పోరాటాల పురిటిగడ్డ ‘ధూల్‍పేట్’
మనం ధూల్‍పేట వీధులలో తిరుగుతుంటే నయాదౌర్ సీన్మాలో దిలీప్‍కుమార్ పాడిన ‘‘ఏ దేశ్‍హై వీర్ జవానోంకా, అల్బేలోంకా, మస్తానోంకా’’ పాట యాదికి వస్తుంది.ధూల్‍పేట్ చౌరాస్తాలో నిలబడి ‘‘వీర గంధము తెచ్చినాము వీరులెవ్వరో తెల్పుడి, పూసిపోతుము – మెడలో వేతుము పూలదండలు భక్తితో’’ అని పాడితే ప్రతి ఇంటి నుండి ఒక వీరుడు, ఒక వస్తాదు, ఒక పహిల్వాన్ మీసాలు మెలిపెడుతూ తొడలు చరుస్తూ మన ముందు హాజరవుతారు. మనం పట్టుకెళ్లిన గంధమూ సరిపోదు, పూలదండలూ సరిపోవు. కృష్ణాజిల్లాలో …