సైబ పరంధాములు
పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా లోంచి సన్నగా – సన్నని నడిమి పాపిట ఒత్తైన వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో ‘ఆక•తి’కి నడిచి వెళ్తుంటే కళా సెలయేరు పారుతున్నట్లనిపిస్తుండేది… ఆ కళామూర్తే సైబ పరంధాములు.కీ.శే.సైబ పరంధాములు, శ్రీ సైబ లింగయ్య, శ్రీమతి గంగూబాయి దంపతులకు 08-4-1945న నిజామాబాద్ నగరంలో జన్మించారు. అప్పటి మల్టీపర్పస్‍లో చదివి గోల్డ్ మెడల్ సంపాదించారు. అనారోగ్య కారణాల వల్ల బి.టెక్. పూర్తి చేయలేక పోయారు. ఇది ఒకవైపు వారి శారీరక కోణం. …