deccanland

ప్రకృతే సౌందర్యం! 23 ప్రకృతే ఆనందం!! తిండి పోతులం! ఆహారపు గొలుసులో మేమే తోపులం!!

జీవజాతులలో పరిమాణం దృష్ట్యా భూచరాలల్లో ఏనుగును, ఖడ్గమృగాన్ని, నీటిగుర్రాన్ని అతిపెద్ద జంతువులుగా గుర్తిస్తే, జలచరాలల్లో పెద్దజంతువులుగా సొరచేపని, తిమింగలాన్ని ప్రస్తావిస్తాం! భూ, జలచరాల్లో అన్నింటా తిమింగలమే అతిపెద్ద జంతువు. భారీకాయంతో, సుమారు 100 అడుగుల పొడవుతో, 150 టన్నుల (బ్లూవేల్‍) బరువుతో వుండే తిమింగలం నాలుకే మూడు టన్నులంటే నమ్మశక్యం కాదు. అయితే జంతువుల పరిమాణంను కచ్చితంగా తేల్చడం కష్టమైనపని. జంతువు యొక్క బరువు, పొడవు, ఎత్తు, శరీర సాంద్రత (ఎ•••) తదితర కొలతలు, తూకాలు అనేక…

తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలుగా గుర్తించబడిన 35 తెగలు తమ సంస్క•తిలో భాగంగా జరుపుకునే పండుగలు, దేవతల కొలుపులు, పెళ్లిళ్లు, చావు పుట్టుకలు, వినోదాలు వంటి సందర్భాల్లో సంగీత వాద్యాలను ఉపయోగిస్తారు. వీరు ఆయా సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన వాద్యాలను వాయించుకుంటూ తమ సాంస్క•తిక జీవనాన్ని గడుపుతున్నారు. అనాదిగా వాద్యం వారి జీవితంలో భాగమై ఆయా గిరిజనుల విభిన్న సాంస్క•తిక వైవిధ్యాన్ని తెలియజేస్తున్నవి. ఆంధప్రదేశ్‍లో కనిపించే భగత, వాల్మీకి, కొండదొర, నూకదొర, కమ్మర, గదబ, గౌడ, కొటియా, …

తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం Read More »

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం

ప్రతి యేటా ధరిత్రి దినోత్సవం (Earth Day) ఏప్రిల్‍ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే.. దీని లక్ష్యం, ప్రాముఖ్యత. ఈ రోజును అంతర్జాతీయ మదర్‍ ఎర్త్ డే (International Mother Earth Day) అని కూడా అంటారు. పర్యావరణానికి హాని కలిగించే, గ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్‍ వార్మింగ్‍, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచ …

పర్యావరణ పరిరక్షణ ఏప్రిల్‍ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం Read More »

మాడభూషి రంగాచార్య స్మారక కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం

మాడభూషి రంగాచార్య స్మారక సంఘం వారు గత ఇరవై యేళ్లుగా బాలసాహిత్య రంగంలో చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం. ప్రతి ఏటా నవంబరు నెలలో హైదరాబాద్‍లోని పాఠశాలల బాలబాలికలకు కథల పోటీ నిర్వహిస్తుంది. అందులో బాగున్న కథలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పదకొండు ప్రోత్సాహక బహుమతులను మార్చి 11న అందజేయడంతో పాటు ఇద్దరు బాల సాహితీవేత్తలను సన్మానించడం జరుగుతుంది. ఈ యేడాది మార్చి 11న హైదరాబాద్‍ నగరంలోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో గిరిజ పైడిమర్రి …

మాడభూషి రంగాచార్య స్మారక కథల పోటీ బహుమతుల ప్రదానోత్సవం Read More »

బాలచెలిమి గ్రంథాలయం

జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, తడపాకల్‍, నిజామాబాద్‍ జిల్లా బాల చెలిమి గ్రంధాలయంను మా పాఠశాలలో 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 25 వేల రూపాయలతో మా పాఠశాలకు ఈ గ్రంథాలయాన్ని బాలచెలమి వ్యవస్థాపకులు శ్రీ వేదకుమార్‍ గారు ఇవ్వడం జరిగింది. అనేక రకాల పుస్తకాలు ఉండడంవల్ల మా విద్యార్థులు వాటిని చదవడం, అనేక విషయాలు అర్థం చేసుకోవడం, దానితోపాటు చక్కగా కథలు రాయడం, కవితలు అల్లడం జరిగింది. అనేక సాహిత్య పోటీలలో పాల్గొని బహుమతులు …

బాలచెలిమి గ్రంథాలయం Read More »

మంచి పుస్తకం @ 20

పిల్లలు పరిపూర్ణులు. వాళ్ల భవిష్యత్తును వాళ్లు ఎంచుకోవాలి, అందుకు బాధ్యత కూడా వాళ్లే వహించాలి అన్న నమ్మకంతో మంచి పుస్తకం పని చేస్తుంది. అనుకరణ, ఇతరులను ఆరాధించటం ద్వారా పిల్లలు నేర్చుకుంటారన్నది నిజమే. అయితే, ఎవరితో (దేనితో) ప్రభావితం కావాలనేది ఎంచుకునేది పిల్లలే. కాబట్టి, వారికి నీతి కథలు చెప్పాల్సిన పనిలేదు, అందువల్ల ఉపయోగం కూడా లేదు. రోడ్లు మీద పాదాచారులతో సహా ఎవరూ నియమాలు పాటించరు. పుస్తకాలలో ట్రాఫిక్‍ రూల్స్ గురించి ఎంత చెప్పినా ఏం …

మంచి పుస్తకం @ 20 Read More »

నానమ్మ చెప్పిన కథ

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

నానమ్మ చెప్పిన కథ Read More »

మహిళా సాధికారత ఒక సమాజపు నిజమైన అభివృద్ధికి గుర్తు

‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అన్నారు గురజాడ.రాచరికాల నుండి నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజం వరకు స్త్రీ అనేక అసమానతలకు, వివక్షలకు, స్వేచ్ఛా రాహిత్యానికి గురవుతూనే ఉంది. విద్యకీ, భావప్రకటనా స్వేచ్ఛకీ, నిర్ణయాధికార హక్కులకూ, తన శరీరంపై తన హక్కులకు, పునరుత్పత్తి హక్కులకు, ఉపాధి అవకాశాలకు, ఆర్థిక, రాజకీయ హక్కులకు మొత్తంగా సామాజిక జీవితానికి దూరమవుతూనే ఉంది. 1975లో అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరిగిన తర్వాత మన దేశ స్త్రీలలోను అస్తిత్వ చైతన్యం పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ …

మహిళా సాధికారత ఒక సమాజపు నిజమైన అభివృద్ధికి గుర్తు Read More »

పి.వి. నరసింహారావు

పి.వి.నరసింహారావు!తెలుగు వాడి తేజం!ఒక చైతన్యఝరి!ఒక అద్భుత సాహితీలహరిబహుముఖప్రజ్ఞాశాలి.. బహుభాషావేత్త..అంతేకాదు.. కాలం, సమాజపత్మం మీద చేసిన అందమైన హస్తాక్షరి బీజం నుండి భుజం వరకు ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. బిందువు నుండి సింధువు వరకు ఆయన ప్రజ్ఞ బహుముఖీనంగా విస్తరించింది.పి.వి. గారి అపురూప వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడానికి భాష చాలదు. ఆయన మేథస్సును అంచనా వేయడానికి ఊహ చాలదు. దేశం (రాజకీయ రంగం)లో సమకాలీన సంక్షుభిత రాజకీయాలను మేధావులు కూడా ప్రభావితం చేయగలరని పి.వి. గారి ద్వారా నిరూపితమైనది.పి.వి. …

పి.వి. నరసింహారావు Read More »

మానవ జాతి తప్పిదాలకు బలైపోతున్న పిచ్చుకలు

పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించు కునేందుకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మనిషి తన మనుగడ తాను చూసుకుంటూ మిగతా పరిసరాలను, జీవజాలాన్ని విస్మరిస్తున్నాడు. పిచ్చుకమీద మనం ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రాలతో పక్షి జాతి నిర్వీర్యమవుతోంది. పిచ్చుకల జాతిని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి మార్చి 20 తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఒకకొత్త థీమ్‍తో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు, వీటి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలలు, …

మానవ జాతి తప్పిదాలకు బలైపోతున్న పిచ్చుకలు Read More »