ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ
ప్రజలకోసం ప్రజలచే నిర్వహించబడే అత్యుత్తమ పాలనా విధానం ప్రజాస్వామ్యం. ఎన్నికలు ప్రజాస్వామ్య భావనకు గీటురాయిగా ఉంటున్నాయి. మన దేశంలో ధనిక, పేద, కుల, మత, స్త్రీ, పురుష, ప్రాంతీయ తేడాలు లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్నది. తమకు ఇష్టమైన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉన్నది. అంతేకాదు. వీరందరికీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకూడా వుంది. ఈ ఎన్నికల పక్రియే ప్రపంచంలో మన దేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు …