Day: January 1, 2019

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మహా యజ్ఞంలో ప్రజల భాగస్వామ్యం జరగాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరిగి డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర సమితి రెండవసారి అధికారంలోకి వచ్చింది. సుస్థిరమైన తెలంగాణ నిర్మాణం కోసం విశాలమైన, విస్తృతమైన దృష్టితో కార్యదీక్షతో ఇంకా మునుముందుకు సాగాలన్న ధృఢమైన ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా ఎన్నికల ఫలితాలు కనిపించాయి. పరిపూర్ణ స్థాయిలో ప్రగతిని అందుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మహా యజ్ఞంలో పారదర్శకమైన అంకితభావంతో ప్రజలంతా భాగస్వాములై తోడ్పడాలి. ప్రాధాన్యత కలిగిన అన్ని రంగాలలో కృషి ప్రణాళికాబద్ధంగా జరగాలి. హైదరాబాదులో నేషనల్‍ …

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ మహా యజ్ఞంలో ప్రజల భాగస్వామ్యం జరగాలి Read More »

మరో ఫెస్టివల్‍కు వేదిక కానున్న హైదరాబాద్‍

రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, ప్రచురణకర్తలు, విద్యార్థులు, తదితరుల అందరిని ఒక చోట చేర్చి అన్ని అంశాలపై చర్చించే కార్యక్రమం మళ్లీ ప్రారంభంకానుంది. 2010లో మొదలైన ఈ వేదిక అన్ని విషయాలను తెలియజేస్తూ అందరిలోనూ ఉత్సహం మింపే హైదరాబాద్‍ లిటరరీ ఫెస్టివల్‍ మొదలైంది. అన్ని రకాల రూపాల్లో సృజనాత్మకతను జరుపుకునే వార్షిక కార్యమ్రంగా చెప్పవచ్చు ఈ హైదరాబాద్‍ లిటరరీ ఫెస్టివల్‍ను. చర్చలు, సంభాషణలు, ప్యానెల్‍ చర్చలు, పఠనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు హైదరాబాద్‍ లిటరరీ ఫెస్టివల్‍లో …

మరో ఫెస్టివల్‍కు వేదిక కానున్న హైదరాబాద్‍ Read More »

తెలంగాణలో కొత్త లోకాలకు తెరతీసిన క్రైస్తవం

మొత్తం దక్కన్‍లో మొట్టమొదటి చర్చి కుతుబ్‍షాహీ కాలంలో ఏర్పాటయింది. 1620 ఆ ప్రాంతంలో ఈ చర్చ్ ప్రారంభమయింది. పోర్చుగీస్‍, ఫ్రెంచ్‍ నుంచి వచ్చిన కాథలిక్‍ అధికారులు గోలకొండలో కుతుబ్‍షాహీ సైన్యానికి శిక్షణ ఇచ్చేవారు. ఈ అధికారులు కట్టడాల నిర్మాణంలో, వ్యవసాయరంగంలోనూ మెలుకువలు నేర్పించేవారు. దీంతో కుతుబ్‍షాహీ రాజులతో పాటు వారి అధికారులకు కూడా వీరిపట్ల గౌరవ భావముండేది. ఈ చర్చ్కి సంబంధించి ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. 16వ శతాబ్దంలో తెలంగాణలో తీవ్రమైన కరువు ఏర్పడింది. …

తెలంగాణలో కొత్త లోకాలకు తెరతీసిన క్రైస్తవం Read More »

భావితరానికి నూతన సవాళ్ళు విసురుతున్న కృత్రిమ మేధస్సు!!

ఓ ప్రముఖ కథానాయకుడు నటించిన ‘‘రోబో’’ అనే చలనచిత్రం తెలుగునాట మంచి విజయం సాధించింది. అందులో ‘‘చిట్టీ’’ అనే పేరుగల రోబో చేసే విన్యాసాలు, సాహస కృత్యాలు ఒక ఎత్తైతే ప్రేమ, అభిమానం, దుఃఖం లాంటి భావావేశాలను కూడా వ్యక్తం చేయడం సినిమా చూసిన వీక్షకులకు కొత్తగానూ, వింతగానూ, విడ్డూరంగానూ అనిపించింది, కానీ అది సినిమా కాబట్టి, సినిమాలో ఇలాంటి కల్పనాపూరిత, ఊహాత్మక విషయాలకు ప్రాధాన్యం దక్కడం మామూలే కదా అని అందరూ సరిపెట్టుకున్నారు. సీన్‍ కట్‍ …

భావితరానికి నూతన సవాళ్ళు విసురుతున్న కృత్రిమ మేధస్సు!! Read More »

1948 హైద్రాబాద్‍ పోలీస్‍ యాక్షన్‍

(గత సంచిక తరువాయి) వెంకటమ్మ స్వగతం:1942లో నేను పుట్టిన. పుట్టింది పెరిగింది అంతా పాతనగరం హైద్రాబాద్‍లనే. నాకప్పుడు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు. యూఖుత్‍పురా దగ్గర ఉండే రయిన్‍బజార్ల గాంధీ విగ్రహం వెనుక సందులో మసీదుకు ఎదురుంగ ఉండేవాళ్లం. ఆ రోజు మా ఇంటి ముందు వాకిట్ల చిన్న పిల్లలకు జిలేబీలు పంచిండ్రు. నేను కూడ సంబరంగ తియ్యటి జిలేబీలు తిన్న. మా అమ్మమ్మ నన్ను వెంబడి పెట్టుకుని అవతలి బస్తీలకు తీసుకపోయి మూడు రంగుల జండాలను చూపెట్టింది. …

1948 హైద్రాబాద్‍ పోలీస్‍ యాక్షన్‍ Read More »

గడియారం రామకృష్ణ శర్మ నాటక ప్రస్థానం

నాటి నిజాం పరగణాలో, గద్వాల సంస్థానం ఏలుబడిలో ఉన్న ఆలంపురం గ్రామంలో ఓ వెన్నెల రాత్రుల్లో ఓ సంచార నాటక సమాజం ‘‘సత్య హరిశ్చంద్ర’’ నాటకం ఆడుతున్నది. టిక్కెట్లు కొని ఆ ప్రదర్శన చూడటానికి జనమంతా వచ్చారు. అందరూ కుర్చీలకు అతుక్కుని నాటకం చూస్తున్నారు. అనుభవం కలిగిన నటీనటులు ప్రదర్శిస్తున్న ఈ నాటకానికి వచ్చిన వారంతా తన్మయులై ఉన్నారు. కళాకారులు పాడే పద్యాలకు ఒన్స్మోర్‍ అంటూ ప్రేక్షకులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. అది కాటి సీను. …

గడియారం రామకృష్ణ శర్మ నాటక ప్రస్థానం Read More »

అనేక సంఘర్షణలు, ఆలోచనల్లోంచి ఉబికి వచ్చిన పదాలు యోచన పాటలు

మనసు పరిపరి విధాల పయణిస్తది. ఆశ, నిరాశల వెంట పరిగెడతది. అనేక విధాలుగా సంఘర్షిస్తది. ఆలోచనాలోచనల్లోంచి అక్షరమై ఉభికి వస్తది. పదమై పల్లవిస్తది. పాటై ప్రజల నాలికల మీద నర్తిస్తది. అట్లా తన రాగంతో రాయి రప్పల్ని కరిగించిన పాట ఇది. శేను శెలకలను ముద్దాడి, వాగు వంకల్ల తిరిగి చెరువు అలల మీద తేలియాడిన పాట. నాన్నను కలవరించిన పాట. ఆదివాసి, దళిత, గిరిజన, బహుజన చైతన్యమీ పాట. తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఊపిరైన పాట. …

అనేక సంఘర్షణలు, ఆలోచనల్లోంచి ఉబికి వచ్చిన పదాలు యోచన పాటలు Read More »

నిపుణతకు ప్రతిబింబాలు హుస్సేన్‍ఖాన్‍ ఫోటోలు

ఒక్కక్షణం అలా నిలబెట్టి ఎటువంటివారినైనా మంత్రముగ్ధుల్ని చేయగలిగిన సమ్మోహన శక్తి ఫోటోగ్రఫీకి ఉంది. అంతర్లీనమైన కళాదృష్టికి అనుక్షణం అన్వేషణ తోడైతే నిత్య నూతన దృశ్యాల చిత్రీకరణ సాధ్యమవుతుంది. పరుగులుపెట్టే కాల గమనంలో జీవన విధానాలను తన కెమెరాలో బంధించి ఆలోచనకు సింగా రించిన దృశ్యపు కూడికగా రూపు దిద్దిన ఫోటోగ్రాఫర్‍ పఠాన్‍ హుస్సేన్‍ఖాన్‍. వరంగల్‍ జిల్లా డోర్నకల్‍ మండలం గొల్లచెర్ల్ల గ్రామంలో జన్మించిన హుస్సేన్‍ ఖాన్‍ చిన్నప్పటి నుండే ప్రకృతి ఆరాధకుడు. విభిన్న సృజనాత్మక ఆలోచనలు కలిగిన …

నిపుణతకు ప్రతిబింబాలు హుస్సేన్‍ఖాన్‍ ఫోటోలు Read More »

ఎంబీసీలకు పూర్వవైభవం

సమైక్య పాలనలో నిర్లక్ష్యంతో చేతివృత్తులు నిర్వీర్యం కాగా, సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా అంతరించిపోతున్నాయి. కుల వృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. స్వరాష్ట్రం వస్తే చేతివృత్తులకు పూర్వ వైభవం వస్తుందని సీఎం కేసీఆర్‍ చెప్పిన మాటలు కార్యాచరణలోకి వస్తున్నాయి.గొల్ల, కుర్మలు, నేత, మరనేతన్నలతో పాటు ప్రతి వృత్తిదారుడికి చేతి నిండా పని, పనికి తగ్గ కూలీ చెందాలన్న లక్ష్యంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నది. చేతివృత్తిపై ఆధారపడిన కుమ్మరి, కంచరి, వడ్రంగి, …

ఎంబీసీలకు పూర్వవైభవం Read More »

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‍ అర్థవార్షిక ప్రస్థానం

గ్రామ గ్రామానికి కమీషన్‍, సదా బాధితుల పక్షంచైర్మన్‍ స్ఫూర్తితో వ్యవస్థలో నూతన ఉత్తేజంతెలంగాణ వ్యాప్తంగా విస్తృత పర్యటనలుచైర్మన్‍ చొరవతో బాధితులకు తక్షణ పరిహారంసత్ఫలితాలిస్తున్న నూతన ప్రణాళికలుదళిత వర్గాల్లో చైతన్యం, కమిషన్‍ పై పెరిగిన నమ్మకందళిత వర్గాలను చైతన్య పరుస్తూ, నమ్మకం కల్గిస్తూ, భరోసా నింపుతూ కమీషన్‍ ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‍ రావు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి, ఆయా వర్గాల సమస్యల పరిష్కారం కొరకు డాక్టర్‍ ఎర్రోళ్ల శ్రీనివాస్‍ చైర్మన్‍గా, సుంకపాక …

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్‍ అర్థవార్షిక ప్రస్థానం Read More »