తెలంగాణా చారిత్రక గాథాలహరిలో
ఇక్కుర్తి – అగ్గలయ్య ఆలేరు నదీలోయ నాగరికతకు ఇక్కుర్తి ఒక పురాతన సాక్ష్యం. ఇక్కుర్తి గొప్ప చారిత్రకస్థలం. అతిపురాతన నాగరికతల నిలయం. ఆదిమానవులకాలం నుండి నేటి వరకు చరిత్రను పుక్కిటపట్టిన కాలనిఘంటువు, విజ్ఞానసర్వస్వం ఈ వూరు. ఇక్కుర్తి పేరు ఇక్కురికి నుండి పరిణమించింది. ఈంకురికి ఇక్కురికి అయింది. కురికి అంటే పురాతన ధాన్య విశేషం. పాల్కురికి పాలకుర్తి అయినట్లు ఇక్కురికే పలుకుబడిలో ఇక్కుర్తిగా పిలువబడుతున్నది.ఇక్కుర్తి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం. ఆలేరుకు కొలనుపాక, ఇక్కుర్తి గ్రామాలు …