deccanland

చిన్న రమణయ్య

గామె బస్సుకోసం సూర్యపేట బస్టాండ్ల దీనంగ ఎదురు జూసుకుంట గూసున్నది. అసలే గామె మొకమెప్పుడూ పాలిపోయినట్టు ఉంటది. అసుంటిది ఇయ్యాల మరింకింత పాలిపోయి వున్నది. గామె సదువుకున్నదేంగాదుగద, ఏ బస్సెక్కడి పోతదో దెల్వది-అడిగి దెలుసుకుంటెదప్ప.గామె పేరు సారమ్మ. పుట్టి పెర్గిందేమొ మహదండి -పేదింట్ల! గామె అసలు కులమేందో గామెకే దెల్వది. గామె భర్తకు సుతాదెల్వది. ఇగామె తలిదండ్రులు రాళ్ళుగొట్టుకుంట, రాళ్ళళ్ళ రాళ్ళై, రాళ్ళబతుకులీడ్సుకుంట, ఎండలకెండి, వానల్ల నాని, మొండి బతుకలల్లనే మునిగిదేలుకుంట, అప్పులాకళ్ళకు గిల-గిల గొట్టుకుంటనే వొచ్చినాళ్ళయెపాడై! …

చిన్న రమణయ్య Read More »

సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, శిల్పం

‘మా గ్లూకోజ్‍ బాటిల్‍ బద్దలాయె’ అనే కవితా పాదం ద్వారా లక్ష్యార్థం అవగతమైతది. తద్వారా కవి, ఆయన కాలం, ఆ కవి మీద పనిచేసిన ప్రభావాలు తెలుస్తె, అలా కవి ఆ వస్తువును ఎంపిక చేసుకోవడానికి కారణాలతో పాటు, ఆ వస్తువు తీసుకున్న రూపం అర్థమవుతుంది. ఈ రూపం రావడానికి కారణమైన శిల్పం తెలుస్తుంది. శిల్పంలో భాగమైన భాష, ఆ భాషకే లేదా జాతికే పరిమితమైన జాతీయాలు, పదబంధాలు, సాంస్కృతిక ప్రతిఫలనాలు తెలిసొస్తాయి. కవి జాగరూకతతో వేసిన …

సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, శిల్పం Read More »

సాహిత్య విమర్శలో విభిన్న, విలక్షణ స్వరం ‘సమన్వయ’

డా।। ఎస్‍.రఘు వృత్తిరిత్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులు. ప్రవృత్తిరిత్యా కవి, సాహితీ విమర్శకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య బోధన, సృజన, విమర్శనా రంగాలను ‘సమన్వయం’తో సుసంపన్నం చేస్తుండటం హర్షణీయం. కవిత్వం, విమర్శ రెండింటిని ఉత్తమ ప్రమాణాలతో వెలువరించినవారు అరుదు. ఇట్లాంటి వారిలో రఘు ఒకరు. డా।। ఎస్‍.రఘు విద్యార్థి దశ నుండే సృజనాత్మక సాహిత్యం వెలువరిస్తున్నవారు. వయసు, విద్యార్హతలు, లోక పరిశీలన, జీవితానుభవాలు పెరుగుతున్నకొద్ది చిక్కని జీవనలిపి నానీలను, వచన కవిత్వాన్ని, విమర్శను, సాహిత్యలోకానికి అందిస్తూ వస్తున్నారు. …

సాహిత్య విమర్శలో విభిన్న, విలక్షణ స్వరం ‘సమన్వయ’ Read More »