర్‍ డిజైన్‍ చేసిన నిర్మాణాల నుంచి ఎంపిక చేయబడిన, ఈ ట్రాన్స్ నేషనల్‍ సీరియల్‍ ప్రాపర్టీ మొత్తం పదిహేడు సైట్‍లతో కూడుకున్నది. గతకాలంలో ఓ సంచలనాన్ని స•ష్టించిన కొత్త నిర్మాణ భాష యొక్క వినూత్నతకు నిదర్శనం. చండీగఢ్‍ లోని క్యాపిటల్‍ కాంప్లెక్స్ అనేది లా కార్బియుసియర్‍ ఇతర …

ఆధునికతకు అత్యుత్తమ తోడ్పాటు లీ కొర్‍భూసియర్‍ ఆర్కిటెక్చరల్‍ వర్క్ Read More »

బొంతల చెట్లు – నా యాది మనాది

చెట్లు మనుషుల లాంటివే. మనకు ఉన్నట్టే వాటికి కూడా పేర్లు ఉంటాయి. మనకన్నా ముందు నుంచి ఉంటాయి. మన తర్వాత కూడా ఉంటాయి. వాటికీ మనలాగే జనన మరణాలు ఉంటాయి. కొన్ని మన కండ్ల ముందే కనుమరుగు అవుతాయి. అవి బతికినన్ని రోజులు మనకు అందించే సేవలు వెలకట్టలేనివి. అవి మనలను అలరిస్తాయి. సేద దీరుస్తాయి. మన ఆటలకు, మన ముచ్చట్లకు వేదికలవుతాయి. మనకు ఎన్నెన్నో అనుభూతులను మిగులుస్తాయి. మన కుటుంబ ఆస్తిత్వాలలో లేదా మన ఊరి …

బొంతల చెట్లు – నా యాది మనాది Read More »

వజ్రం వజ్రమే

మన సాహిత్యంలో దైనందిన జీవితంలో వజ్రం అనే పదాన్ని తరచుగా వింటుంటాము. ధ•ఢమయిందీ, మన్నికైనది దేన్నయినా వజ్రంతో పోలుస్తారు. వజ్రకాయము, వజ్ర సంకల్పము, వజ్రసన్నిభము ఇలా.. శక్తివంతంగా పనిచేసేదాన్ని దేనినైనా వజ్రాయుధంతో పోలుస్తారు. వజ్రానికి పర్యాయపదాలు:‘‘హీరక, వజ్ర, దధీత్యస్థి, సుచీముఖం, వరారకం, ఇంద్రాయుధం, భిదూరం, లోహజిత్‍, కులిశం, పబిః మరియు అభేద్యం’’ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన వజ్రం సామాన్యుడి నుండి రాజుల వరకు చిరపరిచితం. అందరికి అందుబాటులో లేకున్నా వజ్ర లక్షణాలైన మెరుపు, కఠినత్వం గురించి తెలియని …

వజ్రం వజ్రమే Read More »

నా పాత్ర ఇంకా సశేషం, నేను ఒక విశేషం! చెన్నమనేని రాజేశ్వర రావు గారు

‘‘స్వాతంత్ర సమరయోధులు చెన్నమనేని జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం’’ పోస్టల్‍ కవర్‍ ఆవిష్కరణ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‍ రెడ్డి గారు ‘‘శాసనసభలో వారి ప్రసంగాలు వారి ప్రత్యామ్నాయ రాజకీయార్ధిక సామాజిక మార్పులపైన విష్లేశణ ఉన్న ఈ పుస్తకం ప్రతి ప్రజాప్రతినిధికి ఒక విజ్ఞాణభాండారం’’ శాసనసభలో వారి ప్రసంగాల పుస్తకావిష్కరణ సందర్భంగా శాసనమండలి చైర్మన్‍ గుత్తా సుఖేందర్‍ రెడ్డి గారు‘‘శాసనసభాపతిగా శాసనసభలో వారి పాత్ర చూసే భాగ్యం నాకు దక్కడం నా అద్రుష్టం’’ కె.ఆర్‍.సురేష్‍ …

నా పాత్ర ఇంకా సశేషం, నేను ఒక విశేషం! చెన్నమనేని రాజేశ్వర రావు గారు Read More »

గుల్జార్‍ చెప్పిన కథ

కథ ఎలా ఉండాలి? అని ఎవరైనా అడిగితే గుల్జార్‍ చెప్పిన ప్రేమ్‍ చంద్‍ కథను మినహా మరో మంచి ఉదాహరణ నేనేమి ఇవ్వగలను అనిపిస్తుంది!1930లలో రాసిన ఆ కథ… కథలోని ఆ ఐదేళ్ళ హమీద్‍… ఈద్‍ యొక్క అందమైన ఉదయం మనల్ని వెంటాడుతుంది.మనిషి జీవితం పాటతో మొదలైనా, మనిషికి సన్నిహితంగా ఉండేవి కథలు. బుద్ధి తెలిసినప్పటినుంచి మనిషి వినేవి కథలే. మనిషి జీవితం కథలతోనే మొదలవుతుంది. కథలతోనే ముగుస్తుంది. అవి ఆత్మకథలు కావచ్చు. జ్ఞాపకాలు కావచ్చు. కథ …

గుల్జార్‍ చెప్పిన కథ Read More »

శక్తి ఆరాధకులు – బైండ్ల కళాకారులు

తెలంగాణా జానపద కళారూపాల్లో విశిష్టమైన కళారూపం బైండ్ల కళారూపం. ఇక్కడ మనుగడలో ఉన్న కళారూపాల్లో భారతం, రామాయణం కథలను కథాగానం చేసే కళారూపాలే ఎక్కువ. ఇందుకు భిన్నంగా కేవలం శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ వంటి దేవతలను కొలుస్తూ, కథలు చెప్పే కళారూపాల్లో అరుదైన కళారూపం బైండ్ల కళారూపం కావడం విశేషం. వంశపారంపర్యంగా సంక్రమించిన కథాగాన సంస్క•తిని అనుసరిస్తూ వృత్తిగాయకులుగా పేరు గాంచిన బైండ్లవారు ఎల్లమ్మ, మారమ్మ, మైసమ్మ, భవాని, దుర్గా, కాళి మొదలైన …

శక్తి ఆరాధకులు – బైండ్ల కళాకారులు Read More »

ప్రకృతే సౌందర్యం! 22 ప్రకృతే ఆనందం!! మా రంగుల ప్రపంచాన్ని ధ్వంసం చేయకండి!

గత కథనాల్లో సముద్రమథనం గూర్చిన తొలినాటి ప్రయత్నాల్ని చూసాం. మానవుడి మేధస్సుకు అందనంతగా సముద్ర లోతులున్నట్లు గుర్తించాం. వీటి అంతర్భాగాల గూర్చి తెలియకముందు వివిధ దేశాల్లో, ప్రజల్లో అనేక అభిప్రాయాలుండేవి. సనాతన దేశాలైన రోమ్‍, గ్రీస్‍, రష్యా, చైనా, భారత్‍ లాంటి దేశాల్లో సముద్రాలు దేవుడి ఆవాసాలని నమ్మేవారు. ఇవే నమ్మకాలు ఎత్తైన పర్వతాలపై కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్‍ను, కేరళను ఇప్పటికి దైవభూమి అని సంబోధించడం తెలిసిందే! మనం నమ్మే భాగవతంలో పాలసముద్రంపై మహావిష్ణువు ఆదిశేషునిపై పవలించగా, …

ప్రకృతే సౌందర్యం! 22 ప్రకృతే ఆనందం!! మా రంగుల ప్రపంచాన్ని ధ్వంసం చేయకండి! Read More »

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా – కొన్ని స్థల నామాలు

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాను ఎదులాపురం, ఎడ్లపురం’గా పిలిచే వారట. తొలి తెలుగు యాత్రా చరిత్ర రాసిన ఏనుగుల వీరస్వామి తన కాశీ యాత్ర చరిత్రలో ఎదులాబాద్‍ గానే ప్రస్తావించాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీజాపూర్‍ సుల్తాన్‍ మహమ్మద్‍ ఆదిల్‍ షా పేరు మీదుగా ఆదిల్‍ షా బాద్‍ గా ఏర్పడి క్రమంగా ఆదిలాబాద్‍గా పరిణామం చెందిందని చారిత్రక కథన మున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం అయిదు రెవిన్యూ డివిజన్‍లుగా, యాభై రెండు మండలాలుగా, మొత్తం 1725 …

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా – కొన్ని స్థల నామాలు Read More »

ఆయిల్‍ ఫామ్‍ పై సందేహాలు – సమాధానాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‍ పామ్‍ తోటలను ఎక్కువ ఎకరాలలో రైతులు సాగు చేయాలని, ఆయిల్‍ పామ్‍ సాగు రైతులకు ఎంతో లాభదాయకమని జాతీయ ఆయిల్‍ పామ్‍ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త రామచంద్రుడు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్‍ ఫెడ్‍ ఆధ్వర్యంలో ఆయిల్‍ పామ్‍ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ములుగులో ఏర్పాటు చేసిన ఆయిల్‍ పామ్‍ నర్సరీని సందర్శించారు. రైతుల పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. అబ్లషన్‍ (పూలగుత్తులను తొలగించుట) ఎప్పటివరకు కొనసాగించాలి?పుష్సగుచ్చాలు …

ఆయిల్‍ ఫామ్‍ పై సందేహాలు – సమాధానాలు Read More »