కాకతీయుల శాసనాలు – సమగ్ర పరిశీలనం
ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఏర్పరచుకున్న రాజవంశీయులలో కాకతీయులు ఒకరు. రాజకీయంగా, భౌగోళికంగా ఒక పటిష్టత లేని సమయంలో దక్షిణాపథ తూర్పుభాగప్రాంతాలను ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించినారు.శాతవాహనులు, విష్ణుకుండినుల అనంతరం దక్షిణాపథంలో నెలకొని ఉన్న పరిస్థితులను చక్కదిద్ది చిన్న చిన్న మాండలిక రాజ్యాలను కలుపుకొని కాకతీయులు తెలంగాణం నుండి బలమైన రాజ్యంగా యావత్ ఆంధ్రదేశ భూభాగాలను జయించి కాకతిరాజ్యాన్ని సామ్రాజ్యంగా నిర్మించారు.మొదట రాష్ట్రకూటులకు, పశ్చిమ చాళుక్యులకు సేనానులుగా, దండనాథులుగా, సామంత మాండలికులుగా ఉన్న వీరు క్రమంగా స్వతంత్రులై సువిశాల సామ్రాజ్య …