May

పక్షులకు ముప్పుగా పారిశ్రామిక వ్యర్థాలు

మే 13న అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి …

పక్షులకు ముప్పుగా పారిశ్రామిక వ్యర్థాలు Read More »

తెలంగాణా చారిత్రక గాథాలహరిలో

ఇక్కుర్తి – అగ్గలయ్య ఆలేరు నదీలోయ నాగరికతకు ఇక్కుర్తి ఒక పురాతన సాక్ష్యం. ఇక్కుర్తి గొప్ప చారిత్రకస్థలం. అతిపురాతన నాగరికతల నిలయం. ఆదిమానవులకాలం నుండి నేటి వరకు చరిత్రను పుక్కిటపట్టిన కాలనిఘంటువు, విజ్ఞానసర్వస్వం ఈ వూరు. ఇక్కుర్తి పేరు ఇక్కురికి నుండి పరిణమించింది. ఈంకురికి ఇక్కురికి అయింది. కురికి అంటే పురాతన ధాన్య విశేషం. పాల్కురికి పాలకుర్తి అయినట్లు ఇక్కురికే పలుకుబడిలో ఇక్కుర్తిగా పిలువబడుతున్నది.ఇక్కుర్తి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం. ఆలేరుకు కొలనుపాక, ఇక్కుర్తి గ్రామాలు …

తెలంగాణా చారిత్రక గాథాలహరిలో Read More »

తీర్పుల్లో నవలలోని అంశాలు

తీర్పుల్లో కవిత్వం కనిపించిన సందర్భాలు చాలా వున్నాయి. కవిత్వమే కాదు కొన్ని సందర్భాల్లో నవలలోని అంశాలు కూడా తీర్పుల్లో కన్పిస్తున్నాయి. చార్లెస్‍ డికెన్స్ పేరు తెలియని వ్యక్తులు చాలా అరుదని చెప్పవచ్చు. ఆయన రాసిన రెండు పుస్తకాల్లోని విషయాలు రెండు ప్రధాన తీర్పుల్లో ప్రతిబింబించాయి. ఆ రెండు తీర్పులు కూడా సుప్రీంకోర్టు తీర్పులు కావడం విశేషం.భోపాల్‍ గ్యాస్‍ దుర్ఘటన సంఘటనకు సంబంధించి స్పెషల్‍ లీవ్‍ దరఖాస్తుని పరిష్కరించే విషయంలో సుప్రీంకోర్టు చార్లెస్‍ డికెన్స్ రాసిన ‘జార్న్డైస్‍ వర్సెస్‍ …

తీర్పుల్లో నవలలోని అంశాలు Read More »

పుడమితల్లికి నిరంతర పురిటి నొప్పులు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 9 ప్రకృతే శాసిస్తుంది!! మానవుడి మేధస్సుకు అందిన పరిజ్ఞానం ప్రకారం జీవం కలిగివున్న గ్రహం ఒక్క భూమి మాత్రమే! గెలాక్సీలోని ఇతర నక్షత్ర కూటములలోని (నక్షత్ర కుటుంబాలల్లో) ఏదైనా గ్రహంపై కూడా జీవరాశి వుండవచ్చు. ఆ జీవరాశి భూమిపై గల జీవరాశికి భిన్నంగా కూడా వుండవచ్చు! వాటి జీవన చర్యలు (metabolic) వైవిధ్య భరితంగా కూడా వుండవచ్చు! మానవుడిలాంటి బుద్ది కుశలతగల జీవులుగాని, ఇంతకన్నా మెరుగైనవిగాని, తక్కువస్థాయివిగాని కూడా వుండవచ్చు! ఈ విషయాలన్నీ భవిష్యత్తులో …

పుడమితల్లికి నిరంతర పురిటి నొప్పులు! Read More »

మే 18 ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే

వారసత్వ సంపద ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియమ్స్ను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సమాజ వృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి అవగాహన కల్పించడానికి మ్యూజియం డే ముఖ్యమైనది. మ్యూజియాలు మౌనముద్ర దాల్చినట్లుగా కనిపిస్తాయి. నిజానికి అవి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. అవి ఉబుసుపోని మాటలు కాదు. కళాతత్వాన్ని గురించి విడమరచి చెప్పే మాటలు. చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వ్యాఖ్యానించే మాటలు. కొన్ని మాటలు మాటలుగా మాత్రమే ఉండవు. అవి వెలుగుదీపాలై దారి చూపుతాయి. మ్యూజియంలోకి అడుగుపెట్టడం అంటే …

మే 18 ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ

(గత సంచిక తరువాయి) నష్టపరిహారం క్లెయిమ్‍ చేయాలంటే…. పశువులు మరణించిన వెంటనే సంబంధిత ఇన్సురెన్సు కంపెనీకి టెలిగ్రామ్‍ ద్వారా తెలియపర్చాలి. సంబంధిత పశువైద్యాధికారి నుండి ‘‘డెత్‍ సర్టిఫికేట్‍’’ తీసుకొని సమర్పించాలి. పశువుల్ని బ్యాంకు రుణం ద్వారా పొందితే సంబంధిత బ్యాంకు వారికి కూడా తెలియపరచాలి. మరణించిన పశువు ఫోటో తీసి ఉంచాలి. పశువు కళేబరాన్ని ఇన్సురెన్సు కంపెనీ అధికారుల పరిశీలన నిమిత్తం 24 గంటలుంచాలి. కంపెనీ నుండి వచ్చే క్లెయిమ్‍ ఫారం పూర్తిచేసి, డాక్టర్‍ ఇచ్చే పోస్టుమార్టం …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

మనల్ని మనం ప్రేమించుకుందాం..

ఎవరూ ఎవర్నీ ప్రేమించరు, తమని తాము ప్రేమించుకుంటారు. తమ అవసరాలను తీర్చే, తమకు ఆనందాన్నిచ్చే వాటిని ప్రేమిస్తారు. అవి వస్తువులు కావొచ్చు, మనుషులు కావొచ్చు, ఆలోచనలు కూడా కావొచ్చు. వాటిని మాత్రమే ప్రేమిస్తారు. కాని ఇవాళ ఆమాట సత్యంగా కనిపించడంలేదు. గత మూడు నాలుగు నెలలుగా ప్రపంచం మొత్తం కోవిడ్‍-19 వల్ల విపత్కరస్థితిని ఎదుర్కొంటోంది. మానవ జీవితం అన్ని విధాలుగా అన్ని రంగాలలో అల్లకల్లోల మవుతోంది. మనిషి తనను తాను నిజంగా ప్రేమించుకో గలిగితే తమ ఉనికికి, …

మనల్ని మనం ప్రేమించుకుందాం.. Read More »

ఒద్దిరాజు సోదరులు

తెలంగాణలో ఆనాడు, సంస్కరణ భావ విజృంభణతో సాహిత్య వికాస చైతన్య దీప్తులు ప్రసరించిన ఒద్దిరాజు సోదరులు బహు భాషా కోవిదులు, సకల శాస్త్ర కళాకోవిదులు. ఒద్దిరాజు సీతారామ చంద్రరావు గారు, ఒద్దిరాజు రాఘవ రంగారావుగార్లు ఏడేళ్ళ వయసు తేడాతో ఒకే తల్లి గర్భాన జన్మించిన అన్నదమ్ములు. వీరిది వరంగల్‍ జిల్లా ఇనుగుర్తి గ్రామం. రంగనాయకమ్మ, వెంకటరామారావు గార్లు వీరి తల్లిదండ్రులు. అమ్మానాన్నల సంస్కారాన్ని, పాండిత్యాన్ని వారసత్వంగా తెచ్చుకున్న ఒద్దిరాజు సోదరులు దేహాలు వేరైనా ఆత్మలొక్కటేనన్నట్లు పెరిగారు. 1887 …

ఒద్దిరాజు సోదరులు Read More »

దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు

ఉమ్మడి ఆంధప్రదేశ్‍ చరిత్రలో తెలుగుదేశం పార్టీ స్థాపన, అధికారంలోకి రావడం ఒక కీలక మలుపు. మొదటి సారిగా జనవరి 9, 1983 నాడు తొలి  కాంగ్రేసేతర  వ్యక్తిగా ఎన్టీరామారావు ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిండు. అంతకుముందూ కుల రాజకీయాలున్నప్పటికీ అవి అంత నగ్నంగా బయటికి రాలేదు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఈయన తొలి ముఖ్యమంత్రి. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్టీరామారావు చరిత్ర సృష్టించిండు. ఈయన రాష్ట్రమంతటా పర్యటించి ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పరిరక్షణ పేరిట ప్రచారం చేసిండు. కాంగ్రెస్‍ పార్టీ అంతర్గత కలహాలు, గాడి తప్పిన సుదీర్ఘ …

దళితోద్యమానికి మూలమలుపు కారంచేడు Read More »

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’

శాంతి కపోతం ఆరడుగుల అందగాడుగా రూపం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అచ్చం గులాం యాసీన్‍లా ఉంటుంది. గులాం యాసీన్‍ ఎవరూ అని అడుగుతున్నారా? కొంచెం ఓపిక పట్టండి ఆ కథ ఈ కథ చివర్లో వినిపిస్తాను. మొగల్‍పురాలో రిఫాయేఆం స్కూలు దాటి అక్కన్న మాదన్నల గుడి ముందు నుండి నడుచుకుంటూపోతే కుడివైపున మీర్‍ మోమిన్‍ దాయెర, మీర్‍జుమ్లా తలాబ్‍ (చెరువు) -ఎడమవైపు సుల్తాన్‍షాహీ బస్తీ ఉంటుంది. గాన సుజనులారా ప్రవేశించండి సుల్తాన్‍ షాహీలోకి! కుతుబ్‍షాహీల కాలంలో ఇచ్చోటనే కదా టంకశాల ఉండేది. అందులో రాజముద్రలు వేయబడిన టంకములను …

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’ Read More »