పట్నంలో షాలిబండా
పట్నంలో షాలిబండపేరైనా గోలుకొండ1968లో హీరో కృష్ణ నటించిన ‘‘అమాయకుడు’’ సీన్మాలో ఎల్.ఆర్. ఈశ్వరి ఈ పాట పాడి యావత్ తెలుగు శ్రోతల హృదయలయలను ఊయలలా ఒక ఊపు ఊపింది. ఈ పాట రాసిన కవి వేణుగోపాలాచార్యులు. ఇటీవలే 90 సం।।ల వయసులో హైద్రాబాద్ నగరంలోనే కీర్తిశేషులైనారు. ఇతను ఈ సీన్మా సంగీత దర్శకుడు బి.శంకర్ ఇద్దరూ హైద్రాబాద్ నగరం ముద్దు బిడ్డలే. షాలి బండ గొప్పతనానికి ఈ పాట ఒకే ఒక ఉదాహరణ. అయితే ఈ పాటలోని మొదటి …