రంగారెడ్డి జిల్లా గ్రామ నామాలు – ఒక పరిశీలన
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దక్కన్ పీఠభూమిగా పేరుగాంచినది. ఇక్కడ విష్ణు కుండినులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు పరిపాలించిన చారిత్రక ఆధారాలున్నవి. ఈ జిల్లాని 1948కి ముందు అత్రాప్-ఇ-బల్దా అనే పేరుతో వ్యవహరించారు. 1948 నుండి 1978 వరకు హైదరాబాదు జిల్లాగా పిలువబడింది. 1978లో కె.వి.రంగారెడ్డి గారి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2016లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ …