2022

వ్యక్తుల గుప్తత హక్కు – ఆటో శంకర్‍ ఆత్మ కథ

వ్యక్తులకి ఆంతరంగిక హక్కులు ఉన్నాయా? దీన్నే మరో రకంగా గుప్తత హక్కు అంటున్నాం. వ్యక్తి జీవిత చరిత్ర వల్ల ఇతరుల హక్కులకి భంగం వాటిల్లితే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చా? పత్రికల్లో అలాంటి రాతలని నిలిపి వేయవచ్చా? ప్రైవేట్‍ వ్యక్తుల జీవిత చరిత్రలు ప్రచురించినప్పుడు ఇతరుల ఆంతరంగిక హక్కులకి ఇబ్బంది కలిగితే, నష్టం కలిగితే ఎలా ఉంటుంది?శంకర్‍ అలియాస్‍ గౌరీ శంకర్‍. అతన్ని ఆటో శంకర్‍ అని కూడా అంటారు. ఆరు హత్య కేసుల్లో అతను ముద్దాయి. ఆ …

వ్యక్తుల గుప్తత హక్కు – ఆటో శంకర్‍ ఆత్మ కథ Read More »

నాగులంచలో 1687 నాటి తొలి స్వాతంత్య్ర పోరాటం

నాగులవంచ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాలో చింతకాని మండలానికి చెందిన ఒక గ్రామం. ఇది జిల్లా కేంద్రం ఖమ్మానికి 20 కిలోమీటర్లదూరంలో వుంటుంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల గ్రామం. 16వ శతాబ్దంలో మచిలీపట్నం గోలుకొండ పరిపాలనలో వున్న కాలంలో గోలుకొండనుంచి మచిలీపట్నం ఓడరేవుకు మర్గమధ్య రహదారి కేంద్రంగా ఎంచుకోబడినది ఆ తర్వాత VOC కి వ్యాపారస్థావరంగా ఎదిగింది. వస్త్రాలు నీలిమందు ఎగుమతుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది. దానితో పాటు అనేక ఇతర ఉత్పత్తులకు ప్రధాన స్థావరం …

నాగులంచలో 1687 నాటి తొలి స్వాతంత్య్ర పోరాటం Read More »

చరిత్రకెక్కని బహుజన స్ఫూర్తి మూర్తులు

‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ నిర్వహించిన 12వ జూమ్‍ మీటింగ్‍ ప్రసంగం… చరిత్రను ఆనాది నుంచి ఆధిపత్య కులాల వాండ్లే రాస్తూ వస్తున్నారు. దీంతో తమ సామాజికవర్గం చేసిన కృషిని వాళ్లు శ్రద్ధతో రికార్డు చేసిండ్రు. అదే సమయంలో బహుజన కులాల వారిని విస్మరించారు. లేదంటే తక్కువ చేసి చూపించారు. ఇదంతా ఒక క్రమపద్ధతిలో అమలు పరిచిన వివక్ష. ఈ వివక్షను అధిగమించి బహుజనులు ‘మేమూ చరిత్రకెక్కదగ్గ వాళ్ళమే’ అని నిరూపించు కోవడానికి ఇప్పుడు ఆధారాలు చాలా …

చరిత్రకెక్కని బహుజన స్ఫూర్తి మూర్తులు Read More »

చొప్పకట్లపాలెం శాసనం

తెలంగాణా రాష్ట్రంలో పాతపదిజిల్లాలలో లభించిన శాసనాలను పరిష్కరించి, వాటినుంచి నల్గొండ, మహబూబునగర్‍, మెదక్‍, వరంగల్‍, కరీంనగర్‍, నిజామాబాద్‍ జిల్లాల శాసనసంపుటులను రాష్ట్ర వారసత్వశాఖ ప్రచురించింది. ఇంకా ఖమ్మం, ఆదిలాబాద్‍, రంగారెడ్డి, హైద్రాబాద్‍ జిల్లాల శాసనాలు ప్రచురించబడాల్సిన అవసర మున్నది. చరిత్రకు ప్రత్యక్షసాక్ష్యాలు, ఆధారాలైన శాసనాలను పరిష్కరించి, ప్రచురిస్తే తెలంగాణ చరిత్ర మరింత కొత్తగా తెలిసే అవకాశాలున్నాయి. విడిగా కొందరు శాసనకారుల అధ్యయనంలో వెలుగుచూసిన శాసనాలు కొన్ని. తెలంగాణాలో ప్రభుత్వం తరపున జరిగిన శాసనాధ్యయనం కాక బిఎన్‍ శాస్త్రిగారి …

చొప్పకట్లపాలెం శాసనం Read More »

క్షమయా ధరిత్రి! దాతృత్వమే నీ ఘనకీర్తి!!

ప్రకృతే నియంత్రిస్తుంది ! 14 ప్రకృతే శాసిస్తుంది!! (గత సంచిక తరువాయి)విత్తుముందా, చెట్టుముందా అని కొందరు, గుడ్డు ముందా, పిల్ల ముందా అని మరికొందరు కొంటె ప్రశ్నలు వేస్తూ వుంటారు. వీటన్నిటికి అమినో ఆమ్లాలతో ఏర్పడ్డ మొదటి ఏకకణ జీవి ముందని, దీని నుంచే బహుళ కణ జీవులు రూపాంతరం చెందాయనే విషయాల్ని రెండవ కథనంలో చర్చించాం. అయినా కొందరికి సంతృప్తినివ్వని జవాబులే ఇవి. క్లామిడోమోనస్‍ అనే ఏక కణ జీవి వృక్ష, జంతు జాతులకు ఓ …

క్షమయా ధరిత్రి! దాతృత్వమే నీ ఘనకీర్తి!! Read More »

ప్రమాదంలో జీవ సంపద

భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిధ్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‍ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించి పోతున్నాయి. ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. …

ప్రమాదంలో జీవ సంపద Read More »

బెండ ఏ సమయంలో వేసినా లాభాలే..

కూరగాయలకు మార్కెట్‍లో 365రోజులూ డిమాండ్‍ ఉంటుంది. అన్నిటి కంటే భిన్నంగా.. బెండకాయ మాత్రం అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలమై, రైతులకు లాభాలను అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో కూరగాయలు సాగుచేసే రైతులపాలిట వరంగా మారింది. రుతువు ఏదైనా విరగకాసే ఈ పంట.. తక్కువ నీటితో ఆరుతడిగా వేసేవాటిలో ముఖ్యమైనదిగా గుర్తింపు దక్కించుకొన్నది. బెండకాయలకు మార్కెట్‍లో ఎప్పుడూ స్థిరమైన రేటు ఉంటుంది. దీంతో చాలామంది రైతులు బెండ సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. తగిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు …

బెండ ఏ సమయంలో వేసినా లాభాలే.. Read More »

ఆశ మీరే శ్వాస మీరే

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘నల్లగొండజిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి గారి విశ్లేషణ. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి ఆహ్వానం మేరకు నల్లగొండ …

ఆశ మీరే శ్వాస మీరే Read More »

వారసత్వ సంపద పరిరక్షణ వర్తమాన సమాజపు బాధ్యత

ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అనేక సముదాయాల సమాహారమే వారసత్వ సంపద. ఆ సముదాయాల సమాహారం అనేక రూపాల్లో ఉండవచ్చు. భావజాలరూపంలో ఉండొచ్చు. నాగరికత, సంస్కృతి, అలవాట్ల వంటి జీవనవిధాన రూపంలో ఉండొచ్చు. భౌతిక రూపాలైన మానవ నిర్మిత కట్టడాలు, దేవాలయాలు, ఆనకట్టలు, నగర నిర్మాణ పద్ధతులు, ఉద్యానవనాలతో పాటు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కళాత్మక నిర్మాణాల రూపంలో ఉండొచ్చు. వీటిని కాపాడుకుంటూ ముందు తరాలకు అందివ్వడమనేది వర్తమాన సమాజపు బాధ్యత. ఆ …

వారసత్వ సంపద పరిరక్షణ వర్తమాన సమాజపు బాధ్యత Read More »

పోరు జెండా.. మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం… పోరాటానికి పర్యాయ పదం.. భూమికోసం.. భుక్తికోసం… పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత… పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‍పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్‍… చావుకు వెరవని గెరిల్లా యోధురాలు.. అసెంబ్లీలో ఆమె మాట తూటా.. పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా – ఆమె పోరాటాల ఎర్రజెండా.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల …

పోరు జెండా.. మల్లు స్వరాజ్యం Read More »