September

జంట నగరాల్లోని రక్షిత స్మారక చిహ్నాల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర హరిటేజ్‍ అథారిటీ సమావేశం

బి.ఆర్‍.కె.ఆర్‍ భవన్‍లో తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్‍ అథారిటీ (రాష్ట్ర స్థాయి) మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‍ కుమార్‍ అధ్యక్షత వహించారు. జంట నగరాల్లోని 26 రక్షిత స్మారక చిహ్నాలు (Protected Monuments), కుతుబ్‍ షాహీ సమాధులు మరియు గోల్కొండ కోటకు సంబంధించిన హెరిటేజ్‍ సమస్యలపై కమిటీ చర్చించింది. రక్షిత స్మారక చిహ్నాలపై సంక్షిప్త స్టేటస్‍ నోట్‍ ఫోటోలతో సహాతయారు చేయాలని, తదుపరి చర్యల నిమిత్తం తనిఖీ నివేదికను సమర్పిం చాలని …

జంట నగరాల్లోని రక్షిత స్మారక చిహ్నాల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర హరిటేజ్‍ అథారిటీ సమావేశం Read More »

ప్రమాదంలో పుడమి కవచం

సెప్టెంబర్‍ 16న ఓజోన్‍ పరిరక్షణ దినోత్సవం ఒక ఆక్సిజన్‍ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్‍ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‍ అణువుకు మరో ఆక్సిజన్‍ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్‍’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్‍ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్‍’ను ‘ట్క్రెయాక్సిజన్‍’ అని కూడా అంటారు. ఓజోన్‍ పొర స్ట్రాటోస్పియర్‍ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్‍ …

ప్రమాదంలో పుడమి కవచం Read More »

పంప మహాకవి గాథ

తెలుగుభాషకు ప్రాచీనహోదానిచ్చింది కుర్క్యాలలోని బొమ్మలగుట్ట త్రిభాషాశాసనం. ఈ శాసనం క్రీ.శ.945 ప్రాంతందై వుంటుందని కుర్క్యాలశాసనాన్ని పరిశోధించి, పరిష్కరించి వెలుగులోనికి తెచ్చిన నేలటూరి వేంకట- రమణయ్య అభిప్రాయం. ఈ శాసనంలో పేర్కొనబడ్డ రెండు ప్రదేశాలలో ఒకటి సిద్ధశిల. దీనిమీదనే శాసనం, బొమ్మలమ్మ (చక్రేశ్వరి), ఆద్యంత తీర్థంకరులు, ఇతర జైనమునుల శిల్పాలు చెక్కబడ్డాయి. రెండవది వృషభాద్రి. బొమ్మలమ్మగుట్టనే వృషభాద్రి అంటారు కాని, నేలటూరి అభిప్రాయం ప్రకారం ఈ గుట్ట ఎక్కడుందో గుర్తించబడలేదు. అంతేకాదు కుర్క్యాల శాసనకర్త జినవల్లభుని సోదరుడు మహాకవి …

పంప మహాకవి గాథ Read More »

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం

ఉర్దూ భాషకి కోర్టులకి అవినావభావ సంబంధం ఉంది. ఉర్దూ పదజాలం కోర్టు పరిభాషలో ఎక్కువగా కన్పిస్తూ వుంటుంది. శాసనాలలో కూడా ఉర్దూ పదాలు ఎక్కువగా దొర్లుతూ వుంటాయి. వకాలత్‍, హలఫ్‍నామా, వకీలు, గవా, హాజిర్‍హై లాంటివి కొన్ని ఉదాహరణలు.ఉర్దూ పదాలు, పదబంధాలే కాదు, చాలా తీర్పుల్లో ఉర్దూ కవిత్వం కూడా కన్పిస్తూ వుంటుంది. సంక్లిష్టమైన కేసుల్లో, అదే విధంగా ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల్లో కూడా ఉర్దూ కవిత్వం దర్శనం యిస్తూ వుంటుంది. యుద్ధనేషియా కేసులో, …

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!

(గత సంచిక తరువాయి)గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల ఆక్రమణ:1814-15 గూర్ఖాలతో యుద్ధం చేసిన బ్రిటీషువారు ఖాడ్మండును ఆక్రమించాలనుకున్నారు. గూర్ఖాల ప్రతిఘటనతో సాధ్యంకాలేదు. కాని, గూర్ఖాల ఆధిపత్యం తక్కువగా వున్న గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల్ని (నేటి ఉత్తరాఖండ్‍) బ్రిటీషు వారు చేజిక్కించుకున్నారు. వెంటనే విలియం వెబ్‍కు కుమాన్‍ ప్రాంతాన్ని, జాన్‍ హడ్‍సన్‍ (Hodgson)కు గర్‍వాలా ప్రాంతాన్ని అప్పజెప్పారు. వీరు 1816లో తమ సర్వేలను ప్రారంభించారు.రాబర్ట్ మరణంతో ఆయన కుటుంబ బాధ్యతలతోపాటు, మిగతా సర్వే బాధ్యతల్ని హెన్రీ తిరిగి స్వీకరించాడు. అప్పటికే …

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

(షుగర్‍ (డయాబెటిస్‍), బీపీ థైరాయిడ్‍, ఊబకాయం, కీళ్ళనొప్పులు,రక్తహీనత తదితర 45 రకాల వ్యాధులు, 14 రకాల క్యాన్సర్లను దేశీ ఆహారంతో జయించే పద్ధతులు) ఆహారం విషపూరితం2030 నాటికి కోటి 40 లక్షల మంది వరకు కేన్సర్‍ బారిన పడే పరిస్థితి నెలకొంది. దీనిక ప్రధాన కారణం… ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే! ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది. పురుగు మందులుజనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

మార్జాల రాజు

అనగనగా ఒక ఊళ్లో గొల్లవాడి ఇంట్లో ఒక పిల్లి ఉండేది. పాలు, పెరుగు తాగి వెన్న మెక్కి ఆ పిల్లి పిప్పళ్ళ బస్తాలా తయారయింది. దాన్ని చూస్తే మిగతా పిల్లులకు వెన్నెముకలో వణుకు పుట్టుకొచ్చి ఆమడదూరం పారిపోయేవి. దాంతో పిప్పళ్ళ బస్తా లాంటి పిల్లికి కళ్లు నెత్తిమీది కొచ్చాయి. తన పేరు మార్జాల రాజుగా మార్చేసుకొంది. మిగతా పిల్లులతో మాట్లాడటం తనకు తలవంపులుగా భావించేది.ఒకనాడు మార్జాలరాజు ఒక కాయితం, కలం తీసుకొని అడవిలోకి వెళ్ళింది. దానికి అక్కడ …

మార్జాల రాజు Read More »

ప్రకృతిలో వికృతి ‘మదినా హిజ్రాఘర్‍’

పూర్వజన్మలో ఏ దేవుడికి ఏ నిప్పుల పూజ చేసుకున్నామో ఈ జన్మలో ఇట్లా అఘోరిస్తున్నాం’’.‘‘ఈ సమాజంలో వేశ్యకైనా ఒక గౌరవ స్థానముందేమో గాని మాకు మాత్రం లేదు. ఒక చిన్న చిల్లిపైసకు ఉన్న విలువ కూడా ఈ సంఘంలో మాకు లేదు. మేమందరం ఈ మానవ సమాజంలో అటుఇటు ఎటూగాని వింత ప్రాణులం. మేం నరుడు కాదు నారీ కాదు. ఇట్లాగాక కనీసం అడవిలో ఏ చెట్టుగానో, పక్షిగానో, జంతువుగానో పుట్టినా బాగుండేది. మేం శిలల్లాంటి వాళ్లమే …

ప్రకృతిలో వికృతి ‘మదినా హిజ్రాఘర్‍’ Read More »

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం

కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్‍ కస్తూరి రంగన్‍ అధ్యక్షతన నియమించిన కమిటీ యిచ్చిన నివేదిక ఆధారంగా విద్యా మంత్రిత్వశాఖ ఒక విధాన పత్రాన్ని 67 పేజీలతో తయారు చేసింది. జాతీయ విద్యావిధానం – 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం 2020 జులై 29న ఆమోదించింది. ఈ విధానపత్రం మనదేశాన్ని నాలెడ్జి సెంటర్‍గా మారుస్తుందని, మనదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శి అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత ఉపఖండం వివిధ భాషలు, ప్రజలు, మతాలు, కులాలు, చరిత్ర, సంస్కృతులు వంటి విభిన్నతకు నిలయమని, ఏకత్వంలో భిన్నత్వం కలిగిన …

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం Read More »

రామానంద తీర్థ

స్వామి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్ర సమర శంఖారావాన్ని పూరించిన వీరసేనాని సంస్థాన విమోచనోద్యమంలో కీలకపాత్రను పోషించిన పోరాటయోధుడు. సంస్థాన ప్రజల విముక్తి కోసం ఉద్యమాలను నడిపిన విప్లవనాయకుడు. ఇక్కడి ప్రజలకు ఉద్యమాల ఉగ్గుపాలుపోసి, తిరుగుబాటు తత్వానికి బాటలు చేసిన మార్గదర్శి, అణచివేతల నుంచి తలలు పైకెత్తి, పిడికిలి బిగించి నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్య సాహసాలను నూరిపోసిన శౌర్యవంతుడు. యవ్వన దశలోనే అవివాహితునిగా సన్యాసం స్వీకరించిన యోగి పుంగవుడు ఆధ్యాత్మిక ప్రవక్త. యావజ్జీవితాన్ని …

రామానంద తీర్థ Read More »