deccanland

‘రంగుల లోకంలో పల్లెల సోయగం’ గ్రామీణ జీవన ప్రతిరూపాలు ఆగాచార్య చిత్రాలు

అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వాస్తవిక అంశాలను స్వీకరించి అందుకు అనుగుణమైన వాతావరణ కల్పనతో మైమరపించే చిత్రాలను గీయడంలో సిద్ధహస్తులు ఆగాచార్య. గ్రామీణ జీవనంలోని కళారూపాలు, వృత్తులు, ఆత్మీయానుబంధాలు, సంస్కృతీ సంప్రదాయాలకు లోగిళ్ళుగా ఆయన చిత్రాలు కనిపిస్తాయి. చిత్రరచన అంటే ఇలా ఉండాలి అని తన చిత్రాలను అందుకు నిజరూపాలుగా మలచిన చిత్రకళా మాంత్రికుడు ఆగాచార్య. పల్లె అందాలను తన చిత్రాలకు ముడిసరకుగా మార్చుకుని అపురూప రూపాత్మకతలను చిత్రకళా రంగానికి ఆయన అందించారు. పల్లెపడుచుల అందాలనేకాదు వారి మదిలోని …

‘రంగుల లోకంలో పల్లెల సోయగం’ గ్రామీణ జీవన ప్రతిరూపాలు ఆగాచార్య చిత్రాలు Read More »

నవ్య సినిమా ఉద్యమంలో విభిన్న కెరటం మృణాల్‍సేన్‍

సినిమా గారడి చేయడానికి ఉద్దేశింపబడలేదు. నిజానికి సినిమా కొత్త ఆలోచనలు ఆవిష్కృతం కావడానికి, సరికొత్త భావాలు పెల్లుబుకడానికి, కళాత్మకమైన సంతోషం కలిగించడానికి నిర్దేశింపబడింది. ఈ సినిమాలలో ప్రజా జీవితం ప్రతిబింబించాలి. వారి కష్టాలు, కడగండ్లు యథాతథంగా తెరకెక్కించాలి. శక్తివంతమైన ఈ సినిమా మాధ్యమాన్ని ప్రయోజనాత్మకంగా వినియోగించాలి.భారతీయ నవ్య సినిమా ఉద్యమ వైతాళికుల్లో, పంచరత్నాలనదగిన బెంగాలీ దిగ్దర్శకుల్లో ఒకరు మృణాల్‍సేన్‍ (మిగతా నలుగురు రిత్విక్‍ ఘటక్‍, సత్యజిత్‍రే, తపన్‍దా, బుద్దదేవ్‍ దాస్‍గుప్త) 50 వసంతాలపాటు సమాంతర సినిమా రంగాన్ని …

నవ్య సినిమా ఉద్యమంలో విభిన్న కెరటం మృణాల్‍సేన్‍ Read More »

జయహోనోములా!

బహుభాషావేత్తగా, నడయాడే విజ్ఞాసర్వస్వంగా, సుప్రసిద్ధులైన డా।। నోముల సత్యనారాయణ గారు భౌతికంగా దూరమైనారు. నల్లగొండ కొండగుర్తుగా, సాహితీ శిఖరంగా ఎదిగిన నోముల సాహితీనోముపంట. వారి మరణానంతరం నల్లగొండలో రెండుచోట్ల రెండుసార్లు వారి సంస్మరణ సభలను నిర్వహించి నల్లగొండ సాహితీ మిత్రులు వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. జయమిత్ర సాహితీ సంస్థ నిర్వాహకులు ప్రముఖ కవి వేణు సంకోజు గారి అధ్యక్షతన రెడ్‍క్రాస్‍ భవనంలో 31-12-2018నాడు జరిగిన సంస్మరణ సభలో నల్లగొండ ప్రాంతానికి చెందిన కవులు, రచయితలు …

జయహోనోములా! Read More »

ఎందుకీ వివక్ష అంటున్న ‘వై’

పురుషుడుగానే పుట్టినా క్రమంగా లోన విచ్చుకుంటున్న స్త్రీత్వాన్ని అణచుకోలేక, బహిరంగపరచి కుటుంబం, సమాజం ఛీత్కారాన్ని భరించలేక సతమతమవుతున్న అటు ఇటు గాని బతుకులు ప్రపంచం నిండా ఉన్నాయి. తమదికాని దోషానికి జీవన కాలం శిక్ష అనుభవిస్తున్న జాతి వారు. ఇప్పుడిప్పుడే విడి జాతి గుర్తింపుతో, చట్టం ఆసరాతో తలెత్తుకుంటున్నారు. సమాజంలో దొరికిన ఆకాస్త చోటును విస్త•తపరచుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ సత్తా నిరూపిస్తున్నారు. వారి మానసిక, శారీరక వ్యధలను విప్పిచెప్పేందుకు గుండెలను, గొంతులను సవరించుకుంటున్నారు. కవులుగా, కథకులుగా …

ఎందుకీ వివక్ష అంటున్న ‘వై’ Read More »

బాల సాహిత్యం – నా అనుభవాలు – సూచనలు

ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్యానికి ఒక రోజు, బాలలకు మరో రోజు ప్రత్యేకంగా కేటాయించడం ఒక కొత్త దిశకు నాంది అని చెప్పవచ్చు. ఆ ఉత్సాహమే మళ్లీ ఈ బాలచెలిమి. పిల్లల సినిమా, అంతర్జాతీయ చలన చిత్రోత్సవం మొదలుకొని తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ ద్వారా ప్రతి శనివారం ఒక సమావేశం చొప్పున చర్చా కార్యక్రమాలు నిర్వహించిన ఎం.వేదకుమార్‍ ఈ పత్రికకు సంపాదకుడు కావడం శుభ సూచకం. ఆగిపోయిన బాలచెలిమి మళ్లీ వస్తోందన్న …

బాల సాహిత్యం – నా అనుభవాలు – సూచనలు Read More »

చిన్న రమణయ్య

గామె బస్సుకోసం సూర్యపేట బస్టాండ్ల దీనంగ ఎదురు జూసుకుంట గూసున్నది. అసలే గామె మొకమెప్పుడూ పాలిపోయినట్టు ఉంటది. అసుంటిది ఇయ్యాల మరింకింత పాలిపోయి వున్నది. గామె సదువుకున్నదేంగాదుగద, ఏ బస్సెక్కడి పోతదో దెల్వది-అడిగి దెలుసుకుంటెదప్ప.గామె పేరు సారమ్మ. పుట్టి పెర్గిందేమొ మహదండి -పేదింట్ల! గామె అసలు కులమేందో గామెకే దెల్వది. గామె భర్తకు సుతాదెల్వది. ఇగామె తలిదండ్రులు రాళ్ళుగొట్టుకుంట, రాళ్ళళ్ళ రాళ్ళై, రాళ్ళబతుకులీడ్సుకుంట, ఎండలకెండి, వానల్ల నాని, మొండి బతుకలల్లనే మునిగిదేలుకుంట, అప్పులాకళ్ళకు గిల-గిల గొట్టుకుంటనే వొచ్చినాళ్ళయెపాడై! …

చిన్న రమణయ్య Read More »

సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, శిల్పం

‘మా గ్లూకోజ్‍ బాటిల్‍ బద్దలాయె’ అనే కవితా పాదం ద్వారా లక్ష్యార్థం అవగతమైతది. తద్వారా కవి, ఆయన కాలం, ఆ కవి మీద పనిచేసిన ప్రభావాలు తెలుస్తె, అలా కవి ఆ వస్తువును ఎంపిక చేసుకోవడానికి కారణాలతో పాటు, ఆ వస్తువు తీసుకున్న రూపం అర్థమవుతుంది. ఈ రూపం రావడానికి కారణమైన శిల్పం తెలుస్తుంది. శిల్పంలో భాగమైన భాష, ఆ భాషకే లేదా జాతికే పరిమితమైన జాతీయాలు, పదబంధాలు, సాంస్కృతిక ప్రతిఫలనాలు తెలిసొస్తాయి. కవి జాగరూకతతో వేసిన …

సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, శిల్పం Read More »

సాహిత్య విమర్శలో విభిన్న, విలక్షణ స్వరం ‘సమన్వయ’

డా।। ఎస్‍.రఘు వృత్తిరిత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులు. ప్రవృత్తిరిత్యా కవి, సాహితీ విమర్శకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య బోధన, సృజన, విమర్శనా రంగాలను ‘సమన్వయం’తో సుసంపన్నం చేస్తుండటం హర్షణీయం. కవిత్వం, విమర్శ రెండింటిని ఉత్తమ ప్రమాణాలతో వెలువరించినవారు అరుదు. ఇట్లాంటి వారిలో రఘు ఒకరు. డా।। ఎస్‍.రఘు విద్యార్థి దశ నుండే సృజనాత్మక సాహిత్యం వెలువరిస్తున్నవారు. వయసు, విద్యార్హతలు, లోక పరిశీలన, జీవితానుభవాలు పెరుగుతున్నకొద్ది చిక్కని జీవనలిపి నానీలను, వచన కవిత్వాన్ని, విమర్శను, సాహిత్యలోకానికి అందిస్తూ వస్తున్నారు. …

సాహిత్య విమర్శలో విభిన్న, విలక్షణ స్వరం ‘సమన్వయ’ Read More »