Day: April 1, 2024

క్యాన్సర్‍ భూతం

కుర్మయ్య: అమ్మా! నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. పదా! ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం.తల్లి: వద్దు బిడ్డా! ఇప్పటికే మస్తు ఆస్పిటల్లకు తిరిగినా. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు. నేను రాను బిడ్డా!కుర్మయ్య: లేదమ్మా! నామాట విను! పాలమూరులో మంచి డాక్టర్‍ వున్నడు. సూపించుకుని వద్దాం . ఇదొక్క సారి నా మాట వినమ్మా!తల్లి: సరే బిడ్డా! పోదాం పదా ఈ మాయదారి రోగమేందో నన్ను సంపుతోందికుర్మయ్య: అమ్మా! పాత రిపోర్టులన్నీ తీసుకోతల్లి: తీసుకున్న బిడ్డా!కుర్మయ్య: డాక్టర్‍ గారూ! …

క్యాన్సర్‍ భూతం Read More »

లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ

హైదరాబాద్‍ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‍ ఇండికేషన్‍ (Geographical Indication) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‍ హలీమ్‍కు జీఐ ట్యాగ్‍ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‍ లాడ్‍బజార్‍ లాక్‍ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ GI Registration Tagను ప్రకటించింది. తెలంగాణలో జీఐ ట్యాగ్‍ అందుకున్న 17వ ఉత్పత్తి …

లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ Read More »

ఖజురహో కట్టడాలు

ఉనికి: మధ్యప్రదేశ్‍ UNESCO SITE – 1986గుర్తింపు: 1986విభాగం: సాంస్క•తికం (MOUNUMENT) ఖజురహోలోని దేవాలయాలు చండేలా రాజవంశం పాలనలో నిర్మించబడ్డాయి. అవి మూడు విభిన్న సమూహాలుగా విభజించబడ్డాయి. ఇవి రెండు వేర్వేరు మతాలకు చెందినవి. ఒకటి హిందూ మతం, మరొ కటి జైన మతం. వాస్తుశిల్పం, శిల్పకళల మధ్య సంపూర్ణ సమతుల్యతతో, అన్ని ఆలయఉపరితలాలు బాగా చెక్కబడ్డాయి. ఆరాధనలు, వంశం, చిన్నచిన్న దేవతలు, సన్నిహిత జంటలను చెక్కారు. ఇవన్నీ పవిత్ర విశ్వాస వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. అత్యంత నిపుణులైన …

ఖజురహో కట్టడాలు Read More »

రామగిరి కథ

తెలంగాణ రాష్ట్రం పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి దగ్గరగా రామగిరిఖిల్లాగా పిలువబడేదే రామగిరి దుర్గం. ఈ కోట రామగిరి గుట్టలమీద నిర్మాణమైంది. వనౌషధులకు ప్రసిద్ధమైన దట్టమైన అడవి విస్తరించిన ప్రదేశంలోనే దుర్గం కట్టబడ్డది. వివిధ మూలికాజాతులకు చెందిన మొక్కలతో సంపన్నమైంది. ఈ కోట నుంచి చూస్తే మానేరు, గోదావరి నదుల సంగమం కనిపిస్తుంది. రామగిరిని తరుచుగా రత్నగిరి, రత్నగర్భ అంటుంటారు. రామగిరి భౌగోళిక స్థితి:రామగిరి కొండ భౌగోళికంగా 790025-790028 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, 180034-180038 …

రామగిరి కథ Read More »

కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన

“If all mankind were to disappear, the world would regenerate back to the rich state of equilibrium that existed ten thousand years ago. If insects were to vanish, the environment would collapse into chaos.” – E. O. Wilson మానవ జాతి అంతా కనుమరుగైతే, ఈ ప్రపంచం పదివేలయేళ్లనాటి సమతుల్యతతో గొప్ప పునరుజ్జీవనం పొందుతుంది. కీటక జాతులు నాశనమైతే, పర్యావరణమంతా సంకటస్థితిలోకి కుంగిపోతుంది-జీవావరణ …

కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన Read More »

భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం

రాజస్థాన్‍లో 500 మెగావాట్ల సోలార్‍ ప్లాంటుకు ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఆదేశంమరింత తక్కువ ధరలో విద్యుత్‍ ఉత్పత్తికి క•షి చేయాలిరాష్ట్రంలో పవన విద్యుత్తు ప్లాంట్‍ల ఏర్పాటుకు పరిశీలనసింగరేణి సంస్థ చైర్మన్‍ మరియు ఎండి ఎన్‍.బలరామ్‍ ఇప్పటికే కంపెనీ వ్యాప్తంగా 234 మెగావాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగా వాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉందని సింగరేణి చైర్మన్‍ మరియు ఎండి …

భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం Read More »

ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లా – గ్రామ నామాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లాకు ప్రత్యేక స్థానమున్నది. ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, త్రికూటులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, బోధన్‍ చాళుక్యులు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, కుతుబ్‍ షాహీలు, బరిద్‍ షాహీలు, మరెడ్డి రాజులు, మొఘల్‍ చక్రవర్తులు, మహారాష్ట్రులు, అసఫ్‍ జాహీలు పరిపాలించారు. ఈ జిల్లాకు దక్షిణాన మరియు పడమరన కొంత భాగం ఉమ్మడి మెదక్‍, బీదర్‍, నాందేడ్‍ జిల్లాలు ఉండగా, తూర్పున ఉమ్మడి కరీంనగర్‍ జిల్లా, ఉత్తరాన ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాలు …

ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లా – గ్రామ నామాలు Read More »

ప్రకృతే సౌందర్యం! 23 ప్రకృతే ఆనందం!! తిండి పోతులం! ఆహారపు గొలుసులో మేమే తోపులం!!

జీవజాతులలో పరిమాణం దృష్ట్యా భూచరాలల్లో ఏనుగును, ఖడ్గమృగాన్ని, నీటిగుర్రాన్ని అతిపెద్ద జంతువులుగా గుర్తిస్తే, జలచరాలల్లో పెద్దజంతువులుగా సొరచేపని, తిమింగలాన్ని ప్రస్తావిస్తాం! భూ, జలచరాల్లో అన్నింటా తిమింగలమే అతిపెద్ద జంతువు. భారీకాయంతో, సుమారు 100 అడుగుల పొడవుతో, 150 టన్నుల (బ్లూవేల్‍) బరువుతో వుండే తిమింగలం నాలుకే మూడు టన్నులంటే నమ్మశక్యం కాదు. అయితే జంతువుల పరిమాణంను కచ్చితంగా తేల్చడం కష్టమైనపని. జంతువు యొక్క బరువు, పొడవు, ఎత్తు, శరీర సాంద్రత (ఎ•••) తదితర కొలతలు, తూకాలు అనేక…

తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలుగా గుర్తించబడిన 35 తెగలు తమ సంస్క•తిలో భాగంగా జరుపుకునే పండుగలు, దేవతల కొలుపులు, పెళ్లిళ్లు, చావు పుట్టుకలు, వినోదాలు వంటి సందర్భాల్లో సంగీత వాద్యాలను ఉపయోగిస్తారు. వీరు ఆయా సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన వాద్యాలను వాయించుకుంటూ తమ సాంస్క•తిక జీవనాన్ని గడుపుతున్నారు. అనాదిగా వాద్యం వారి జీవితంలో భాగమై ఆయా గిరిజనుల విభిన్న సాంస్క•తిక వైవిధ్యాన్ని తెలియజేస్తున్నవి. ఆంధప్రదేశ్‍లో కనిపించే భగత, వాల్మీకి, కొండదొర, నూకదొర, కమ్మర, గదబ, గౌడ, కొటియా, …

తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం Read More »

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం

ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం (Earth Day) ఏప్రిల్‍ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే.. దీని లక్ష్యం, ప్రాముఖ్యత. ఈ రోజును అంతర్జాతీయ మదర్‍ ఎర్త్ డే (International Mother Earth Day) అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలిగించే, గ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్‍ వార్మింగ్‍, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచ …

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం Read More »