Day: December 1, 2020

భారతీయ సైన్యానికి సేవలందించిన గొంగడి (నల్లని ఉన్ని దుప్పటి)

ఒకప్పుడు భారత సాయుధ దళాలకు సేవలందించింది ‘గొంగడి’ (సాంప్రదాయ నల్లని ఉన్ని నుండి నేసిన దుప్పట్లు). సరిహద్దుల్లో కఠినమైన శీతాకాలంను తట్టుకునేందుకు గొంగడి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రత్యేకమైన నల్ల-ఉన్ని డెక్కానీ గొర్రెల జాతిని కోల్పోవడం మరియు మారిన స్థానిక మార్కెట్‍ వల్ల గొంగడి క్రాఫ్ట్ కనుమరుగైంది. తెలంగాణలో అంతరించి పోతున్న గొంగడి సంప్రదాయాన్ని, తయారు చేసే విధానాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం గొర్రెల కాపరులు అయిన గొల్ల కురు మలుకు చేయూత నిచ్చేందుకు గొర్రెలను పంపిణీ చేసి తోడ్పా టును …

భారతీయ సైన్యానికి సేవలందించిన గొంగడి (నల్లని ఉన్ని దుప్పటి) Read More »

సైన్స్ – మానవత

ఈ భూగోళం మీద జీవం ఆవిర్భవించి దాదాపు రెండు కోట్ల సంవత్సరాలు అవుతోంది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రాణికోటి నిదానంగా, నిలకడగా ఎన్నో పరిణామ దశలు దాటుకుంటూ వచ్చింది. ఈ పరిణామ క్రమంలో అత్యల్ప సూక్ష్మజీవులు మొదలుకొని భూచరాలైన చతుష్పాద జంతువులు, రెండుకాళ్ళ మనిషి దశవరకు మార్పు చెందడం అనేది ఒక వినూత్న శకాన్ని ఆవిష్కరించింది. దీనితో బాటు మానవుల భావ ప్రకటనకు అనువుగా భాష కూడా రూపొందడం మరో అద్భుత పరిణామం. ఇది మరెన్నో పరిణామాలకు నాంది పలికింది. …

సైన్స్ – మానవత Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!!-6 శాస్త్రీయ దృక్పథం – పద్ధతి!(SCIENTIFIC TEMPER – METHOD)

ఇంతవరకు ప్రకృతి సూత్రాలలో జీవశాస్త్ర సంబంధమైన చివరి నాలుగు (15-18) సూత్రాలను చూసాం. జీవం పుట్టుకకు, నిర్జీవ పదార్థాలకు గల సంబంధాన్ని చూసాం. సూతప్రాయంగా సౌరకుటుంబం యొక్క ఆవిర్భావం, భూమి పుట్టుక గూర్చి కూడా తెలుసుకున్నాం. కరోనా నేపథ్యంలో వైరసుల చరిత్రను చూసాం. ఇదే కోవలో భౌతిక, రసాయన సంబంధమైన మొదటి 14 ప్రకృతి సూత్రాలను తెలుసుకునే ముందు, ఈ ప్రకృతి సూత్రాల సూత్రీకరణ ఎలా నిర్ధారిస్తారు, ఎలా రూపొందిస్తారు, అసలు ఈ సూత్రాలలోని శాస్త్రీయత ఎంత? …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!!-6 శాస్త్రీయ దృక్పథం – పద్ధతి!(SCIENTIFIC TEMPER – METHOD) Read More »

శబ్ద కాలుష్యం-సమస్యలు- చట్టం

పరిచయం :ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి – సమాజాల మద్య అగాధం పెరిగిపోయింది. కాలుష్యం ప్రధాన కారణం. జనాభా పెరుగుదల, అదనపు విలువను జమ చేయడానికి మనుష్యుల్లోని ఒక గ్రూపు చేసే చర్యల వలన కాలుష్యం పెరిగిపోయింది.కాలుష్యం రెండు రకాలు.(అ) కృత్రిమ కాలుష్యం(ఆ) భావజాల కాలుష్యంకృత్రిమ కాలుష్యం అనేది అగ్ని పర్వతాల ద్వారా, మనిషి చేసే చర్యల ద్వారా (వాహనాలు నడపడం ద్వారా వచ్చే CO2 ద్వారా) కృత్రిమ కాలుష్యం ఏర్పడుతుంది. తాత్వికమైన కాలుష్య భావజాలం లేదా …

శబ్ద కాలుష్యం-సమస్యలు- చట్టం Read More »

మంటో కోపం

ప్రముఖ కథారచయిత సాదల్‍ హసన్‍ మంటో కథలు ఆటవికతని, వ్యభిచారాన్ని శవాలతో సంపర్కాన్ని చేస్తున్న విషయాలని ప్రతిబింబించాయి.దానివల్ల అతను ‘నీతిమంతులకి’ శత్రువయ్యాడు. కోర్టుల బారిన పడ్డాడు. అతని కథల్లో అశ్లీలం వుందని శిక్ష కూడా పడింది. తన విమర్శకులని మంటో చీల్చి చెండాడాడు. ఈ వ్యాసం అతని కోపానికి అసంతృప్తికి వ్యంగ్య సమాధానం.‘‘ఈ కొత్త విషయం మీకు తెలుసా?’’-కొరియా నుంచి వచ్చిన విషయమా?‘‘కాదు. కాదు’’-జునాఘడ్‍ బేగం గురించా?‘‘కాదు..’’-సెన్సేషనల్‍ హత్య జరిగిందా మళ్ళీ?‘‘కాదు. సాదత్‍ హసన్‍ మంటో గురించి’’-ఏమిటీ? అతను చనిపోయినాడా?‘‘కాదు. …

మంటో కోపం Read More »

పిచ్చయ్య గారి బస్సు

దాదాపు అర్థ శతాబ్దం కింద ఒకే ఒక్క ఎర్ర ప్రైవేటు బస్సు సర్వీసు సూర్యాపేటలో పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‍ నుండి మా ఊరు మీదుగా హుజూర్‍నగర్‍కు తిరిగి అదే బస్సు సూర్యాపేటకు నడిచేది. దానిని ‘‘పిచ్చయ్య బస్సు’’ అని ప్రసిద్ధి. అది సూర్యాపేటలో స్టేజీ మీదకు రావటం ఆలస్యం ప్రయాణీకులు ఒకరినొకరు తోసుకుంటూ మూటా ముల్లెతో ఎక్కేవారు. కొందరు కిటికీల నుండి చేతి రుమాలు లేదా నెత్తికి కట్టుకునే రుమాలు వేసి సీటు ఆపుకునే వారు. మరి …

పిచ్చయ్య గారి బస్సు Read More »

ఏ1 మరియు ఏ2 పాలు మానవాళి ఆరోగ్యంపై ప్రభావము

పాలు సంపూర్ణ ఆహారం. ప్రకృతి మనకందించిన వరప్రసాదం. పాలు మరియు పాల పదార్థములను తగిన మోతాదుల్లో స్వీకరించడం వలన ఎముకలు మరియు పళ్ళు దృఢంగా అవుతాయి. ప్రతిదినము పాలు సేవించడం వలన గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం, కేన్సరు, టైప్‍-2 మధుమేహం వంటి జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చును. పాలు 86% నీరు, 4.6% లాక్టోస్‍ షుగరు, 3.7% ట్రైగిసరైడ్లు, 2.8% ప్రోటీన్లు, 0.54% ఖనిజాలు మరియు 3.36% ఇతరత్ర ఘన పదార్థాలను కలిగి ఉండును. పాలలోని ప్రోటీన్లలో, 36% ఆల్ఫా-కేసిన్లు, …

ఏ1 మరియు ఏ2 పాలు మానవాళి ఆరోగ్యంపై ప్రభావము Read More »

గిరిజన మ్యూజియం

పూర్వపు ఆంధప్రదేశ్‍లో నాలుగు చోట్ల గిరిజన సంగ్రహాలయాలున్నాయి. అవి:1.నెహ్రూ శతజయంతి గిరిజన సంగ్రహాలయం, హైదరాబాద్‍.2.చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయం, మన్ననూర్‍, మహబూబ్‍ నగర్‍ జిల్లా.3.చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయం, శ్రీశైలం.4.అరకు గిరిజన సంగ్రహాలయం, అరకులోయ, విశాఖపట్నం జిల్లా. వీటన్నింటినీ పూర్వపు ఆంధప్రదేశ్‍ ప్రభుత్వంవారి గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తూండేది. వీటిల్లో ఆ రాష్ట్రంలోని 35 రకాల తెగల జీవన విధానం, సంస్కృతులకు సంబంధించిన వస్తువులను భద్రపరిచి పర్యాటకులకు, పరిశోధకులకు, విద్యార్థులకు, సందర్శకులకు ప్రదర్శనకై అందుబాటులో ఉంచారు. ఇవి కాక శ్రీ రవీంద్రశర్మ అనే ఔత్సాహికులు వ్యక్తిగతంగా …

గిరిజన మ్యూజియం Read More »

ఉప్పు మర

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. ఒకసారి అతనికి వారం రోజులపాటు తినడానికి బుక్కెడు బువ్వకూడా దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాడు. పొరుగునే ఉన్న ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి…‘‘దొరా! కడుపు కాలుతోంది. తినడానికింత ఏదైనా పెట్టు’’ అన్నాడు. ఆ ధనవంతుడు విసుక్కుంటూ ఒక రొట్టెముక్క తెచ్చాడు. దానిని పేదవాడి మొహంమీదికి విసిరేస్తూ…‘‘ఇది తీసుకొని నరకానికి తగలడు’’ అన్నాడు. ఆ పేదవాడు రొట్టెముక్క తీసుకొని నరకానికి వెళ్ళిపోయాడు. నరకం వీధి తలుపు ముందు ఒక ముసలి …

ఉప్పు మర Read More »

డిసెంబర్‍ 2న కాలుష్య నియంత్రణ దినోత్సవం

పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యపై అవగాహన పెంచడానికి డిసెంబర్‍ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటారు. 1984 డిసెంబర్‍ 2న భోపాల్‍ గ్యాస్‍ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుతున్నారు. నేడు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాలుష్యం. పర్యావరణ కాలుష్యంతో ప్రపంచం పోరాడుతుంది. కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయువు లేదా పర్యావరణానికి వేడి, ధ్వని మొదలైన ఏ విధమైన శక్తితో అయినా కలిపి నిర్వచించవచ్చు. క్రాకర్లు పేలడం, రోడ్లపై నడుస్తున్న …

డిసెంబర్‍ 2న కాలుష్య నియంత్రణ దినోత్సవం Read More »