August

సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్‍ అయిన లహరీబాయి!

సాధారణంగా అంబాసిడర్‍గా సినీ సెలబ్రెటీలు లేదా స్పోర్టస్ స్టార్‍లు, ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్‍ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్లనే పెట్టుకోవడం జరుగుతుంది. ఓ సాధారణ యువతి వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ అంబాసిడర్‍ అయ్యింది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఆమెనే అంబాసిడర్‍గా నియమించింది? ఆమె ప్రత్యేకత ఏమిటీ అంటే..అమ్మమ్మ స్పూర్తితోనే..ఆ యువతి పేరు లహరీబాయి మధ్యప్రదేశ్‍లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన …

సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్‍ అయిన లహరీబాయి! Read More »

చిరుధాన్యాలను తేలిగ్గా తీసిపారేయొద్దు..

చిరు ధాన్యాలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. మనపెద్దలు వీటిని రోజు అన్నం లాగే తినే వారు. రాగులు, సజ్జలు, కొర్రలు, అరికలు, వరిగెలు, సామలు ఇలా ఇంకా చాలానే చిరు ధాన్యాలు ఉన్నాయి. చిరు ధాన్యాలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. మనపెద్దలు వీటిని రోజు అన్నం లాగే తినే వారు. రాగులు, సజ్జలు, కొర్రలు, అరికలు, వరిగెలు, సామలు ఇలా ఇంకా చాలానే చిరు ధాన్యాలు …

చిరుధాన్యాలను తేలిగ్గా తీసిపారేయొద్దు.. Read More »

ప్రకృతి సాయం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే …

ప్రకృతి సాయం Read More »

విస్తృత ప్రజాభిప్రాయాల వేదిక ‘దక్కన్‍ల్యాండ్‍’కు పది వసంతాలు

ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే పిల్లర్‍గా పత్రికా రంగాన్ని గౌరవిస్తారు. కనిపించని ప్రతిపక్షం అని కూడా పిలుస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయరంగం, తాగు, సాగునీటి కొరత, సెజ్‍లు, ధర్మల్‍ విద్యుత్‍ కేంద్రాలు, సహజ వనరులు, విచక్షణ, హక్కుల ఉల్లంఘణ వంటి అనేక సామాజిక అంశాలు ఉమ్మడి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన విషయాలు చర్చించే వేదికగా… అభివృద్ధి మార్గదర్శకంగా, ప్రజాస్వామ్యవేదికగా నిలవాలన్న సంకల్పంతో 2012 సెప్టెంబర్‍లో ప్రారంభమైన పత్రిక ‘దక్కన్‍ల్యాండ్‍’. పత్రిక పదేళ్లపాటు నిర్విఘ్నంగా …

విస్తృత ప్రజాభిప్రాయాల వేదిక ‘దక్కన్‍ల్యాండ్‍’కు పది వసంతాలు Read More »

ఆవుల పిచ్చయ్య

ఆగమై తప్పిపోయిన కుటుంబ వ్యక్తి పత్తా దొరికితే ఎంత సంబురమవుతదో, విస్తృతికి గురైన ఆవుల పిచ్చయ్య గురించిన సమాచారం దొరికినంతనే తెలంగాణ సమాజం అంత ఆనందపడ్డది. తెలంగాణా అస్తిత్వసోయితో ఇలా ఎందరినో కనుగొన్నాం. వారి సేవలను రికార్డు చేసుకుంటున్నాం. అలాంటి వారిలో ఆవుల పిచ్చయ్యకు సముచిత స్థానం ఉంది.ఆవుల పిచ్చయ్య తెలంగాణ పోరాట కథలను తెలంగాణ రీసెర్చ్ అండ్‍ రెఫరాల్‍ సెంటర్‍ 2010లో పదిరూపాయల అతి స్వల్ప ధరకు 32 పేజీలతో ఒక పుస్తకాన్ని తెచ్చింది. ఈ …

ఆవుల పిచ్చయ్య Read More »

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’

కృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర వీధులలోనే కాదు కుతుబ్‍షాహీల పరిపాలనలో కార్వాన్‍ సడక్‍ల మీద కూడా కుప్పలు తెప్పలుగా ముత్యాల వ్యాపారం జరిగింది. ఇది ‘‘హవామే పుకార్‍’’ గాలి వార్తలు ఎంత మాత్రం కాదు. శంకా నివృత్తి కోసం ట్రావెర్నియర్‍ అనే ఫ్రెంచి యాత్రికుడు రాసిన జ్ఞాపకాల పుస్తకమో లేక ఫిలిప్స్ మెడాస్‍ టేలర్‍ రాసిన ‘‘కన్‍ఫెషన్స్ ఆఫ్‍ ఎ థగ్‍’’ అన్న నవలో చదవవచ్చు. వర్తకుల బిడారును లేక యాత్రికుల సమూహాన్ని ‘‘కారవాన్‍’’ అని ఉర్దూలోనూ, …

అంగళ్ల రతనాలు అమ్మినారిచట ‘కార్వాన్‍’ Read More »

నలభైఏళ్ల నిరీక్షణలో నిడిగొండ దేవాలయం

ఇక్కడ ఈ దేవాలయం గురించి రాయాలంటే బాధేసింది. అయినా, 800 ఏళ్ల చరిత్రగల కాకతీయ కళా నిలయం శిథిలం కావటం, పదిలపరచటానికి పురావస్తు శాఖపూనుకోవటం, పునర్నిర్మాణంలో అధిగమించరాని అడ్డంకులు, 40 ఏళ్లపాటు నిరీక్షించినా ఇంకా పూర్తికాకపోవటం అన్న విషయాలపై వివరణ ఇవ్వాలనిపించింది. అసలు విషయానికొస్తే. మునుపటి వరంగల్‍ జిల్లా, జనగామ తాలూకా, నిడిగొండ గ్రామంలో స్థానికంగా కుమ్మరిగుళ్లు అని పిలిచే త్రికూటాలయము 1983 వరకూ ఉండేది. ఈ ఆలయం, ఆంధప్రదేశ్‍ రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాలల శాఖ …

నలభైఏళ్ల నిరీక్షణలో నిడిగొండ దేవాలయం Read More »

ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం

మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్‍), లస్కర్‍ (సికింద్రాబాద్‍) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్‍ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్‍ దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర …

ఆరోగ్యదాయిని.. అమ్మకు బోనం Read More »

మహోన్నత త్యాగానికి ప్రతీక.. బక్రీద్‍

హజ్రత్‍ ఇబ్రహీం త్యాగధనుడైన గొప్ప దైవ ప్రవక్త. ‘ఖలీలుల్లాహ్‍’ అనే బిరుదుతో ఆయనను పిలిచేవారు. అంటే ‘అల్లాహ్‍కు స్నేహితుడు’ అని అర్థం. దేవునితో ఏకత్వం కోసం ఆయన ఎంతగానో తపించారు. మొదట్లో సూర్య చంద్రులు, నక్షత్రాల కాంతితో ఆయన ప్రభావితం అయ్యారు. చివరకు అల్లాహ్‍ కృపతో ఋజుమార్గాన్ని పొందారు. తన జాతి వారిని అల్లాహ్‍ వైపు ఆహ్వానించారు. తన తండ్రితో, జాతితో, ఆనాటి పాలకులతో సైతం దైవ ధర్మం కోసం రాజీలేని పోరాటం సాగించారు. చివరకు దైవం …

మహోన్నత త్యాగానికి ప్రతీక.. బక్రీద్‍ Read More »

కుండపోతలోనూ కరెంటు వెలుగులు

2011 ఉమ్మడి ఆంధప్రదేశ్‍, అది వానాకాలం. భారీ వర్షాలకు రామగుండం, మంచిర్యాల మధ్యన గోదావరి నది ఒడ్డున ‘132 కేవీ ఈహెచ్‍టీ’ టవర్‍ కూలిపోయింది. విద్యుత్‍ ఉత్పత్తి కేంద్రాల నుంచి గోదావరి ఆవల ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాకు కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 25 లక్షల మంది ప్రజానీకం 10 రోజులకు పైగా చీకట్లో మగ్గిపోయారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. తిరిగి టవర్‍ నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యుత్‍ …

కుండపోతలోనూ కరెంటు వెలుగులు Read More »