తెలంగాణా-శిలాజ సంపద కొత్తతెలంగాణ చరిత్రబృందం 8వ నెల వెబినార్‍లో చకిలం వేణుగోపాల్ రావు గారి ప్రసంగ పాఠం
ప్రస్తుతం తెలంగాణ పేరుతో ఉన్న భౌగోళికప్రాంతంలో అతి ప్రాచీనమైనశిలల నుండి క్వాటెర్నరీ మహాయుగపుశిలలదాకా దాదాపు అన్ని భౌమకాలాలకు చెందిన శిలలు విస్తరించి ఉన్నాయి. ప్రాక్ కేంబ్రియన్ కాలానికి చెంది అవక్షేపశిలలు శిలాజాలను కలిగి ఉన్నాయి. ఈ యుగానికి చెందిన శిలావిన్యాసాలు దక్కన్ భూభాగంలో కడప హరివాణము, భీమాహరివాణము, పాకాలహరివాణము, Sullavayi స్తరాలు, పెనుగంగస్తరాలుగా విస్తరించి ఉన్నాయి. వీటిలో కడప హరివాణములోని కర్నూల్ గ్రూపుకు చెందిన శిలలు ఉమ్మడి మహబూబు నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. …