జాఫర్ మామూ
ఆంధప్రదేశ్ అవతరించిన సంవత్సరమది.ఆ రోజులలో ఒకానొక సాయంత్రం చార్‍సౌ సాల్ హైద్రాబాద్ పాతనగరం శాలిబండల మా ఇంటెనుక పెరట్ల నిండుపున్నమి పండు వెన్నెల మల్లె పందిరి క్రింద ఘుమఘుమల మత్తుగాలుల మధ్య ముషాయిరా శురువయ్యింది. రంగు పూల షత్రంజీ మీద మల్లెపూవులాంటి తెల్లని చాదర్ పరిచి అందులో గుండ్రంగా కూర్చున్న వాళ్ల మధ్యల వెలుగుతున్న ‘షమా’ సాక్షిగా కమనీయ కవితాగానానికి అంతా తయార్ అయ్యింది. నాజూకు నడుము లాంటి తెల్లని పొడుగు పొడుగు సీసపు గ్లాసులల్ల ఎరెర్రని …